
శరన్నవరాత్రుల సందర్భంగా పూజ్య గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆశీస్సులతో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఇవాళ సోమవారం(సెప్టెంబర్ 29, 2025) నుంచి మూడు రోజుల పాటు నవరాత్రి హోమాలను నిర్వహిస్తోంది. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు స్వామి సూర్యపాద, స్వామి శ్రద్ధానందల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలలో తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు పాల్గొంటున్నారు.
ఈ ఉత్సవాలలో భాగంగా 28వ తేదీ ఆదివారం ఉదయం గం. 8.30 ల నుంచి శ్రీ మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్య హోమం, వాస్తుహోమం అనంతరం ప్రసాద వితరణ తదితరాలను ఘనంగా జరిగాయి.
కాగా, ఈ రోజు సాయంత్రం 5గం.ల నుంచి స్వామి సూర్యపాద గారిచే ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగం, సామూహిక లలితా సహస్రనామ పారాయణ, కుంకుమార్చన, మహాలక్ష్మి హోమం, శ్రీ సుదర్శన హోమం, అనంతరం ప్రసాద వితరణ ఉంటాయి. అలాగే ఈ వేడుకులో పాల్గొనదలిచని భక్తులందరికీ ఉచితప్రవేశం కల్పిస్తున్నారు నిర్వాహకులు.