నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిల దాడి

Crooks Attack On Birthday Event On Nampally - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాంపల్లిలో బర్త్‌డే వేడుకపై ఆకతాయిలు దాడికి తెగబడ్డారు. కమ్యూనిటీ హల్లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో బ్యాండ్‌ ఆపకపోవడంతో 10 మంది యువకులు గొడవ చేశారు. బర్త్‌డే పార్టీ నిర్వహిస్తున్న వారిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో పలువురికి గాయాలవ్వగా వారిని ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో దాడి నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. బాధితులు నాంప‌ల్లి పోలీసు స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

చదవండి: ఇన్‌స్టా పరిచయం.. ప్రేమ అంగీకరించలేదని ప్రియుడి ఆత్మహత్య 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top