జనవరి 1 నుంచి నుమాయిష్‌

Nampally Numaish Exhibition  - Sakshi

హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జనవరి 1న 83వ నుమాయిష్‌ ప్రారంభానికి ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్‌ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి.   

ఒకేచోట అన్ని వస్తువులు.. 
ఎగ్జిబిషన్‌లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్‌ïÙట్లు, కిచెన్‌వేర్‌ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్‌షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి.   

టికెట్‌ ధర రూ.40.. 
ఎగ్జిబిషన్‌ను సుమారు 22 లక్షల మంది సందర్శింనున్నట్లు అంచనా. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎగ్జిబిషన్‌ సొసైటీ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్‌కు వచ్చే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్, గేట్ల వద్ద మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీ చేసి సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. టికెట్‌ ధర రూ.40. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి.   

సందర్శకులకు కనువిందు చేస్తాం..  
ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్రీడా పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాం. సందర్శకుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాట్లు చేస్తాం.  
– ఏనుగుల రాజేందర్‌ కుమార్, ఎగ్జిబిషన్‌ సొసైటీ కోశాధికారి  

తెలంగాణ విద్యావ్యాప్తికి కృషి  
ఎగ్జిబిషన్‌ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటుపడుతున్నాం.   
– బి.హన్మంతరావు, ఎగ్జిబిషన్‌ కార్యదర్శి 

33 సబ్‌ కమిటీల ద్వారా ఏర్పాట్లు.. 
33 సబ్‌ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్‌ను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్‌ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎగ్జిబిషన్‌ సబ్‌ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారు.   
– వనం సత్యేందర్, ఎగ్జిబిషన్‌ సొసైటీ ఉపాధ్యక్షుడు  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top