
హైదరాబాద్: నగరంలో వానొస్తే ప్రాణాలు గల్లంతే అనే దుస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం గంటసేపు వర్షం దంచికొట్టడంతో రహదారులు చెరువులను తలపించాయి. నాలాలు ఉప్పొంగాయి. ముషీరాబాద్‌తో పాటు తట్టి అన్నారంలో 12.8 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. వరద ప్రవాహంలో నాంపల్లి పరిధి హబీబ్‌నగర్‌లోని అఫ్జల్‌సాగర్‌లో ఇద్దరు, ముషీరాబాద్‌లో మరొకరు కొట్టుకుపోయారు. కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, జలమండలి బృందాలు రంగంలోకి దిగి వరద నీటిని తొలగించేందుకు చర్యలు చేపట్టాయి.