ఫిన్ అలెన్ చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా! | Finn Allen 1st New Zealand Batter Score Three T20 Centuries In 2026 | Sakshi
Sakshi News home page

ఫిన్ అలెన్ చరిత్ర.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా!

May 8 2026 11:50 PM | Updated on May 8 2026 11:58 PM

Finn Allen 1st New Zealand Batter Score Three T20 Centuries In 2026

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో కేకేఆర్ ఓపెన‌ర్ ఫిన్ అలెన్ త‌న విలువేంటో తొలిసారి చూపించాడు. శుక్ర‌వారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెన‌ర్ శ‌త‌కంతో చెల‌రేగాడు. 47 బంతుల్లోనే సెంచ‌రీ మార్క్ అందుకున్న ఫిన్ అలెన్ సుడిగాలి ఇన్నింగ్స్ ధాటికి కేకేఆర్ 143 ప‌రుగుల ల‌క్ష్యాన్ని కేవ‌లం 14.2 ఓవ‌ర్ల‌లోనే ఛేదించ‌డం విశేషం. ఈ నేప‌థ్యంలోనే ఫిన్ అలెన్ ప‌లు రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

👉 2026 క్యాలెండ‌ర్ ఇయ‌ర్‌లో మూడు సెంచ‌రీలు బాదిన తొలి న్యూజిలాండ్ క్రికెట‌ర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు. ఈ ఏడాదిలో బీబీఎల్‌లో పెర్త్ స్కార్చ‌ర్స్ త‌ర‌ఫున 53 బంతుల్లో 101 ప‌రుగులు చేశాడు. ఇక 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో న్యూజిలాండ్ త‌ర‌ఫున 33 బంతుల్లోనే సెంచ‌రీ మార్కును అందుకోవ‌డం విశేషం. తాజాగా ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో మ్యాచ్‌లో 47 బంతుల్లో శ‌త‌కం సాధించాడు.

👉 ఐపీఎల్‌లో న్యూజిలాండ్ త‌ర‌ఫున సెంచ‌రీ సాధించిన రెండో బ్యాట‌ర్‌గా ఫిన్ అలెన్ నిలిచాడు. ఫిన్ అలెన్ కంటే ముందు బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ ఈ ఫీట్ సాధించాడు. మెక్‌క‌ల్ల‌మ్ ఐపీఎల్‌లో రెండుసార్లు సెంచ‌రీ మార్క్ చేరుకున్నాడు. మెక్‌క‌ల్ల‌మ్‌ కేకేఆర్ త‌ర‌ఫున తొలి శ‌త‌కం, సీఎస్‌కే త‌ర‌ఫున రెండో శత‌కాన్ని అందుకున్నాడు.

👉 ఢిల్లీతో మ్యాచ్‌లో సెంచ‌రీ బాదిన ఫిన్ అలెన్ పేస‌ర్ల బౌలింగ్‌లో 16 బంతుల్లో 27 ప‌రుగులు రాబ‌ట్టాడు. అదే స‌మ‌యంలో స్పిన్న‌ర్ల బౌలింగ్‌లో 31 బంతుల్లోనే 73 ప‌రుగులు సాధించ‌డం విశేషం. త‌ద్వారా ఐపీఎల్‌లో స్పిన్న‌ర్ల బౌలింగ్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన బ్యాట‌ర్ల జాబితాలో ఫిన్ అలెన్ సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.

👉 ఐపీఎల్‌లో కేకేఆర్‌ త‌ర‌ఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన జాబితాలో ఫిన్ అలెన్ (10 సిక్స‌ర్లు) మూడో స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఆండ్రీ ర‌సెల్ (11 సిక్స‌ర్లు వ‌ర్సెస్ సీఎస్‌కే, 2018),  తొలి స్థానంలో బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్ (13 సిక్స‌ర్లు వ‌ర్సెస్ ఆర్సీబీ, 2008) కొనసాగుతున్నాడు.

👉 ఐపీఎల్‌లో కేకేఆర్ త‌ర‌ఫున ఫిన్ అలెన్‌ది నాలుగో సెంచ‌రీ. గ‌తంలో మెక్‌క‌ల్ల‌మ్ (158 నాటౌట్‌), వెంక‌టేశ్ అయ్య‌ర్ (104), సునీల్ న‌రైన్ (109) సెంచ‌రీలు సాధించారు.

👉 ఇదే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ అత్యంత చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది.  ఈ సీజ‌న్‌లో అరుణ్‌జైట్లీ స్టేడియంలో ఢిల్లీకి ఇది వరుస‌గా ఐదో ఓట‌మి కావ‌డం గ‌మనార్హం. గతంలో 2013 నుంచి 2015 మ‌ధ్య ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌రుస‌గా తొమ్మిది మ్యాచ్‌ల్లో ప‌రాజ‌యం చ‌విచూసింది.

చదవండి: ఫిన్ అలెన్ సెంచ‌రీ.. ఢిల్లీపై కేకేఆర్‌ విజయం

Advertisement
 
Advertisement
Advertisement