ఫిన్‌ అలెన్‌ ఊచకోత | IPL 2026 SRH VS KKR: Finn Allen Scored second highest runs in innings first over of IPL | Sakshi
Sakshi News home page

ఫిన్‌ అలెన్‌ ఊచకోత

Apr 2 2026 10:17 PM | Updated on Apr 3 2026 10:24 AM

IPL 2026 SRH VS KKR: Finn Allen Scored second highest runs in innings first over of IPL

ఐపీఎల్‌ 2026లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 2) జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ చెలరేగిపోయాడు. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో డేవిడ్‌ పేన్‌ వేసిన తొలి ఓవర్‌లో ఉగ్రరూపం దాల్చాడు. 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 24 పరుగులు పిండుకొని, ఐపీఎల్‌ చరిత్రలో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో రెండో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

ఈ రికార్డు రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ పేరిట ఉంది. జైస్వాల్‌ 2023 ఎడిషన్‌లో కేకేఆర్‌పై తొలి ఓవర్‌లో ఏకంగా 26 పరుగులు పిండుకున్నాడు. ఫిన్‌ అలెన్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు పృథ్వీ షాతో కలిసి ఈ రికార్డును షేర్‌ చేసుకున్నాడు. షా 2021 ఎడిషన్‌లో కేకేఆర్‌పై తొలి ఓవర్‌లో 24 పరుగులు రాబట్టాడు.

ఐపీఎల్‌ ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
26 - యశస్వి జైస్వాల్ (RR) vs KKR, 2023
24 - పృథ్వీ షా (DC) vs KKR, 2021
24 - ఫిన్ అలెన్ (KKR) vs SRH, 2026*
22 - యశస్వి జైస్వాల్ (RR) vs PBKS, 2025
21 - నమన్ ఓజా (RR) vs KKR, 2009
21 - సునీల్ నరైన్ (KKR) vs RR, 2018

మ్యాచ్‌ విషయానికొస్తే.. 227 పరుగుల భారీ లక్ష్య ఛేదనను కేకేఆర్‌ ధాటిగా ప్రారంభించింది. అలెన్‌ (7 బంతుల్లో 28; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు అలజడి సృష్టించి ఔటయ్యాడు. అనంతరం అంగ్‌క్రిష్‌ రఘువంశీ బ్యాట్‌ ఝులిపించడం ప్రారంభించాడు. 

అయితే ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌లో కేకేఆర్‌కు కోలుకోని లేని దెబ్బ తగిలింది. దురదృష్టవశాత్తు గ్రీన్‌ రనౌటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత కేకేఆర్‌ స్కోర్‌ 79-3గా ఉంది. రఘువంశీ (35), రింకూ సింగ్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు. హర్ష్‌ దూబే, ఉనద్కత్‌కు తలో వికెట్‌ దక్కింది.

అంతకుముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ భారీ స్కోర్‌ చేసింది. 20 ఓవర్లలో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. హెడ్‌ (46), అభిషేక్‌ (48), క్లాసెన్‌ (52), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (39) రాణించారు. కేకేఆర్‌ బౌలర్లలో ముజరబానీ 4, వైభవ్‌ ఆరోరా 2, కార్తీక్‌ త్యాగి ఓ వికెట్‌ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement