పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌ | Under 19 World Cup 2026: India all out for 252 vs Pakistan in super six match | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌తో కీలక మ్యాచ్‌.. టీమిండియా గౌరవప్రదమైన స్కోర్‌

Feb 1 2026 5:21 PM | Updated on Feb 1 2026 5:29 PM

Under 19 World Cup 2026: India all out for 252 vs Pakistan in super six match

అండర్‌–19 ప్రపంచకప్‌-2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 1) భారత్‌, పాకిస్తాన్‌ జట్ల మధ్య కీలకమైన సూపర్‌ సిక్స్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు చాలా కీలకం. పాకిస్తాన్‌ భారీ విజయం సాధిస్తేనే టోర్నీలో నిలబడుతుంది. భారత్‌ ఇప్పటికే సెమీఫైనల్‌ దిశగా అడుగులు వేసినా, పాక్‌ చేతిలో భారీ ఓటమి ఎదురైతే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది.  

బులవాయో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేస్తుంది. పాక్‌ ఆహ్వానం మేరకు బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఆదిలో తడబడినా, మధ్యలో కోలుకుంది. వేదాంత్‌ త్రివేది (68) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో భారత్‌ను గౌరవప్రదమైన స్కోర్‌ దిశగా నడిపించాడు. ఆఖర్లో కనిష్క్‌ చౌహాన్‌ (35), ఖిలన్‌ పటేల్‌ (21) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మొత్తంగా భారత్‌ నిర్ణీత 49.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది.

భారత బ్యాటర్లలో ఆరోన్‌ జార్జ్‌ (16), కెప్టెన్‌ ఆయుశ్‌ మాత్రే (0), అభిగ్యాన్‌ కుందు (16), దీపేశ్‌ దేవేంద్రన్‌ (1) విఫలం కాగా.. వైభవ్‌ సూర్యవంశీ (30), విహాన్‌ మల్హోత్రా (21), అంబ్రిష్‌ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పాక్‌ బౌలర్లలో అబ్దుల్‌ సుభాన్‌ 3, మొహమ్మద్‌ సయ్యద్‌ 2, అలీ రజా, అహ్మద్‌ హుసేన్‌, మొమిన్‌ ఖమార్‌, అలీ హస్సన్‌ బలోచ్‌ తలో వికెట్‌ తీశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement