breaking news
Vedant Trivedi
-
సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే!
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi)కి కోపమొచ్చింది. అంపైర్ తీసుకున్న నిర్ణయం కారణంగా అతడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఐపీఎల్-2025 (IPL 2025)లో సత్తా చాటిన ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు.. ప్రస్తుతం భారత అండర్-19 జట్టు తరఫున దుమ్ములేపుతున్నాడు.ఆస్ట్రేలియా పర్యటనలోనూ..ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో యూత్ వన్డే, టెస్టుల్లో అదరగొట్టిన వైభవ్ సూర్యవంశీ.. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఆసీస్ అండర్-19 జట్టుతో యూత్ వన్డేల్లో మూడు మ్యాచ్‌లలో వరుసగా 38, 70, 16 పరుగులు చేసిన వైభవ్.. సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయడంలో తనవంతు పాత్ర పోషించాడు.ఇక ఆసీస్ అండర్-19 జట్టుతో తొలి యూత్ టెస్టులో వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసకర శతకంతో చెలరేగడం విశేషం. కేవలం 86 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 113 పరుగులు రాబట్టాడు ఈ ఓపెనింగ్ బ్యాటర్. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 58 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.HUNDRED FOR 14-YEAR-OLD VAIBHAV SURYAVANSHI IN AUSTRALIA Smashed a brilliant 100 off 78 balls vs Australia U-19 at Ian Healy Oval. A future star in the making!#vaibhavsuryavanshi pic.twitter.com/ZWE0GTNBN1— Rupeshh Suryavanshi (@RupeshSurya288) October 1, 2025ఆసీస్ 135 పరుగులకే ఆలౌట్‌ఈ క్రమంలో భారత్- ఆసీస్ అండర్-19 జట్ల మధ్య మంగళవారం (అక్టోబరు 7) రెండో యూత్ టెస్టు మొదలైంది. మెకాయ్ వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ధాటికి 43.3 ఓవర్లలో కేవలం 135 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.ఆసీస్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ అలెక్స్ లీ యంగ్ (66) టాప్ రన్ స్కోరర్‌గా నిలవగా.. భారత బౌలర్లలో హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు. ఉద్ధవ్ మోహన్ రెండు, దీపేశ్ దేవేంద్రన్ ఒక వికెట్ దక్కించుకున్నారు.అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలు పెట్టిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. విల్ బైరోమ్ బౌలింగ్ అలెక్స్టర్నర్కు క్యాచ్ ఇచ్చి కెప్టెన్ ఆయుశ్ మాత్రే (4) పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ విహాన్ మల్హోత్రా (11) కూడా విఫలమయ్యాడు.ఊహించని విధంగా..ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ సత్తా చాటుతాడని ఆశించగా.. అందుకు తగ్గట్లుగానే దూకుడుగా తన ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. 14 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 20 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నవేళ.. ఊహించని విధంగా అవుటయ్యాడు.చార్ల్స్ లచ్మండ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్‌కు క్యాచ్ ఇచ్చి వైభవ్ పెవిలియన్ చేరాడు. అయితే, అంపైర్ నిర్ణయం పట్ల వైభవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. బంతి బ్యాట్ కంటే ముందు ప్యాడ్‌కు తాకిందని వైభవ్ అంపైర్‌తో వాదించినట్లు కనిపించింది.సహనం కోల్పోయిన వైభవ్ఈ క్రమంలో సహనం కోల్పోయిన వైభవ్ అవుటైన కాసేపటి దాకా క్రీజును వీడకుండా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అన్యమస్కకంగానే పెవిలియన్ చేరాడు. ఇక వైభవ్‌తో పాటు మరో ఎండ్‌లో ఉన్న వేదాంత్ త్రివేవది కూడా అంపైర్‌తో ఇదే విషయం గురించి కాసేపు చర్చించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Vaibhav Suryavanshi was wrongly given out in the second Youth Test against Australia U19. He looked shocked by the decision and gestured to indicate that there was a clear gap between the bat and the ball. pic.twitter.com/En8tKe4ErE— Varun Giri (@Varungiri0) October 7, 2025 ఇక మ్యాచ్ విషయానికొస్తే.. మంగళవారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 40 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఆసీస్ కంటే తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిది పరుగుల ఆధిక్యంలో నిలిచింది. వైభవ్ 20 పరుగులు చేయగా.. వేదాంత్ 25, ఖిలన్ పటేల్ 26 పరుగులు చేశారు. హెనిల్ పటేల్ 22, దీపేశ్ దేవేంద్రన్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.చదవండి: రోహిత్‌ను తప్పించడం సరైన నిర్ణయం.. కోహ్లి జట్టులో కొనసాగాలంటే..: డివిలియర్స్ -
IND VS AUS: వైభవ్, వేదాంత్ శతకాలు.. టీమిండియా భారీ స్కోర్
ఆస్ట్రేలియా పర్యటనలో భారత యువ జట్టు (అండర్-19) దుమ్మురేపుతుంది. తొలుత వన్డే సిరీస్‌ను క్లీన్ చేసిన భారత్.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను (India U19 vs Australia U19) ఘనంగా ప్రారంభించింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (86 బంతుల్లో 113; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ వేదాంత్ త్రివేది (Vedant Trivedi) (192 బంతుల్లో 140; 19 ఫోర్లు) శతకాలతో కదంతొక్కారు. ఖిలన్ పటేల్ (49) రాణించాడు. ఆయుశ్ మాత్రే (21), అభిగ్యాన్ కుందు (26), రాహుల్ కుమార్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ విల్ మలాజ్చుక్, హేడెన్ స్కిల్లర్ తలో 3 వికెట్లు తీయగా.. ఆర్యన్ శర్మ 2, థామస్ ప్యాడింగ్టన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగలకు ఆలౌటైంది. పేసర్ దీపేశ్ దేవేంద్రన్ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ పతనాన్ని శాశించాడు.మరో పేసర్ కిషన్ కుమార్ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో వన్ డౌన్ బ్యాటర్ స్వీవెన్ హోగన్ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. భారత్‌కు 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఆట రెండో రోజు మూడో సెషన్ నడుస్తుంది. చదవండి: World Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్ -
IND vs AUS: వైభవ్ సూర్యవంశీ విఫలం.. అయినా భారత్ భారీ స్కోరు
ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో నామమాత్రపు మూడో యూత్ వన్డే (IND U19 vs AUS U19 3rd ODI)లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) విఫలమయ్యాడు. గత రెండు మ్యాచ్‌లలో అదరగొట్టిన ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఈసారి మాత్రం పదహారు పరుగులకే పరిమితమయ్యాడు.ఇక.. మరో ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే (6, 0, 4)బ్యాట్‌తో తన వైఫల్యాన్ని కొనసాగించాడు. టాపార్డర్‌లో ఇలా ఓపెనర్లు నిరాశపరిచినా వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రా (40) మాత్రం ఫర్వాలేదనిపించాడు.అదరగొట్టిన వేదాంత్, రాహుల్అయితే, ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినప్పటికీ.. మిడిలార్డర్లో వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్ (Rahul Kumar) అదరగొట్టడంతో.. భారత్ భారీ స్కోరు చేయగలిగింది. వేదాంత్ 92 బంతుల్లో 86, రాహుల్ కుమార్ 84 బంతుల్లో 62 పరుగులు సాధించారు. మిగతా వారిలో వికెట్ కీపర్ బ్యాటర్ హర్వన్ష్ పంగాలియా 23, ఖిలాన్ పటేల్ 20* పరుగులు చేశారు.ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్ల ఆట ముగిసే సరికి భారత అండర్-19 జట్టు తొమ్మిది వికెట్ల నష్టానికి 280 పరుగులు చేసింది. ఆసీస్ యువ బౌలర్లలో విల్ బిరోమ్, కేసీ బార్టన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. చార్ల్స్ లాచ్మండ్, బెన్ గోర్డాన్, కెప్టెన్ విల్ మలాజుక్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.ఇప్పటికే సిరీస్ 2-0తో కైవసంకాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న వన్డేల్లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. ఇప్పటికే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక శుక్రవారం నాటి మూడో యూత్ వన్డేలోనూ బ్యాటింగ్ పరంగా మరోసారి దుమ్మురేపింది. ఇక బౌలర్ల పనే మిగిలి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులు చేశాడు. రెండో వన్డేలో 68 బంతుల్లో 70 పరుగులు సాధించాడు.చదవండి: అందుకే షమీని సెలక్ట్ చేయలేదు: కుండబద్దలు కొట్టిన అగార్కర్ -
IND vs AUS: మరోసారి దుమ్మురేపిన వైభవ్ సూర్యవంశీ.. భారత్ భారీ స్కోరు
భారత్ అండర్-19 క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు (IND U19 vs AUS U19)తో రెండో యూత్ వన్డేలో ఈ పద్నాలుగేళ్ల పిల్లాడు అద్భుత అర్ధ శతకం సాధించాడు. కాగా మూడు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత యువ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది.ఇందులో భాగంగా బ్రిస్బేన్ వేదికగా ఆదివారం జరిగిన తొలి యూత్ వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 22 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. Vaibhav Suryavanshi's first game in Australia was seriously entertaining 👏Highlights: https://t.co/hfQabdpRwD pic.twitter.com/TdGijK0ZpG— cricket.com.au (@cricketcomau) September 22, 2025 ఆసీస్‌పై 1-0తో ఆధిక్యంఇక నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన వేదాంత్ త్రివేది (61 నాటౌట్), అభిగ్యాన్ కుందు (87 నాటౌట్) అజేయ అర్ధ శతకాలతో రాణించి జట్టును విజయతీరాలకు చేర్చారు.ఫలితంగా ఆసీస్‌పై 1-0తో ఆధిక్యం సాధించిన భారత్.. తాజాగా బుధవారం నాటి రెండో వన్డేలోనూ అదరగొట్టింది. బ్రిస్బేన్ వేదికగా రెండో యూత్ వన్డేలో టాస్ గెలిచిన ఆతిథ్య ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది.ఆయుశ్ మాత్రే డకౌట్ఓపెనర్, కెప్టెన్ ఆయుశ్ మాత్రే డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ.. వన్‌డౌన్ బ్యాటర్ విహాన్ మల్హోత్రాతో కలిసి ఇన్నింగ్స్ గాడిలో పెట్టాడు. వీరిద్దరు అద్భుత అర్ధ శతకాలతో రాణించారు.వైభవ్, విహాన్ హాఫ్ సెంచరీలువైభవ్ మొత్తంగా 68 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 70 పరుగులు సాధించగా.. విహాన్ 74 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్స్ బాది 70 పరుగులు రాబట్టాడు. మిగతా వారిలో వేదాంత్ త్రివేది 26 పరుగులు చేయగా.. వికెట కీపర్ బ్యాటర్ అభిగ్యాన్ కుందు మరోసారి హాఫ్ సెంచరీతో అలరించాడు.అభిగ్యాన్ మరోసారిఅభిగ్యాన్ 64 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు కొట్టి 71 పరుగులు సాధించాడు. అయితే, అనూహ్య రీతిలో అతడు రనౌట్ అయ్యాడు. ఏదేమైనా టాపార్డర్, మిడిలార్డర్ చెలరేగడంతో టీమిండియా 300 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, లోయర్ ఆర్డర్ విఫలం కావడంతో 49.4 ఓవర్లలో ఆలౌట్ అయింది.ఆస్ట్రేలియా అండర్-19 బౌలర్లలో విల్ బైరోమ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. కెప్టెన్ యశ్ దేశ్‌ముఖ్ రెండు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో కాసే బార్టన్, హైడెన్ షీలర్, జాన్ జేమ్స్, ఆర్యన్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత్ ఘన విజయంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా అండర్-19 జట్టు.. 47.2 ఓవర్లలో 249 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 51 పరుగుల తేడాతో గెలిచిన భారత యువ జట్టు సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. రెండో యూత్ వన్డేలో భారత బౌలర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే మూడు వికెట్లతో రాణించగా.. కనిష్క్ చౌహాన్ రెండు, కిషన్ కుమార్, ఆర్ఎస్ అంబరీశ్, ఖిలాన్ పటేల్, విహాన్ మల్హోత్రా ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: బీసీసీఐకి శ్రేయస్ అయ్యర్ లేఖ!.. ఇకపై నేను...


