
ఆస్ట్రేలియా పర్యటనలో భారత యువ జట్టు (అండర్-19) దుమ్మురేపుతుంది. తొలుత వన్డే సిరీస్‌ను క్లీన్ చేసిన భారత్.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను (India U19 vs Australia U19) ఘనంగా ప్రారంభించింది. బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (86 బంతుల్లో 113; 9 ఫోర్లు, 8 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ వేదాంత్ త్రివేది (Vedant Trivedi) (192 బంతుల్లో 140; 19 ఫోర్లు) శతకాలతో కదంతొక్కారు. ఖిలన్ పటేల్ (49) రాణించాడు.
ఆయుశ్ మాత్రే (21), అభిగ్యాన్ కుందు (26), రాహుల్ కుమార్ (23) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో కెప్టెన్ విల్ మలాజ్‌చుక్, హేడెన్ స్కిల్లర్ తలో 3 వికెట్లు తీయగా.. ఆర్యన్ శర్మ 2, థామస్ ప్యాడింగ్టన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.
అంతకుముందు భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగలకు ఆలౌటైంది. పేసర్ దీపేశ్ దేవేంద్రన్ (16.2-6-45-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ పతనాన్ని శాశించాడు.మరో పేసర్ కిషన్ కుమార్ (16-4-48-3) కూడా సత్తా చాటాడు. అన్మోల్జీత్ సింగ్, ఖిలన్ పటేల్ తలో వికెట్ తీశారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌లో వన్ డౌన్ బ్యాటర్ స్వీవెన్ హోగన్ (246 బంతుల్లో 92) ఒక్కడే రాణించాడు. భారత్‌కు 185 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ప్రస్తుతం ఆట రెండో రోజు మూడో సెషన్ నడుస్తుంది.
చదవండి: World Cup 2025: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్