breaking news
Thomas Rew
-
అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్
అండర్-19 ప్రపంచకప్ 2026 చాంపియన్స్‌గా యువ భారత జట్టు అవతరించింది. శుక్రవారం హరారే వేదికగా జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. ఆరో అండర్-19 వరల్డ్‌కప్ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. 412 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కాలేబ్ ఫాల్కనర్(115 ) ఒంటరి పోరాటం చేశాడు. భారత బౌలర్లలో ఆర్ఎస్ అంబరీష్ మూడు వికెట్లు పడగొట్టగా.. కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ తలా రెండు వికెట్లు సాధించారు. ఎనిమిదో వికెట్ డౌన్269 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన మింటో..అంబరిష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు ఫాల్కనర్(77) మాత్రం ఒంటరి పోరాటం చేస్తున్నాడు.ఫాల్కనర్ ఒంటరి పోరాటం31 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ 7 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. కాలేబ్ ఫాల్కనర్ (58) దూకుడుగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 166 పరుగులు కావాలి.ఇంగ్లండ్ ఏడో వికెట్ డౌన్142 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన థామస్ రెవ్.. కనిష్క్ చౌహాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 227 పరుగులు అవసరమవ్వగా.. ఆరో టైటిల్‌ను ముద్దాడేందుకు భారత్‌కు మూడు వికెట్లు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లుఅయూశ్ మాత్రే వేసిన 21 ఓవర్లో ఇంగ్లండ్ వరుసగా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 66 పరుగులు చేసిన బెన్ డాకిన్స్ క్యాచ్ ఔట్ కాగా.. రాల్ఫీ ఆల్బర్ట్ క్లీన్ రనౌటయ్యాడు. 21 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 174/5ఇంగ్లండ్ మూడో వికెట్ డౌన్142 పరుగుల వద్ద ఇంగ్లండ్ మూడో వికెట్ కోల్పోయింది. 31 పరుగులు చేసిన థామస్ రెవ్.. కనిష్క్ చౌహాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఇంగ్లండ్ రెండో వికెట్ డౌన్93 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన బెన్ మేయెస్.. ఖిలాన్ పటేల్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. 15 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 114/2తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్భారీ లక్ష్య చేధనకు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. 17 పరుగులు చేసిన జోసెఫ్ మూర్స్.. అంబరీష్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 7 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 25/1భారత్ భారీ స్కోరుఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం (80 బంతుల్లో 175)తో మెరవగా.. కెప్టెన్ ఆయుశ్ మాత్రే హాఫ్ సెంచరీ (53) సాధించాడు. వేదాంత్ 32, విహాన్ 30, అభిజ్ఞాన్ 40 పరుగులతో రాణించగా.. ఆఖర్లో కనిష్క్ 20 బంతుల్లో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది.UPDATES:తొమ్మిదో వికెట్ డౌన్48.6: హెనిల్ పటేల్ (5) రనౌట్. తొమ్మిదో వికెట్ డౌన్. స్కోరు: 393-9(49)ఎనిమిదో వికెట్ డౌన్46.4: సెబాస్టియన్ బౌలింగ్‌లో ఖిలాన్ పటేల్ (3) అవుట్. క్రీజులోకి హెనిల్ పటేల్. స్కోరు: 376-8(47).ఏడో వికెట్ కోల్పోయిన భారత్45.1: జేమ్స్ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరినఅంబరీష్ (18). క్రీజులోకి ఖిలాన్ పటేల్ఆరో వికెట్ డౌన్44.2: సెబాస్టియన్ బౌలింగ్‌లో రాల్ఫీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన అభిజ్ఞాన్ (40). క్రీజులోకి వచ్చిన కనిష్క్ చౌహాన్. స్కోరు: 367-6 (45). 41 ఓవర్లలో భారత్ స్కోరు: 323-5(41)అంబరీష్ పది, అభిజ్ఞాన్ ఏడు పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ కోల్పోయిన భారత్36.3: సెబాస్టియన్ బౌలింగ్‌లో మేయ్స్కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగిన వేదాంత్ (32). ఆర్ఎస్ అంబరీశ్ క్రీజులోకి వచ్చాడు.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్34.2: జేమ్స్ బౌలింగ్‌లో డాకిన్స్కు క్యాచ్ ఇచ్చి విహాన్ (30) అవుట్. క్రీజులోకి అభిజ్ఞాన్ కుందు. స్కోరు: 304-4(34.4). వేదాంత్ 29 పరుగులతో ఉన్నాడుభారత్ స్కోరు: 297-3(33)విహాన్ మల్హోత్రా 27, వేదాంత్ త్రివేది 27 పరుగులతో ఉన్నారు.వైభవ్ డబుల్ సెంచరీ మిస్వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్ పడింది. సుడిగాలి ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. డబుల్ సెంచరీ చేసేందుకు కేవలం 25 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 80 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్..15 ఫోర్లు, 15 సిక్స్‌లతో 175 పరుగులు చేశాడు. స్కోరు: 253-3(26)వైభవ్ సెంచరీ19.6ఫ: 55 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్రెండో వికెట్ డౌన్18.6: అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో మేయ్స్కు క్యాచ్ ఇచ్చి ఆయుశ్ (53) అవుట్. విహాన్ మల్హోత్రా క్రీజులోకి రాగా.. వైభవ్ 97 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 162-2(19)వంద పరుగుల భాగస్వామ్యంఆయుశ్ మాత్రే- వైభవ్ సూర్యవంశీ వంద పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకున్నారు.స్కోరు: 122-1 (15).హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ సూర్యవంశీ10.5: ఫర్హాన్ అహ్మద్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్న వైభవ్. 31 బంతుల్లో అర్ధ శతకం. స్కోరు: 89-1 (11). ఆయుశ్ 28 పరుగులతో ఉన్నాడు.భారత్ హాఫ్ సెంచరీ- 53-1(8) ఆయుశ్ 18, వైభవ్ 24 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన భారత్3.6: సెమీస్‌లో సెంచరీ చేసిన ఓపెనర్ ఆరోన్ జార్జ్ (11 బంతుల్లో 9).. అలెక్స్ గ్రీన్ బౌలింగ్‌లో అవుట్. స్కోరు: 20-1(4). వైభవ్ సూర్యవంశీ 10 పరుగులతో ఉండగా.. ఆయుశ్ మాత్రే క్రీజులోకి వచ్చాడు.మా వాళ్లు అదరగొడతారు..ఈ సందర్భంగా భారత యువ జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే మాట్లాడుతూ.. "మేము తొలుత బ్యాటింగ్ చేస్తాము. పిచ్ బాగుందనిపిస్తోంది. మెరుగైన స్కోరు సాధిస్తాం. ఇది బ్యాటింగ్ పిచ్ కాబట్టి మా వాళ్లు అదరగొడతారు. మాదైన సహజ శైలిలోనే ఆడతాము. సెమీస్‌లో ఆడిన జట్టునే కొనసాగిస్తున్నాం’’ అని తెలిపాడు.కాగా అండర్-19 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్ ఇప్పటి వరకు ఆరుసార్లు టైటిల్ గెలిచింది. ఇప్పటికి పదిసార్లు (తాజా ఎడిషన్ కలిపి) ఫైనల్ చేరింది భారత్. మరోవైపు.. ఇప్పటికి ఒకే ఒక్కసారి ట్రోఫీ సాధించిన ఇంగ్లండ్.. రెండో టైటిల్‌పై కన్నేసింది. ఇదిలా ఉంటే.. తొలి సెమీస్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించి ఇంగ్లండ్ ఫైనల్ చేరగా.. రెండో సెమీ ఫైనల్లో అఫ్గనిస్తాన్‌ను చిత్తు చేసి భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది.వరల్డ్‌కప్ ఫైనల్ భారత్ వర్సెస్ ఇంగ్లండ్ తుదిజట్లుభారత్ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వేదాంత్ త్రివేది, అభిజ్ఞాన్ కుందు(వికెట్ కీపర్), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేష్ దేవేంద్రన్ఇంగ్లండ్బెన్ డాకిన్స్, జోసెఫ్ మూర్స్, బెన్ మేయెస్, థామస్ రూ (వికెట్ కీపర్/కెప్టెన్), కాలేబ్ ఫాల్కనర్, రాల్ఫీ ఆల్బర్ట్, ఫర్హాన్ అహ్మద్, సెబాస్టియన్ మోర్గాన్, జేమ్స్ మింటో, మానీ లమ్స్‌డెన్, అలెక్స్ గ్రీన్ -
WC 2026: ఆసీస్ అవుట్.. వరల్డ్‌కప్ ఫైనల్లో ఇంగ్లండ్
ఐసీసీ అండర్-19 వరల్డ్‌కప్-2026 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు చేదు అనుభవం ఎదురైంది. ఉత్కంఠగా సాగిన సెమీస్ మ్యాచ్‌లో ఆసీస్‌ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకువెళ్లింది.జింబాబ్వే వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ సిక్స్ గ్రూపు-1 నుంచి ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించగా.. గ్రూప్-2 నుంచి భారత్ , ఇంగ్లండ్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో ఆసీస్- ఇంగ్లండ్ మంగళవారం తలపడ్డాయి.థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్బులవాయోలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో బెన్ డాకిన్స్ (1) విఫలం కాగా.. జోసెఫ్ మూర్స్ 25 పరుగులు.. వన్‌డౌన్‌లో వచ్చిన బెన్ మేయ్స్ 24 రన్స్ చేశారు. టాపార్డర్ ఇలా నామమాత్రపు స్కోర్లకే పరిమితం కాగా.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన థామస్ రూ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.శతకంతో చెలరేగిన థామస్.. మొత్తంగా 107 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సర్ బాది 110 పరుగులు సాధించాడు. మిగతావాళ్లలో కలేబ్ ఫాల్కనర్ 40 పరుగులతో రాణించగా.. ఫర్హాన్ అహ్మద్ 28 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లండ్ ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగుల మెరుగైన స్కోరు సాధించింది.ఆసీస్ బౌలర్లలో హేడెన్ షీలర్, నడేన్ కూరే చెరో రెండు వికెట్లు తీయగా.. విల్ బైరమ్, ఆర్యన్ శర్మ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటంఓపెనర్ విల్ మలాజుక్ 15, వన్‌డౌన్ బ్యాటర్ 3 పరుగుల చేసి అవుటయ్యారు. మరో ఓపెనర్ నితేశ్ సామ్యూల్ 83 బంతుల్లో 47 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ అలెక్స్ లీ యంగ్ (3), జేడన్ డ్రేపర్ (12) నిరాశపరిచారు.ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నాలుగో నంబర్ బ్యాటర్, కెప్టెన్ ఒలీవర్ పీక్ ఒంటరి పోరాటం చేశాడు. 88 బంతుల్లో పది ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్న ఒలీవర్ పదో వికెట్‌గా వెనుదిరిగడంతో ఇంగ్లండ్ గెలుపు ఖరారైంది. టార్గెట్ ఛేదనలో 47.3 ఓవర్లలో 250 పరుగులకే పరిమితమై ఆసీస్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. థామస్ రూ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక రెండో సెమీ ఫైనల్లో భారత్- అఫ్గనిస్తాన్ బుధవారం తలపడతాయి.అండర్-19 వరల్డ్‌కప్ ఆసీస్ వర్సెస్ ఇంగ్లండ్ స్కోర్లు👉ఇంగ్లండ్-277/7(50)👉ఆస్ట్రేలియా- 250(47.3). చదవండి: ICC vs PCB: పాకిస్తాన్‌కు భారీ షాక్! -
వైభవ్ విఫలం.. ఇంగ్లండ్ చేతిలో తప్పని ఓటమి
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్-2026 వార్మప్ మ్యాచ్‌లో యువ భారత జట్టుకు పరాభవం ఎదురైంది. సన్నాహక మ్యాచ్‌లో స్కాట్లాండ్పై ఘన విజయం సాధించిన మాత్రే సేన.. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో మాత్రం ఓటమి పాలైంది. మెరుగైన స్కోరు సాధించినా.. లక్ష్యాన్ని కాపాడుకోలేక చతికిలపడింది.జింబాబ్వే వేదికగా జనవరి 15 నుంచి అండర్-19 ప్రపంచకప్ టోర్నీ మొదలుకానుంది. ఇందుకోసం భారత్- ఇంగ్లండ్ అండర్-19 జట్ల మధ్య సోమవారం బులవాయో వేదికగా సన్నాహక మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.అభిజ్ఞాన్ కుందు హాఫ్ సెంచరీఓపెనర్లలో కెప్టెన్ ఆయుశ్ మాత్రే (49) మెరుగ్గా రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (1) మాత్రం విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన వేదాంత్ త్రివేది (14).. మిడిలార్డర్లో విహాన్ మల్హోత్రా (10) నిరాశపరిచారు.ఇలాంటి పరిస్థితుల్లో వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యతను తలకెత్తుకున్నాడు. ఐదో స్థానంలో వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 99 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు.రాణించిన బౌలింగ్ ఆల్రౌండర్లుఅభిజ్ఞాన్కు తోడుగా బౌలింగ్ ఆల్‌రౌండర్లు ఆర్ఎస్ అంబరీష్ (48), కనిష్క్ చౌహాన్ (45 నాటౌట్) రాణించారు. మిగిలిన వారిలో హర్వన్ష్ పంగాలియా (19) విఫలం కాగా.. ఖిలాన్ పటేల్ 11 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు నష్టపోయిన భారత అండర్-19 జట్టు 295 పరుగులు సాధించింది.ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో ఐదు వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. సెబాస్టియన్ మోర్గాన్ రెండు, మ్యానీ లమ్స్‌డన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక లక్ష్య ఛేదనలో హెనిల్ పటేల్ ఆదిలోనే ఇంగ్లండ్‌కు షాకిచ్చాడు. ఓపెనర్ బెన్ డాకిన్స్ (8)ను స్వల్ప స్కోరుకే పెవిలియన్‌కు పంపాడు.థామస్ ధనాధన్‌ఇక ఖిలాన్ పటేల్.. మరో ఓపెనర్ జోసఫ్ మూర్స్ (46), వన్‌డౌన్ బ్యాటర్ బెన్ మేయస్ (34) వికెట్లు తీసుకున్నాడు. అయితే, నాలుగో నంబర్ బ్యాటర్ థామస్ ర్యూ మాత్రం పట్టుదలగా నిలబడ్డాడు. 66 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 71 పరుగులతో అజేయంగా నిలిచాడు.ఇంగ్లండ్ గెలుపుమరో ఎండ్ నుంచి కెలెబ్ ఫాల్కనర్ (29 నాటౌట్) థామస్‌కు సహకారం అందించాడు. అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించిన కారణంగా డక్‌వర్త్ లూయీస్ పద్ధతి (DLS) ప్రకారం ఇంగ్లండ్ లక్ష్యాన్ని 177 పరుగులుగా నిర్ణయించగా.. 34.3 ఓవర్లలోనే 196 పరుగులు సాధించింది. ఫలితంగా 20 పరుగుల తేడాతో భారత అండర్-19 జట్టుపై ఇంగ్లండ్ గెలుపొందింది. చదవండి: చరిత్ర సృష్టించిన పడిక్కల్.. తొలి ప్లేయర్‌గా అరుదైన రికార్డు


