breaking news
Sarvam Maya Movie
-
'సర్వం మాయ' ఘన విజయం.. తండ్రికి విలువైన కానుక
హారర్ సినిమా అనగానే వెన్నులో వణుకు పుట్టించేలా ఉంటుందనుకునేరు, కానే కాదు.. దెయ్యంతోనే ప్రేమలో పడేలా ఉంటుంది. అదే సర్వం మాయ మూవీ. మలయాళ దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీ 2025 డిసెంబర్ 25న థియేటర్లో విడుదలవగా బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఏకంగా రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ హీరోగా నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీలో అందుబాటులో ఉంది. కారు బహుమతిఅటు థియేటర్లో, ఇటు ఓటీటీలోనూ సూపర్ హిట్ టాక్ అందుకున్న సందర్భంగా దర్శకుడు అఖిల్ సత్యన్ కారు కొన్నాడు. తన తండ్రి, గురువు, దర్శకుడు సత్యన్ అంతికడ్కు కారు గిఫ్టిచ్చాడు. వోల్వో XC 60 లగ్జరీ ఎస్‌యూవీని తండ్రికి కానుకగా ఇచ్చాడు. ఈ మోడల్ గతేడాది ఆగస్టులోనే ఇండియాలో లాంచ్ అయింది. ఈ కారు విలువ దాదాపు రూ.70 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. మలయాళంలో ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించిన అంతికడ్ చివరగా హృదయపూర్వం అనే సినిమాతో విజయాన్ని అందుకున్నాడు.సర్వం మాయ కథహీరో ప్రబేందు (నివిన్ పౌలీ) నాస్తికుడు. కానీ, కుల వృత్తి ప్రకారం బలవంతంగా అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తుంటాడు. ఓరోజు ప్రబేందుకు బంధువు రూపేష్ బలవంతం చేయడంతో దెయ్యం వదిలించే పూజ ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఆ దెయ్యం పేరు డెలలూ. తను చాలా క్యూట్‌గా ఉంటుంది.దెయ్యం చేసే అల్లరి, చిలిపితనం భలే బాగుంటుంది. డెలలూ.. తాను ఎవరు? ఎందుకు చనిపోయి దెయ్యం అయిందన్న సమాధానం కోసం వెతుకుతుంటుంది. మరి డెలలు ఆచూకీ ప్రబేందు కనిపెట్టాడా? చివరకు ఏం జరిగిందనేది తెలుసుకోవాలంటే హాట్‌స్టార్‌లో సర్వం మాయ చూడాల్సిందే! Director akhil sathyan gifted a New Volvo XC60 luxury SUV to his father, veteran director sathyan anthikad, following the grand success of his movie sarvam Maya.#sarvamMaya #akhilsathyan #sathyananthikad #anoopsathyan pic.twitter.com/rXNbK253iY— VARUNP (@VARUNP29887116) February 7, 2026 చదవండి: 2026: టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్లు -
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సినిమా. అయినా కంగారుపడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటే దెయ్యం, అస్థిపంజరం, స్మశానం... ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తరుణంలో దర్శకుడు అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా ఇష్టపడేట్టు చేశాడు. నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సర్వం మాయ (Sarvam Maya movie) ఓ మళయాళ సినిమా. ఈ సినిమాలో కథానాయకుడైన ప్రబేందు స్వతహాగా నాస్తికడైనా కుల వృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రబేందు మంచి గిటారిస్టు కూడా. ప్రబేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఇక అక్కడ నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాషి దెయ్యం కాదు. ఆ దెయ్యాన్ని చూస్తే ప్రేక్షకులు కూడా తమకూ అలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండునని అనుకోక మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఓ పేరు కూడా ఉంటుంది అదే డెలలూ. ఈ కథలో ప్రబేందును కలిసిన ఆ డెలలూ చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డెలలూ తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యం అయిందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రబేందుని పట్టుకుంటుంది. మరి ఆ డెలలూ ఆచూకీ కనిపెట్టడంలో ప్రబేందు డెలలూకి సాయపడతాడా, అలాగే ఆ డెలలూ వల్ల ప్రబేందుకి కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలూ కోసం ఓసారి చూడాల్సిందే. ఇంకెందుకాలస్యం వీకెండ్ హాట్ స్టార్ ట్యూన్ చేసి డెలలూతో జత కట్టండి. -
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'సర్వం మాయ'. హీరో నివీన్ పౌలీ.. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. హిట్ కొట్టాడు. హారర్ కామెడీ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే రూ.150 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ చిత్రం హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన)కథేంటి?ప్రభేందు(నివీన్ పౌలీ) బ్రహ్మణ కుర్రాడే కానీ దేవుడిని నమ్మడు. తండ్రి, అన్నలా పౌరోహిత్యం చేయడు. మంచి గిటారిస్ట్ అవ్వాలనేది గోల్. ఆ ప్రయత్నాల్లో ఉంటూ స్టేజీ షోలు చేస్తుంటాడు. అనుకోని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. ఖాళీగా ఉండటం ఎందుకని డబ్బుల కోసం బావ రూపేష్(అజు వర్గీస్)తో కలిసి పూజలు, హోమాలు చేస్తుంటాడు. ఓసారి ఒకరి ఇంట్లో పిల్లాడికి పట్టిన దెయ్యాన్నివదిలిస్తాడు. తర్వాత నుంచి ఆ ఆడ దెయ్యం(రియా షిబు).. ప్రభేందు వెంటపడుతుంది. ఇతడికి మాత్రమే కనిపిస్తూ, ఇతడితోనే మాట్లాడుతూ ఉంటుంది. సదరు దెయ్యానికి.. తాను ఎవరు? ఎలా చనిపోయాననే విషయాలేం గుర్తుండవు. దీంతో ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు. మరి డెలులు వల్ల ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? డెలులు గతమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మలయాళ సినిమాల్లో పెద్దగా కథేం ఉండదు. సింపుల్ ఎమోషన్స్, సున్నితమైన కామెడీతోనే అంతా నడిపించేస్తుంటారు. ఇది అలాంటి ఓ స్టోరీనే. సాధారణంగా దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు కానీ ఇందులో దెయ్యమే.. మనుషుల్ని చూసి భయపడుతుంది. గతం మర్చిపోవడం వల్ల పేరు సహా ఏదీ గుర్తుండదు. ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. హీరో కూడా అంతే. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. అలాంటి వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఎలా సాయం చేసుకున్నారు. ప్రభేందు తన భయాన్ని ఎలా అధిగమించాడు. డెలులు చివరకు ముక్తి పొందిందా లేదా అనేది మెయిన్ ప్లాట్.హారర్ కామెడీ సినిమానే అయినప్పటికీ ఎక్కడా భయపెట్టే సీన్స్ ఉండవు. బదులుగా ఆడ దెయ్యంతో ప్రేమలో పడతాం. ప్రేమ, బంధం, నమ్మకం లాంటి విషయాల గురించి పలు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్, ఆయా సీన్స్ చాలామందికి కనెక్ట్ అవుతాయి. మూవీ చూస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. ఫస్టాప్ చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం అక్కడక్కడే తిరిగినట్లు కాస్త సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే డెలులు దెయ్యం ఉన్న ప్రతి సీన్ క్యూట్ అండ్ స్వీట్‌గా భలే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే దెయ్యం ఫ్లాష్‌బ్యాక్ కూడా రొటీన్‌కి భిన్నంగానే ఉంటుంది. కాకపోతే ఇంత సింపుల్‌గా తేల్చేశారేంటా అనిపిస్తుంది.ప్రభేందుతో పాటు ట్రావెల్ అయ్యే డెలులు దెయ్యం.. చివరకు అతడితోనే ప్రేమలో పడటం, అదే టైంలో ప్రభేందు.. సాధ్య అనే అమ్మాయిని ప్రేమించడం. తద్వారా ప్రభేందు-డెలులు మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలో డెలులు గతం గుర్తొచ్చే సీన్స్ బాగుంటాయి. డెలులు నిజ జీవితంలోనూ ప్రభేందునే ప్రేమించిందా? అనే ప్రశ్నతో సినిమాని ముగించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.ప్రభేందుగా చేసిన నివీన్ పౌలీ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. డెలులు దెయ్యంగా చేసిన రియా షిబు అయితే ప్రతిఒక్కరి ఫేవరెట్ అయిపోతుంది. అంత క్యూట్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసేసింది. మిగతా యాక్టర్స్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏ ఒక్క క్యారెక్టర్ అనవసరంగా ఉందే అని ఎక్కడా అనిపించదు. చివరకు కుక్కని కూడా కథలో భాగం చేసిన తీరు అలరిస్తుంది. టెక్నికల్ విషయాలకొస్తే.. తెలుగు డబ్బింగ్ బాగున్నప్పటికీ పాటలకు రాసిన తెలుగు లిరిక్స్ అస్సలు సూట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రాఫీ కూడా చూడముచ్చటగా ఉంది. కేరళ అందాలని బాగా క్యాప్చర్ చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.దెయ్యం లేదా హారర్ సినిమాలు చూడాలంటే మీకు చచ్చేంత భయమా? అయినా పర్లేదు. ఎలాంటి భయం లేకుండా మీరు ఈ మూవీ చూసేయొచ్చు. చూస్తున్నంతసేపు దెయ్యమేంటి ఇంత అందంగా ఉంది? ఇలాంటిది మన జీవితంలోకి ఎందుకు ఎప్పుడూ రాలేదు? అని ఒక్కసారైనా అనిపిస్తుంది. ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'సర్వం మాయ' బెస్ట్ ఆప్షన్. కుటుంబంతోనూ కలిసి హాయిగా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం) -
ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్
మరోవారం వచ్చేసింది. సంక్రాంతి సినిమాలు ఇంకా థియేటర్లలో జనాల్ని ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ వీకెండ్.. ఓం శాంతి శాంతి శాంతిః, త్రిముఖ, ప్రేమకడలి తదితర తెలుగు మూవీస్ బిగ్ స్క్రీన్‌పైకి రాబోతున్నాయి. విజయ్ సేతుపతి 'గాంధీ టాక్స్', 'తుంబాడ్' డైరెక్టర్ కొత్త చిత్రం 'మయసభ' కూడా ఈ వారాంతలోనే థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు ఓటీటీల్లోనూ 15కి పైగా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవనున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సైక్ సిద్ధార్థ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)ఈ వారం ఓటీటీ మూవీస్ విషయానికొస్తే.. ఛాంపియన్, సర్వం మాయ, పతంగ్ చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రీసెంట్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'ధురంధర్' కూడా ఇదే వీకెండ్లో స్ట్రీమింగ్‌లోకి రానుందనే టాక్ ఉంది. ప్రస్తుతానికైతే ఇవే. సడన్ సర్ప్రైజులు ఏమైనా ఉండొచ్చేమో చూడాలి. ఇంతకీ ఏ ఓటీటీలోకి ఏ మూవీ రానుందంటే?ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు)నెట్ఫ్లిక్స్మైక్ ఎప్స్: డెల్యూషనల్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 27టేక్ దట్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 27బ్రిడ్జర్టన్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 29ఛాంపియన్ (తెలుగు సినిమా) - జనవరి 29ధురంధర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30 (రూమర్ డేట్)మిరాకిల్: ద బాయ్స్ ఆఫ్ 80స్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 30అమెజాన్ ప్రైమ్ద రెకింగ్ క్రూ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 28దల్ దల్ (హిందీ సిరీస్) - జనవరి 30హాట్స్టార్గుస్తాక్ ఇష్క్ (హిందీ మూవీ) - జనవరి 27సర్వం మాయ (తెలుగు డబ్బింగ్ సినిమా) - జనవరి 30సన్ నెక్స్ట్పతంగ్ (తెలుగు సినిమా) - జనవరి 30ఆపిల్ టీవీ ప్లస్స్క్రింకింగ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 28యో గబ్బా గబ్బా ల్యాండ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 30బుక్ మై షోద ఇంటర్న్‌షిప్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 28జీ5దేవ్‌కెళ్ (మరాఠీ సిరీస్) - జనవరి 30(ఇదీ చదవండి: సిరై రివ్యూ: కంటతడి పెట్టించే సినిమా.. పోలీస్ ఇలానే ఉంటాడు) -
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెలుగులోనూ కాస్తంత ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నివీన్ పౌలీ. ఈ చిత్రం తర్వాత యాక్టింగ్ అయితే చేస్తున్నాడు గానీ సరైన హిట్ దొరకలేదు. దాదాపు పదేళ్ల తర్వాత 'సర్వం మాయ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ హిట్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)నివీన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ తదితరుల ప్రధాన పాత్రల్లో నటించిన 'సర్వం మాయ'.. గత నెల 25న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‌తో తెలుగు మూవీ లవర్స్ మధ్య చర్చకు కారణమైంది. దీంతో ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో మూవీ అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది.'సర్వం మాయ' విషయానికొస్తే.. ఇదో అందమైన దెయ్యం కథ. ఇది మిమ్మల్ని భయపెట్టదు, నవ్విస్తుంది. చివరకు కంటతడి పెట్టిస్తుంది. ప్రభేందు (నివీన్ పౌలీ) ఓ గిటారిస్ట్. ఇతడి తండ్రి, అన్నయ్య పురోహితులు. కుటుంబం పౌరోహిత్యం చేస్తున్నప్పటికీ ప్రభేందుకి వీటిపై, దేవుడిపై పెద్దగా నమ్మకముండదు. అలాంటి ఇతడి జీవితంలోకి డెలులూ (రియా షిబు) అనే ఓ టీనేజ్ దెయ్యం వస్తుంది. ఈమె రాకతో ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. గతం మర్చిపోయిన ఈ క్యూట్ దెయ్యం.. చివరకు ఎలా ముక్తి పొందింది అనేది స్టోరీ. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అస్సలు మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)Malayalam film #SarvamMaya (2025) by #AkhilSathyan, premieres Jan 30th on @JioHotstar.@NivinOfficial #RiyaShibu @AjuVarghesee #PrietyMukundhan #Janardhanan #RaghunathPaleri #Vineeth #MadhuWariar @justin_tunes #FireflyFilms @APIfilms pic.twitter.com/lw5HDIBQp2— CinemaRare (@CinemaRareIN) January 23, 2026


