బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా సంచలన విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన తన ప్రత్యర్థిపై 28వేలకు పైగా ఓట్ల మెజార్టీ సాధించి గెలుపొందారు. గతంలో ప్రశాంత్ కిషోర్ పార్టీలో ఉన్న ఆనంద్ మిశ్రా ఎన్నికల ముందే బీజేపీలో చేరారు. ఆనంద్ మిశ్రా తన ఫైర్ బ్రాండ్ ఆపరేషన్స్, బైక్ రైడ్స్ తో సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ పొందారు.
మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న బక్సర్ నియోజకవర్గం నుంచి 28 వేల భారీ మెజారిటీతో గెలుపొందారు. 1951లో బక్సర్ నియోజకవర్గం ఏర్పడగా ఇప్పటివరకూ కాంగ్రెస్ అక్కడ 10 సార్లు విజయం సాధించింది. అటువంటి నియోజకవర్గంలో మెుదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసినప్పటిక తన వ్యూహాలతో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ కుమార్ తివారీపై 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. 2024 జనవరిలో రాజకీయ ప్రవేశం చేసిన ఆనంద్ మిశ్రా తొలుత పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ పార్టీలో చేరారు. అనంతరం పలు కారణాలతో ఆపార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆనంద్ మిశ్రాకు ఆర్ఎస్ఎస్ నేతలతో మంచి సంబంధాలున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆయన అస్సాంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ నేతలతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆనంద్ మిశ్రా నేపథ్యం
1981 జూన్ 1న బిహార్ రాష్ట్రంలోని బోజ్‌పూర్ లో జన్మించారు. 2011లో ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అస్సాం క్యాడర్ లో విధులు నిర్వహిస్తూ అక్కడ పలు జిల్లాలలు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ గా సేవలందించారు. అస్సాంలోని లకీంపూర్, దుబ్రీ జిల్లాలలో ఆయన నిర్వహించిన యాంటీ-నార్కోటిక్స్ ఆపరేషన్స్ ఆనంద్ మిశ్రాకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చాయి. అంతేకాకుండా మేఘాలయ, అస్సాంలలో మిలిటెంట్స్ వ్యతిరేఖ ఆపరేషన్స్ నిర్వహించారు. ఆనంద్ మిశ్రా ప్రత్యేకమైన శైలిలో విధులు నిర్వహిస్తూ జనాలలో మంచి పాపులారిటీ సంపాదించారు.


