సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. గెలుపుపై నవీన్ యాదవ్ స్పందిస్తూ.. తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ‘‘నా కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసింది. పదేళ్లలో చేసింది ఏమిలేక...ఏం చెప్పుకోలేక మాపై ఆరోపణలు చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
‘‘నేను కక్షపూరిత రాజకీయాలు చేయను. అధిక నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌ని మరింత అభివృద్ధి చేస్తా. అభివృద్ధే నా అజెండా. జూబ్లీహిల్స్ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం’’ అంటూ నవీన్‌యాదవ్ చెప్పుకొచ్చారు. నన్ను నా కుటుంబం, వ్యక్తిత్వంపై దెబ్బతిస్తూ ఓట్లు ఆడిగారు. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు. రిగ్గింగ్,దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలు. అధిక బడ్జెట్‌తో జూబ్లీహిల్స్‌ని మరింత అభివృద్ధి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు.



