మిగతా ఏడు సెట్లకు కన్వీనర్ల నియామకం
ఉన్నత విద్యా మండలి ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్/ఉస్మానియా యూనివర్సిటీ/ కేయూ క్యాంపస్/: వచ్చే విద్యా సంవత్సరం (2026–27)లో నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యామండలి కన్వీనర్లను నియమించింది. ఈ వివరాలను మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి సోమవారం మీడి యాకు వెల్లడించారు. అత్యంత కీల కమైన ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ (ఈఏపీ) ఉమ్మడి ప్రవేశ పరీక్ష కన్వీనర్‌గా జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ ప్రొఫెసర్ కె.విజయకుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈఏపీసెట్‌కు రాష్ట్రంలో దరఖాస్తులు పెరగడం, నిర్వహణ విషయంలో మరింత పారదర్శకత ఉండాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


విజయకుమార్‌రెడ్డి జే ఎన్టీయూ మెకానికల్ విభాగంలో సీని యర్ ప్రొఫెసర్‌గా, జేఎన్టీయూ రెక్టార్ బాధ్యతల్లో ఉన్నారు. ఎప్‌సెట్‌తో పాటు మొత్తం ఏడు ప్రవేశ పరీ క్షల కన్వీనర్లను, ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సి టీలను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఖరారు చేశారు. గత సంప్రదా యాలను పక్కనబెట్టి.. పాత వారితో పాటు కొత్త వారికి కన్వీనర్ బాధ్యతలప్పగించారు. ఎప్‌సెట్, పీఈసెట్, పీజీఈసెట్ కన్వీనర్లుగా కొత్త వారికి అవకాశమిచ్చారు. ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్ కన్వీనర్లుగా పాత వారికే అవకాశమిచ్చారు.


