breaking news
Jubilee Hills By Election Result
-
డిపాజిట్ వస్తుందని భావిస్తున్నాం: బీజేపీ దీపక్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మూడో స్థానంలో వెనుకంజలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ..‘ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువ ఉంది. డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నాం. బీజేపీ ఓట్లకు డబ్బులు పంచదు. చివరి మూడు రౌండ్లు మాకు అనుకూలంగా ఉంటాయి. ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నాయకులను కొన్నారు. చీరలు పంపిణీ చేశారు. బహుమతులు ఇచ్చారు. అధికార దుర్వినియోగం చేశారు. అని వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు దాదాపు 16వేల ఓట్లకు పైగా లీడ్‌లో కొనసాగుతోంది. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి విజయం దాదాపుగా ఖాయం కావడంతో హస్తం పార్టీ శ్రేణులు గాంధీ భవన్ వద్ద సంబురాలు చేసుకుంటున్నాయి. -
గాంధీ భవన్లో సంబరాలు.. పొన్నం కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కంటోన్మెంట్ మాదిరిగానే ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారు అని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ సానుభూతి, డైవర్షన్ పాలిటిక్స్ పనిచేయలేదని కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. గాంధీభవన్‌లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి.జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజా పాలన ప్రభుత్వ కార్యక్రమాల ఆలోచన సరళి, ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఆకాంక్షించి ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారు. కంటోన్మెంట్ మాదిరి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రజలు ఆలోచించారు. మహిళల సెంటిమెంట్ వాడుకోవడానికి బీఆర్ఎస్ అన్ని రకాల ప్రయత్నం చేశారు. అయినా కాంగ్రెస్ పార్టీ సన్న బియ్యం, రేషన్ కార్డులు పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగ నియామకాలు, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగానికి తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు మాకు అండగా ఉన్నారు.మా ప్రభుత్వం అన్ని అంశాలు క్షేత్ర స్థాయిలో చేరేలా పని చేస్తున్నాం.. ఈ ఫలితం ప్రభుత్వ కార్యక్రమాలకు నిదర్శనం. బీఆర్ఎస్ చేసిన దుష్ప్రచారం పరిగణనలోకి తీసుకొని మా ప్రభుత్వం మరింత బలంగా పని చేస్తుంది. ఓడిపోతున్నామని అసహనంతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్ ఆరోపణలు చేసింది.. వాళ్ళే మా పార్టీ కార్యాలయంపై దాడి కి ప్రయత్నం చేశారు. మీ సంగతి చూస్తా అనే మాటలు ఆశ్చర్యం కలిగించింది. పోలీసులు మా నాయకులు అక్కడ ఉండవద్దు అని కేసులు పెట్టారు. వాళ్ళలో అనేక మంది బయట వాళ్ళు ఉన్నారు.. సికింద్రాబాద్ కార్పొరేటర్ అక్కడే ఉండి టీవీలకు బైట్ ఇచ్చారు. వాళ్ళే అన్ని రకాల ప్రయత్నాలు చేశారు.. అసహనంతో ఇలా మాట్లాడుతున్నారు.కంటోన్మెంట్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపించారు.. ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి ఆకాంక్షించి గెలిపిస్తున్నారు. ఓవరాల్‌గా కాంగ్రెస్ పార్టీ మంచి మెజారిటీతో గెలుస్తుంది. ముందు నుండి చెప్తున్నట్టు బీజేపీకి 10వేల ఓట్లు కూడా రావు. \కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. బీఆర్ఎస్తో కుమ్మక్కు అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడానికి సహకరించినందుకు కిషన్ రెడ్డి గురు దక్షిణ కింద బీఆర్ఎస్కి సహకరించారు. దీనికి కిషన్ రెడ్డి జవాబు చెప్పాలి. ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ ఉండే ఇప్పుడు గల్లీలో కూడా దోస్తీగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు సహకరిస్తే మంచిది.. లేకపోతే తెలంగాణ ప్రజలు మీ ఆఫీసుకి తాళాలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అని హెచ్చరించారు. -
5500 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్న నవీన్ యాదవ్
-
రెండో రౌండ్ లో కాంగ్రెస్ 189 ఓట్ల ఆధిక్యం
-
Watch Live: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్
-
అభివృద్ధికే జూబ్లీహిల్స్ ఓటర్ల పట్టం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, సాక్షి: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ వేళ.. ఎర్లీ ట్రెండ్స్‌పై తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సాక్షితో స్పందించారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతున్నారని శుక్రవారం ఉదయం అన్నారాయన. ‘‘జూబ్లీహిల్స్ ఓటర్లు మూడు పర్యాయాలు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చారు. కానీ అభివృద్ధి కాలేదు. అధికారం కోల్పోయి.. ఇప్పుడు సిట్టింగ్ స్థానం కోల్పోతున్నామనే బీఆర్ఎస్ అడ్డగోలుగా మాట్లాడుతోంది. వాళ్లు ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్టు మేము కూడ చేస్తామనుకుంటున్నారు, వాళ్లు చేసినట్లు మద్యం, డబ్బులు పంచుతామని అనుకున్నారు. కానీ.. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడిగాం. అందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. ప్రజలకు చిన్నచిన్న కోరికలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ల పదేళ్ల కాలంలో ఆ కోరికలను కూడా తీర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అని అన్నారాయన. -
జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ ఫలితాలు.. అభ్యర్థి మృతి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల వేళ స్థానికంగా విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉప ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి మహమ్మద్ అన్వర్ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, విషాదఛాయలు అములుకున్నాయి.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మహమ్మద్ అన్వర్ చేశారు. అయితే, ఈరోజు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మృతి చెందారు. దీంతో, వారి కుటంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. మహమ్మద్ అన్వర్ ఎర్రగడ్డలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు యూసఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. 42 టేబుల్స్ ద్వారా 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రౌండ్ ఫలితం వెల్లడికి గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఒక్కో రౌండు ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన మధ్యాహ్నం 2 గంటల కల్లా తుది ఫలితం వచ్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో 14 టేబుళ్లకు బదులు వరుసకు 21 టేబుళ్ల చొప్పున రెండు వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండుకు 42 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితం వెల్లడయ్యేందుకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. -
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ హవా.. గాంధీభవన్‌లో సంబరాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలకు సంబంధించి...


