( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 25వేల మెజార్టీతో విజయం సాధించింది. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలిచారు. ఇక, మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుంచి నవీన్ యాదవ్ ముందంజలోనే కొనసాగడం విశేషం.
మరోవైపు.. జూబ్లీహిల్స్ గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని అన్ని డివిజన్లలో రేవంత్ రెడ్డి విస్తృతంతా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి డివిజన్ స్థాయిలో ప్రచారం చేయడం ఏంటని విమర్శలు చేసిన ఆయన పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్‌కు ఇది రెండో విజయం. ిచివరి నాలుగు రోజులు రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ విజయ అవకాశాలు మరింత మెరుగైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


