breaking news
Naveen Yadav
-
రేవంత్ పరపతి పెంచిన జూబ్లీహిల్స్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరటనిచ్చే అంశం. అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ ఉప ఎన్నికల్లో రేవంత్ అన్నీ తానై వ్యవహరించాడు. గెలుపు ద్వారా పార్టీలో తన పట్టు పెంచుకున్నాడు. రాష్ట్రంలో తనపై వ్యతిరేకత పెరుగుతోందన్న వదంతులు పుంజుకుంటున్న సమయంలో దాన్ని పూర్వపక్షం చేసేందుకు రేవంత్ ఈ ఉప ఎన్నికలను వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఘట్టం మొదలైనప్పుడు రాజకీయ వాతావరణం బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్న ప్రచారం జరిగింది. ఇందుకు తగ్గట్టుగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌లు విస్తృత ప్రచారం చేశారు కూడా. కాంగ్రెస్ తరఫున తొలుత ముగ్గురు.. ఆ తరువాత మరింత మంది మంత్రులు, పాతిక మందికిపైగా ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్సహా ఇతర నేతలు ప్రచార బాధ్యతలు చేపట్టారు. అక్కడితో ఆగలేదు. రేవంత్ స్వయంగా పలు సభలు నిర్వహించారు. ఒక ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి స్థాయి నేత ఒకటి అర సభల్లో పాల్గొనడం కద్దు. కానీ రేవంత్ ఈ రిస్క్ తీసుకోలేదు. ఎప్పటికప్పుడు అన్ని మార్గాల ద్వారా సమాచారం సేకరించుకుని తన వ్యూహాలకు పదును పెట్టుకున్నారు. టీడీపీకి మద్దతిచ్చే ఒక సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు ఎన్టీఆర్ ప్రస్తావన తేవడం అలాంటిదే. మైనార్టీ ఓటర్లను తనవైపునకు తిప్పుకునే ఉద్దేశంతో ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ నేత అజహరుద్దీన్‌ను మంత్రిని చేసేశారు. అంతేకాక ఆ వర్గం బాగా బలంగా ఉన్న చోట మీటింగ్ పెట్టి కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు మనుగడ అన్న రీతిలో ప్రసంగాలు చేశారు. మజ్లిస్ మద్దతు కూడా కాంగ్రెస్‌కు లాభించింది. రాజీలేకుండా డబ్బులు ఖర్చు చేశారన్న అభిప్రాయమూ సర్వత్రా ఉంది. వీటన్నింటి ఫలితంగా అప్పటివరకూ బీఆర్ఎస్కు అనుకూలంగా ఉందన్న మౌత్ టాక్ కాస్తా చివరి మూడు రోజుల్లో కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా మారింది. బీజేపీ, బీఆర్ఎస్లు కూడా డబ్బు పంపిణీ చేసినా అది అధికార పక్షానికి సరితూగలేదని తెలుస్తోంది. ఈ రోజుల్లో ఎలా గెలిచారన్నది ముఖ్యం కాకుండా పోతోంది. ఎలాగైనా గెలవాలన్న తాపత్రయం పెరిగిపోతోంది. గెలిచాక మాత్రం ప్రజల మద్దతుతో గెలిచామని చెప్పుకోవడం రివాజుగా మారింది. అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా దుబ్బాక, హుజూరాబాద్‌లలో తప్ప, మిగిలిన ఉప ఎన్నికలలో విజయం సాధించింది. మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసింది. అప్పట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ప్రచారానికి వచ్చారు. అయినా బీఆర్ఎస్ గెలవగలిగింది. బీజేపీ జూబ్లి హిల్స్ ఉపఎన్నికను అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఎన్డీయే భాగస్వాములైన టీడీపీ, జనసేనలు ప్రచారంలో పాల్గొనలేదు. పైగా టీడీపీ ఏకంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. అయినా బీజేపీ నేతలు ప్రశ్నించలేకపోయారు. గత సాధారణ ఎన్నికలవరకు కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగున్నట్లు కనిపించేది కాదు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేయడం, కేసీఆర్‌పై ఘాటైన విమర్శలు చేయడం,నాయకులందరిని ఏకం చేయడం తదితర వ్యూహాలతో అధికారంలోకి తేగలిగారు. ముఖ్యమంత్రి అయ్యారు. తదుపరి పాలనలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కున్నా, పార్టీలో తనకు పోటీ లేకుండా చేసుకోగలిగారు.ఇప్పుడు ఈ ఉప ఎన్నిక విజయం ద్వారా అసమ్మతి ఆలోచన చేసే నేతలు కూడా కిమ్మనే పరిస్థితి ఉండదు. అధిష్టానం వీక్ గా ఉండడం, బీహారులో దారుణమైన పరాజయం చెందడం కూడా రేవంత్ కు కలిసి వచ్చే అంశమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ బీసీ వర్గాలను ఆకట్టుకునే యత్నం చేసిందనాలి. నవీన్‌పై కుటుంబపరంగా కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ స్థానికుడు, ప్రజలకు అందుబాటులో ఉంటారన్న ప్రచారం జరిగేలా చేసుకున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జరిగిన ఈ ఉప ఎన్నికకు సానుభూతి ఉపకరిస్తుందన్న ఆశతో బీఆర్ఎస్ ఆయన భార్య సునీతను ఎంపిక చేసుకుంది. అయినా అది ఫలించలేదు. కాకపోతే గత లోక్‌సభ ఎన్నికలలో మాదిరి మూడో స్థానంలోకి పడిపోకుండా గట్టిపోటీ ఇవ్వగలగడం, వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నాయం అన్న నమ్మకాన్ని కేడర్‌లో కలిగించే విధంగా 74 వేల ఓట్లు సాధించగలిగింది. కాంగ్రెస్ కు 99 వేల ఓట్లు రావడం బీఆర్ఎస్కు కాస్త ఇబ్బందే అయినా, లోక్ సభ ఎన్నికలతో పోల్చితే బెటర్ పొజిషన్ లోనే ఉన్నాం కదా అన్న భావన కలుగుతుంది. అధతికార దుర్వినియోగంతో కాంగ్రెస్ గెలిచిందని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చెప్పినా పెద్ద ప్రయోజనం లేదు. బీజేపీ పరిస్థితి మాత్రం కాస్త గడ్డుగా మారిందనే చెప్పాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిథ్యం వహించే ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కోల్పోవడం పరువు తక్కువే. బీహారులో ఎన్డీయే విజయ దుందుభి మోగించిన తరుణంలో జూబ్లిహిల్స్‌లో ఈ రిజల్ట్ రావడం మింగుడుపడని విషయమే. అయితే వచ్చే ఎన్నికలకు హిందూ ఓట్ల పోలరైజేషన్‌కు కృషి చేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అది ఏ రూపం దాల్చుతుందో అప్పుడే చెప్పలేం. కాగా ఒక ఉప ఎన్నిక గెలిచినంత మాత్రాన అంతా సజావుగా ఉందని కాంగ్రెస్ భావిస్తే అది తప్పే అవుతుంది. విజయం సాధించారు కనుక ఆ ఉత్సాహం ఉంటుంది.కాని దాని వెనుక ఎంత కష్టపడాల్సి వచ్చింది, ఖర్చు చేయాల్సి వచ్చింది వారికే తెలుసు. ఏపీలో 2018 నాటి నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్ధి విజయం కోసం అన్ని వ్యూహాలు అమలు చేశారు. తద్వారా గెలవగలిగారు.కాని ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికలలో ఆ సీటు మళ్లీ వైసీపీ పరమైంది.అన్నిసార్లు అలా జరగాలని లేదు.కాని అలాంటి ఉదాహరణలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు అడుగుజాడలోనే నడిచి ఉప ఎన్నికలో గెలిచారన్న అభిప్రాయాన్ని కొట్టిపారేయలేం. ఉప ఎన్నికలో గెలిచినంతమాత్రాన ప్రభుత్వం చేస్తున్న అన్ని పనులకు, హైడ్రా యాక్టివిటి అంతటికి ప్రజామోదం లభించిందని కూడా అనుకోరాదు. ఏది ఏమైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వల్ల రేవంత్ పరపతి పెరిగే మాట నిజం. కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్థానికోత్సాహం...
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ అధిష్టానం సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా వచ్చిన ఉత్సాహాన్ని ఏమాత్రం తగ్గకుండా చూడాలని, ఇదే ఊపుతో స్థానిక సమరానికి సిద్ధం కావాలని రాష్ట్ర నాయకత్వానికి ఢిల్లీ పెద్దలు స్పష్టమైన సంకేతాలిచ్చినట్లుగా సమాచారం. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీపరంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.శనివారం ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర నేతలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలకు పరిచయం చేశారు. వారంతా నవీన్ యాదవ్‌ను అభినందించారు. ఈ భేటీల్లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ జరిగినట్లు తెలిసింది. ‘జూబ్లీ’ఊపును స్థానికంలోనూ చూపించండి... జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో సమష్టి పోరాటం ద్వారా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించుకున్నందుకు రాష్ట్ర నేతలను రాహుల్, మల్లికార్జున ఖర్గే ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి రెఫరెండంగా భావించిన ఈ ఎన్నికలో విజయం సాధించడం పార్టీకి శుభపరిణామంగా నేతలు అభివర్ణించారు. జూబ్లీహిల్స్ గెలుపు ఇచ్చిన ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, ఇదే ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొని ఘన విజయం సాధించాలని అధిష్టానం దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.స్థానిక సంస్థల్లోనూ వ్యవహరించాల్సిన తీరుపై రాష్ట్రస్థాయిలో సమగ్ర చర్చ జరిపి, మంత్రివర్గంలోనూ చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం తీసుకోవాలని అగ్రనేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ భేటీల్లో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీ హామీ ఇచ్చినట్లు స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూనే.. పార్టీ పరంగా వాటిని అమలు చేసే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.దీనిపై అన్ని వర్గాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని, చట్టపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలని నేతలు నిర్ణయించినట్లు తెలిసింది. మొత్తంగా, అధిష్టానం గ్రీన్ సిగ్నల్‌తో రాష్ట్రంలో త్వరలోనే స్థానిక ఎన్నికల సందడి మొదలుకానున్నట్లు స్పష్టమవుతోంది. అంతేగాక సోమవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్లో నిర్ణయం: మహేశ్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలనే దానిపై సోమవారం జరగనున్న కేబినెట్లో నిర్ణయం తీసుకుంటారని టీపీపీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ చెప్పారు. అధిష్టానం పెద్దలను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై పార్టీ నిబద్ధతతో ఉందని స్పష్టం చేశారు. 42 శాతం రిజర్వేషన్లకు బీజేపీ అడ్డంకులు సృష్టించిందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీని, నవీన్ యాదవ్‌ను అధిష్టానం పెద్దలు అభినందించినట్లు తెలిపారు. సిబల్ విందుకు సీఎం రాజ్యసభ సభ్యుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన డిజిటల్ చానల్లో ‘దిల్సే విత్ కపిల్ సిబల్’పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఆయన ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. -
నవీన్ యాదవ్‌కు రాహుల్ అభినందనలు
సాక్షి, ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎన్నికలో గెలిచిన వల్లాల నవీన్ యాదవ్‌తో పాటు తెలంగాణ కాంగ్రెస్‌నూ ఆయన అభినందించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, జూబ్లీహిల్స్ నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ హస్తినలో రాహుల్ గాంధీని కలిశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగుర వేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ (BRS) అభ్యర్థి మాగంటి సునీతపై 25 వేల ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలోనే ఇది అత్యధిక మెజార్టీ కావడం గమనార్హం.కాంగ్రెస్ విజయంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అభ్యర్థి ఎంపిక నుంచి ప్రచారం వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించి సమన్వయం చేశారు. క్షేత్రస్థాయిలో నేతలు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి శ్రేణుల్లో జోష్ నింపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేలా సీఎం చర్యలు చేపట్టారు. -
కలిసికట్టుగా.. కాంగ్రెస్ విజయం
సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల పాలనకు అగ్నిపరీక్షగా మారిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో లభించిన ఘన విజయంతో, అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం వచ్చింది. గత రెండేళ్ల పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతున్న వేళ జరిగిన ఎన్నికలో విజయం లభించడంతో సీఎం, మంత్రులు, పార్టీ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. పార్టీ నేతలంతా పని విభజన చేసుకుని ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయడంతోనే ఈ స్థాయిలో విజయం సాధ్యమయ్యిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యవేక్షణ, పోల్ మేనేజ్మెంట్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జీహెచ్ఎంసీ నేతలు, చివరకు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు నియోజకవర్గంలోనే ఉండి పని చేయడం పార్టీ గెలుపునకు బాటలు వేసిందని అంటున్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్లను కలవడం, ఓటర్లు మెచ్చేలా వారికి హామీలివ్వడం లాంటి అంశాలు కాంగ్రెస్‌కు ఉపకరించాయని రాజకీయ వర్గాలంటున్నాయి. సీఎం... సీరియస్‌గా.. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో వచ్చిన ఉప ఎన్నికను సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఎన్నిక షెడ్యూల్ రాకముందు నుంచే సమావేశాలు, సమీక్షలు నిర్వహించిన ఆయన.. పోలింగ్ సమయం సమీపించే కొద్దీ ఫోకస్ మరింత పెంచారు. ముఖ్యంగా మంత్రులు, ఎన్నికల బాధ్యులతో పలుమార్లు సమావేశమై ఈ ఎన్నిక ఎందుకు గెలవాలన్న దానిపై దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికలో గెలుపోటములు తనతో సహా అందరిపై ప్రభావం చూపుతాయని, కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి సానుకూల ఫలితం రాబట్టాలని పలుమార్లు హెచ్చరించారు. ప్రచార పర్వాన్ని స్వయంగా ముందుండి నడిపించారు. రెండు దఫాలుగా ఆరు రోజుల పాటు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో రోడ్‌షోలు, సభలు నిర్వహించారు. ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు చేయడంతో పాటు నవీన్‌ను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. చివరి మూడు, నాలుగు రోజులు పార్టీ బలగాన్ని ఉరుకులు పెట్టించేలా కార్యాచరణ రూపొందించడం ద్వారా తన పాలనకు రెఫరెండంగా భావించిన ఉప ఎన్నికలో పార్టీని గెలిపించడమే కాకుండా తన పట్టు కూడా నిరూపించుకున్నారు. ఇక పీసీసీ చీఫ్‌గా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన తొలి ఉప ఎన్నిక కావడం, ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా లిట్మస్ టెస్టుగా మారిన నేపథ్యంలో.. విజయం దక్కడంతో పార్టీ ఊపిరి పీల్చుకుంది. బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచి.. ఉప ఎన్నికలో విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు గాం«దీభవన్‌లో బాణసంచా పేల్చి, మిఠాయిలు పంచారు. డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎంపీ వి.హన్మంతరావు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, టీపీసీసీ నేతలు కుమార్‌రావు, సంగిశెట్టి జగదీశ్వరరావు, కైలాశ్నాగేశ్, అల్లం భాస్కర్, గజ్జి భాస్కర్ తదితరులు ఈ సంబురాల్లో పాల్గొన్నారు. ఇక ఫలితాలు వెలువడుతున్న సమయంలో కొందరు మంత్రులు జూబ్లీ క్లబ్లో సమావేశమయ్యారు. ఫలితం వెలువడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి పార్టీ నేతలు, మంత్రులు క్యూ కట్టారు. -
నవీన్‌యాదవ్ రాత మార్చిన ‘నవంబర్’
సాక్షి, హైదరాబాద్: హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. నవంబర్ నెల ఆయన రాత మార్చేసింది. నవీన్ యాదవ్ 1983 నవంబరు 17న పుట్టారు. 2023 నవంబరు 15న కాంగ్రెస్‌లో చేరారు. 2025 నవంబరు 14నే కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడం విశేషం.అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి కాంగ్రెస్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నికలను రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గతంలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు.ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అవకాశం దక్కింది. ఈ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.పేరు: వల్లాల నవీన్ యాదవ్తండ్రి పేరు: వి.చిన్న శ్రీశైలం యాదవ్వయసు: 42 సంవత్సరాలువిద్యార్హతలు: బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్ట్రాజకీయ అరంగ్రేటం: మజ్లిస్ఎన్నికల్లో పోటీ:2014లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు.2023లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిక2025లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భారీ మెజార్టీతో విజయం -
జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం.. నవీన్ యాదవ్ రియాక్షన్
-
గెలుపుపై నవీన్ యాదవ్ ఫస్ట్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. గెలుపుపై నవీన్ యాదవ్ స్పందిస్తూ.. తన మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. ‘‘నా కుటుంబ సభ్యులపై బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసింది. పదేళ్లలో చేసింది ఏమిలేక...ఏం చెప్పుకోలేక మాపై ఆరోపణలు చేశారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.‘‘నేను కక్షపూరిత రాజకీయాలు చేయను. అధిక నిధులు తీసుకొచ్చి జూబ్లీహిల్స్‌ని మరింత అభివృద్ధి చేస్తా. అభివృద్ధే నా అజెండా. జూబ్లీహిల్స్ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించారు. జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం’’ అంటూ నవీన్‌యాదవ్ చెప్పుకొచ్చారు. నన్ను నా కుటుంబం, వ్యక్తిత్వంపై దెబ్బతిస్తూ ఓట్లు ఆడిగారు. అందుకు జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారు. రిగ్గింగ్,దౌర్జన్యం అనేవి తప్పుడు మాటలు. అధిక బడ్జెట్‌తో జూబ్లీహిల్స్‌ని మరింత అభివృద్ధి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు. -
బీజేపీ ఓటమి.. కిషన్‌రెడ్డి రియాక్షన్ ఇదే..
ఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని విశ్లేషించుకుంటామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ప్రజా తీర్పును గౌరవిస్తామని చెప్పుకొచ్చారు. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలి అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘జూబ్లీహిల్స్‌లో మేము ఎప్పుడూ ఒక కార్పొరేటర్ కూడా గెలవలేదు. స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి ఎప్పుడు గెలవలేదు. మేము ఉన్నంతలో ప్రయత్నం చేశాం. ఎంఐఎం మద్దతు, డబ్బుతోనే జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ప్రత్యేక పరిస్థితులలో జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగాయి. మా పార్టీ అక్కడ బలహీనంగా ఉంది. ఓటమిని విశ్లేషించుకుంటాము. ఓల్డ్ సిటీలో కూడా ఏ పార్టీ గెలవదు. ప్రజా తీర్పును మేము శిరసా వహిస్తాం. ఎంఐఎం సహకరించడం వల్లే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి ఏం చేశాడని అనుకూలంగా ఆయనకు ఓటేయాలి?. రెండు పార్టీలు కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు. దీనిపై మేము ఫిర్యాదు చేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దృష్టిపెట్టాం. జీహెచ్ఎంసీ మేయర్ పదవి గెలుచుకోవడమే మా లక్ష్యం. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనేక చోట్ల డిపాజిట్లు దక్కలేదు’ అని చెప్పుకొచ్చారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి బీహార్ ప్రజలు పట్టడం కట్టారు. మేము ఊహించనంత భారీ విజయాన్ని ప్రజలు ఇచ్చారు. ఓటు చోరీపై కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాన్ని తిప్పికొట్టారు. దేశమంతా ఎస్ఐఆర్ జరగాలి. జూబ్లీహిల్స్‌లో ఓటర్ జాబితా తప్పులు తడకగా ఉంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ నవ్వుల పాలయ్యారు అని ఎద్దేవా చేశారు. -
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఘన విజయం..
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ 25వేల మెజార్టీతో విజయం సాధించింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత రెండో స్థానంలో నిలిచారు. ఇక, మూడో స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన సమయం నుంచి నవీన్ యాదవ్ ముందంజలోనే కొనసాగడం విశేషం. మరోవైపు.. జూబ్లీహిల్స్ గెలుపుతో సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని అన్ని డివిజన్లలో రేవంత్ రెడ్డి విస్తృతంతా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి డివిజన్ స్థాయిలో ప్రచారం చేయడం ఏంటని విమర్శలు చేసిన ఆయన పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్‌కు ఇది రెండో విజయం. ిచివరి నాలుగు రోజులు రేవంత్ ప్రచారంతో కాంగ్రెస్ విజయ అవకాశాలు మరింత మెరుగైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
కాంగ్రెస్ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)
-
5500 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్న నవీన్ యాదవ్
-
జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)
-
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో లేడీ Vs రౌడీ.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
-
కేటీఆర్ అరెస్ట్‌కు అనుమతివ్వాలి..: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం లేకపోతే ఈ నెల 11వ తేదీలోగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఫార్ములా–ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్‌తో అనుమతి ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. లోపాయికారీ ఒప్పందం కారణంగానే కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను బీజేపీ కాపాడుతోందని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని షేక్‌పేట, రహమత్‌నగర్‌లలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో నిర్వహించి కార్నర్ మీటింగుల్లో ప్రసంగించారు. ‘రాబోయే రోజుల్లో బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుంది. ఇది నేను అంటున్న మాట కాదు. వాళ్ల ఆడబిడ్డ చెబుతున్న మాటే. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించినప్పుడల్లా కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని, కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామని పదేపదే చెప్పారు. తీరా కాళేశ్వరంపై దర్యాప్తు చేయాలని కేసును మేము సీబీఐకి అప్పగిస్తే.. మూడు నెలలైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోరితే రెండు నెలలైనా స్పందన లేదు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని దీనితోనే తేలిపోతుంది’అని ఆరోపించారు. కారుగుర్తుకు ఓటేస్తే కమలంగా మారుతుంది బీఆర్ఎస్కు ఓటు వేస్తే ఆ తర్వాత కమలం గుర్తుగా రూపాంతరం చేందుతుందని, కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుపోతుందని సీఎం రేవంత్ అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటేనని ఆరోపించారు. కేంద్రంలో మోదీ ప్రతి నిర్ణయానికి కేసీఆర్ వత్తాసు పలికి మద్దతు ఇచ్చారని తెలిపారు. ‘కారు స్టీరింగ్ మోదీ చేతిలో ఉంది. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీకి బీఆర్ఎస్ సహకరించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు బీజేపీ పరోక్షంగా మద్దతు ఇస్తోంది. ఇక్కడ బీజేపీకి డిపాజిట్ దక్కదు. బీఆర్ఎస్ నేతలు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. 2007లో పీజేఆర్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన కుటుంబంపై కేసీఆర్ అభ్యరి్థని నిలబెట్టి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. పీజేఆర్ సతీమణి కలిసేందుకు వెళితే మూడు గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. ఆనాడు ఒక నీతి, ఇప్పుడు ఒక నీతినా? ఆనాడు పీజేఆర్ కుటుంబాన్ని రోడ్డుపై నిలబెట్టినందు రహమత్‌నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి కేటీఆర్ క్షమాపణ చెప్పాలి’అని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహిళా సెంటిమెంట్ మాట్లాడటమా? బీఆర్ఎస్కు మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడే హక్కు లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ‘సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటినుంచి బయటకు పంపిన దుర్మార్గుడు కేటీఆర్. ఆయన మాగంటి సునీతమ్మను ఆదుకుంటాడంటే నమ్మేది ఎలా? ఇలాంటి వాడు ఎవరింట్లోనైనా ఉంటే అక్కాచెల్లెళ్లు వాతలు పెడుతారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే బీఆర్ఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ను ఎందుకు గెలిపించాలో సమాధానం చెప్పాలి. రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఉచిత బస్సు రద్దు చేయడానికా? ఉప ఎన్నిక తరువాత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదలకు 4 వేల ఇళ్లు ఇప్పించే బాధ్యత నాది’అని సీఎం హామీ ఇచ్చారు. సభల్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అజహరుద్దీన్, డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో రోడ్ షొ నిర్వహించి కార్నర్ మీటింగ్‌లలో ప్రజలనుద్దేశంచి ఆయన ప్రసంగించారు. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఐదేళ్లు మహిళా మంత్రి లేదని.. తాము అధికారంలోకి రాగానే సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చామని గుర్తుచేశారు. శిల్పారామం దగ్గర మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్టాల్స్ ఇచ్చామన్నారు. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే దాన్ని రద్దు చేయాలని మాట్లాడటం బీఆర్ఎస్ బద్ధిని తెలియజేస్తోందని విమర్శించారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్.. జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేస్తున్న ఆ పార్టీ అభ్యర్థి సునీతమ్మను మంచిగా చూసుకుంటాడా అని ప్రశ్నించారు. ఇవన్నీ కేటీఆర్ చెల్లెలే బయటకు వచ్చి చెబుతోందన్నారు. సొంత చెల్లికి అన్నం పెట్టని వారు పిన్నమ్మ కూతురికి బంగారు గాజులు పెడతానంటే ప్రజలు నమ్ముతారా? అని ఎద్దేవా చేశారు. పదేళ్లు పట్టించుకోలేదేం? ఉపఎన్నికలో సెంటిమెంట్ రాజేయాలని బీఆర్ఎస్ చూస్తోందని.. పదేళ్లు అధికారంలో ఉన్నా, అదే పార్టీకి చెందిన వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేసినా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. ఇప్పుడు తాడు బొంగరం లేకుండా అభివృద్ధి చేస్తామని ఓట్లు దండుకోవడానికి ఆ పార్టీ నేతలు ముందుకొస్తున్నారని దుయ్యబట్టారు. మాయమాటలు చెప్పే వాళ్లకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నం పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పనిచేసిందని.. అందుకు ప్రతిగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో ప్రతి సందర్భంలో మోదీ సర్కారుకు కేసీఆర్ మద్దతు పలికారని గుర్తుచేశారు. రాష్ట్రానికి నయా పైసా నిధులు తేలేని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కొత్తగా సమస్యలు ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి.. దాని పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానంలోని బోరబండకు వచ్చి సమస్యలు ఎందుకు పరిష్కరించలేదని సీఎం నిలదీశారు. ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో అభివృద్ధి ‘బీఆర్ఎస్కు పదేళ్లు అవకాశం కల్పించినా అభివృద్ధి జరగలేదు. కాంగ్రెస్‌కు ఈసారి అవకాశం ఇవ్వండి. అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. సాధారణ ఎన్నికల్లో అజహరుద్దీన్‌ను గెలిపిస్తే మంత్రిని చేస్తామని మాట ఇచ్చామని.. ఇచ్చిన మాట ప్రకారం ఆయన్ను మంత్రి పదవి ఇచ్చామని తెలిపారు. స్థానికుడైన నవీన్ యాదవ్‌ను ఆశీర్వదిస్తే రూ. వందల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. అందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత నవీన్ తీసుకుంటాడన్నారు. రోడ్ షో కార్నర్ మీటింగ్‌లలో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజహరుద్దీన్, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికి సినిమా చూపిస్తారో..?
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ నియోజక వర్గం ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికుల ఓట్లను పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. సినీ కార్మికుల మద్దతు కూడగట్టేందుకు మూడు పార్టీల అభ్యర్థులు అందుకు తగిన ప్రచారంతో, హామీలతో ముందుకు వస్తున్నారు. పదుల సంఖ్యలో ఉండే సినీ తారలు, దర్శక నిర్మాతలు, సినీ రచయితలు, కొరియోగ్రాఫర్లు, ఫైట్ మాస్టర్లు, ప్రముఖ నటీ నటులు ఈ నియోజక వర్గంలో లేకపోయినా తెర వెనుక పనిచేసే 24 వేల మంది సినీ కార్మికులు ఈ నియోజక వర్గ పరిధిలోనే ఉంటూ ఓటు హక్కు కూడా కలిగి ఉన్నారు. ఇప్పుడు వీరిని ప్రసన్నం చేసుకునేందుకు ఆయా పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. నియోజక వర్గ పరిధిలోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి, రహ్మత్‌నగర్, యూసుఫ్‌గూడ, శ్రీనగర్ కాలనీ, బోరబండ, ఎర్రగడ్డ, షేక్‌పేట తదితర డివిజన్ల పరిధిలో లైట్‌బాయ్‌లు, జూనియర్ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు, ప్రొడక్షన్ సభ్యులు, డ్రైవర్లు ఇలా సినీ షూటింగ్‌లకు పనిచేసే కారి్మకులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వీరందరికీ చిత్రపురి కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించినా అక్కడున్న రాజకీయాలు, అవినీతి అక్రమాలు స్వార్థపూరిత నాయకత్వంతో వేలాది మంది కారి్మకులకు ఇళ్లు దక్కలేదు. అంతేకాదు వీరికి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా లేకుండా పోయింది. ప్రభుత్వాలు మారినా సినీ కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి జీవితాలు మారుస్తామని నేతలు హామీ ఇవ్వడమే తప్ప ఏ ఒక్కరు చొరవ చూపింది లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నిక నేపథ్యంలో మరోసారి ఆయా పార్టీల అభ్యర్ధులకు సినీ కార్మికులు గుర్తుకు వస్తున్నారు.పరిశ్రమతో ముగ్గురికీ అనుబంధం..సినీ పరిశ్రమతో బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత భర్త మాగంటి గోపీనాథ్‌కు మంచి సంబంధాలు ఉండేవి. ఆయన రవన్న, పాతబస్తీ అనే రెండు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. మొదటి నుంచి సినీ వర్గాలతో మంచి సంబంధాలు నెలకొల్పారు. కారి్మక సంఘాలతోనూ అనుబంధం ఉంది. అంతే కాకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సినీకార్మికులులతో సంబంధాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కార్మికుల మద్దతు పొందేందుకు బీఆర్ఎస్ తగిన వ్యూహాలు రచిస్తోంది.⇒ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు గత నాలుగు దశాబ్ధాలుగా సినీ కార్మిమక సంఘాలతోనూ, వర్కర్స్తోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్‌కు పలుమార్లు సార్లు సలహాదారుగా పని చేశారు. ఆయన తనయుడు వెంకట్ హీరోగా సినిమాలు కూడా నిర్మించారు. సినీ హీరో సుమన్, ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా చేస్తున్నారు. దీంతో సినీ కార్మికుల మద్దతు ఎక్కువగా తమకే ఉంటుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ⇒ బీజేపీ అభ్యర్ధి లంకల్ దీపక్‌రెడ్డి గతంలో టీడీపీలో ఉండేవారు. అప్పటి నుంచే సినీ పరిశ్రమతో ఆయనకు మంచి సంబంధాలు ఉండటమే కాకుండా కారి్మక నాయకులతోనూ సంబంధాలు కొనసాగిస్తున్నారు. సినీ కార్మికుల మద్దతును కూడగట్టేందుకు ఆయన తన పాత పరిచయాలను వినియోగించుకుంటున్నారు. ⇒ గత మూడు నాలుగు రోజులుగా ఆయా పార్టీల అభ్యర్ధులు సినీ కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ మద్దతు కూడగట్టుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో తమకు ఓట్లు వేయాలంటూ సినీ కార్మికులతో పాటు వారి నాయకులను కూడా అభ్యర్థిస్తున్నారు. సినీ తారలతో సినీ కార్మికులు ఉండే ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించాలని కూడా యోచిస్తున్నారు. రాబోయే రోజుల్లో పరిశ్రమకు చెందిన ప్రముఖులను తమ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా వారితో ప్రచారం నిర్వహించాలని కూడా భావిస్తున్నారు.. మొత్తానికి మొట్ట మొదటిసారిగా సినీ కారి్మకుల మద్దతు కూడగట్టేందుకు వారిని ఆకట్టుకునేందుకు , బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ⇒ ఆ దిశగా ప్రచారం కూడా చేయాలని వారి సమస్యలను పరిష్కరిస్తామని, హామీ ఇవ్వాలని కూడా వీరు పేర్కొంటున్నారు. నియోజక వర్గం పరిధిలో పెద్ద సంఖ్యలో సినీ కారి్మకులు ఉంండే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన అభ్యర్థులు, ఆ ఆప్రాంతాల్లో తమకు స్నేహితులైన హీరోలతో ప్రచారం చేయించనున్నారు. సుమారుగా 24 వేల మంది సినీ కార్మికులు ఉన్న ఈ నియోజక వర్గంలో నవంబర్ 11న మెజార్టీ కారి్మకులు ఎవరి వైపు మొగ్గుతారో వేచి చూడాల్సి ఉంది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో వీరికి ఇళ్లు దక్కకపోగా భారీ అవకతవకలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులైన వారికి ఇళ్లు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడం, ప్రత్యేక తెలంగాణ రావడం జరిగిపోయింది. ఇప్పుడు కారి్మకులంతా ఎవరివైపు మొగ్గుచూపుతారో చూడాల్సి ఉంది. -
నవీన్ యాదవ్ ఆస్తులు రూ.29.66 కోట్లు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుఫున పి.నవీన్‌యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో కీలకమైన అఫిడవిట్‌ను ఆయన జతపర్చారు. ఈ మేరకు తనపై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. చేతిలో నగదు రూ.4 లక్షలు, భార్య చేతిలో రూ.2 లక్షలు నగదు ఉందని, ఐదు బ్యాంక్ ఖాతాల్లో రూ.37.6 లక్షలు తన పేరు, తన భార్య పేరున రెండు అకౌంట్లలో రూ.10 వేలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. రూ. 7 లక్షల విలువైన షేర్లు ఉన్నాయని, తన పేరున స్కోడా కారు, తన భార్య పేరిట హుందాయ్ ఐ10 కారు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 11 తులాల బంగారం, తన భార్య పేరున రెండు కేజీల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున 14.39 ఎకరాల వ్యవసాయ భూమి, యూసుఫ్‌గూడలో 860 గజాల ఇంటి స్థలం, భార్య పేరుతో 4.30 ఎకరాల వ్యవసాయ భూమి, 466 గజాల స్థలంలో ఇళ్లు ఉన్నాయన్నారు. మొత్తం స్థిరాస్తుల విలువ రూ.29.66 కోట్లు తన పేరిట, రూ.5.75 కోట్లు భార్య పేరిట ఉన్నాయన్నారు. తనకు అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లుగా అఫిడవిట్లో పొందుపర్చారు. -
పట్టుకోసం బీఆర్ఎస్.. పాగా వేయాలని కాంగ్రెస్..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అందరి దృష్టి ఇప్పుడు ఈ నియోజకవర్గం పైనే నిలిచింది. అధికార కాంగ్రెస్ పారీ్టకి ఈ ఉప ఎన్నికలో గెలుపు సవాల్‌గా మారగా, ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ అదే స్థాయిలో పావులు కదుపుతోంది. ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పారీ్టలు తమ అభ్యర్థులను బరిలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుండగా, ఇంకా బీజేపీ అభ్యరి్థని ప్రకటించకపోవడంతో ప్రచారంలో వెనకబడి ఉంది. ఈఉప ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్లకు నువ్వా..నేనా..! అన్నట్లుగా మారడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో ప్రచారం వేడెక్కుతుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం కాగా సానుభూతితో గెలవాలని బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యరి్థగా గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను రంగంలోకి దింపింది. ఇక స్థానికుడు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఇప్పటికే పలుమార్లు పోటీ చేసిన అనుభవం ఉండడంతో కాంగ్రెస్ పార్టీ యువనేత వి.నవీన్యాదవ్ను అభ్యరి్థగా ప్రకటించింది. నేడో రేపో భారతీయ జనతా పార్టీ లంకాల దీపక్‌రెడ్డిని తమ అభ్యర్ధిగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు 80,549 (43.9 శాతం)ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్‌కు 64,212 (35 శాతం) ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డికి 25,866 (14.1 శాతం) ఓట్లు, ఎంఐఎం అభ్యరి్ధగా పోటీ చేసిన మహ్మద్ రాషేద్ పరాజుద్దీన్కు 7,848 (4.2 శాతం) ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో 1,83,312 ఓట్లు పోలయ్యాయి. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తన పట్టు నిలుపుకుంటుందా..? కాంగ్రెస్‌దే పై‘చేయి’ అవుతుందా? అన్నదానిపై రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే దృష్టి సారించారు. 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో నవీన్.. 2014 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్‌యాదవ్‌కు 41,656 ఓట్లు రాగా రెండో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 2014, 2018 ఎన్నికల్లో ఆయన మాగంటి గోపీనాథ్ పైనే పోటీ చేశారు. తాజాగా మూడోసారి మాగంటి భార్యతో పోటీ పడుతున్నారు. -
బీఆర్ఎస్కు మా బలమేంటో చూపిస్తాం: నవీన్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Telangana Election) ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తోందని విమర్శించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ బలమేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్(Naveen Yadav) తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఎన్నికల్లో నన్ను ఎదుర్కోనే ధైర్యం లేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాపై తప్పుడు కేసులు పెడుతున్నాయి. ఓటర్ కార్డుల కేసులో నిర్ధోషిగా తేలుతాను. బీసీ బిడ్డను అయినా అందరివాడిని. టికెట్ కోసం ప్రయత్నించిన అందరిని కలుపుకుని పోతాను. రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.. ఇంకా చేస్తాం. బీఆర్ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కపై చెల్లవు కాంగ్రెస్ బలమేంటో ఉప ఎన్నికల్లో తెలుస్తుంది. మా బలం చూపిస్తాం అని చెప్పుకొచ్చారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి.. ఎవరీ నవీన్ యాదవ్..?
సాక్షి, హైదరాబాద్: ఊహించినట్టే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారైంది. కాంగ్రెస్ అధిష్టానం బీసీ సామాజిక వర్గానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు స్థానికుడికి అవకాశం కల్పించింది. అధికార పార్టీ కావడంతో పలువురు సీనియర్లు, హేమాహేమీలు పోటీ పడినప్పటికీ.. యువ నేత అభ్యర్థితానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది . గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడంతో ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసి.. ఎన్నికల బరి నుంచి తప్పించింది కాంగ్రెస్ అధిష్టానం. గత ఎన్నికలకు ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో కాంగ్రెస్‌లో చేరిన నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయింది. రెండుసార్లు పోటీ ⇒ ఇప్పటికే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి నవీన్ యాదవ్ రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పక్షాన పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ⇒ ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ ఎన్నికల బరికి దూరం పాటించడంతో.. ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. ⇒ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక అనివార్యం కావడంతో ఇప్పుడు అవకాశం దక్కినట్లయింది. మజ్లిస్ మద్దతు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మజ్లిస్ దూరం పాటిస్తున్న కారణంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఉప ఎన్నికల్లో యువనేతను ఎన్నుకోవాలని పిలుపునివ్వడం, బీఆర్ఎస్పై విమర్శనాస్త్రాలు సంధించడంతో కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయింది. అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభివృద్ధి మంత్రంతో విజయావకాశాలను సుగమం చేసుకున్నా.. అభ్యర్థిత్వం ఖరారులో మాత్రం మజ్లిస్ పార్టీ జోక్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లను కాదని యువనేతకు అవకాశం కల్పించినట్లు కనిపిస్తోంది. -
జూబ్లీహిల్స్‌కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ శాసనసభ నియో జకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తన అభ్య ర్థిగా నవీన్‌యాదవ్ పేరును ప్రకటించింది. కొద్దిరోజులుగా అనేక ఊహాగానాలు వినిపించినా చివరకు యువ నాయకుడు నవీన్ యాద వ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఉప ఎన్నిక అభ్యర్థిపై గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్రస్థాయిలో మంతనాలు జరి గాయి. పలువురు ఆశా వహులు ఢిల్లీ స్థాయిలో గట్టి లాబీయింగ్ నడిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పలు సర్వేలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. చివరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.యువత, సామాజికవర్గం ఓట్లే లక్ష్యంగా..నియోజకవర్గంలో యువ నాయకుడిగా, స్థాని కంగా మంచి పట్టున్న నేతగా నవీన్ యాదవ్‌కు పేరుంది. ఆయన తండ్రి బంజారాహిల్స్ కార్పొ రేటర్‌గా పనిచేయడం, నియోజకవర్గంలోని ఓటర్లతో తన కుటుంబానికి సత్సంబంధాలు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా పార్టీ అధిష్టానం భావించింది. యాదవ సామా జికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, యువతలో మంచి ఆదరణ ఉండటంతో గెలుపు అవకాశా లు మెరుగ్గా ఉంటాయని హైకమాండ్ అంచనా వేసింది. ఈ సమీకరణాలన్నింటినీ బేరీజు వేసు కున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్
ఢిల్లీ: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూబ్లీహిల్స్ తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యమైన నగర ప్రాంత నియోజకవర్గాలలో ఒకటి. నవీన్ వైపే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను కాంగ్రెస్ గెలుచుకుంది. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు. అయితే సీఎం రేవంత్ మాత్రం నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్‌కు లైన్ క్లియర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఇవాల నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో నవీన్ వైపే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి రేస్‌లో నుంచి తప్పుకున్నట్లు బొంతు రామ్మోహన్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయిస్తుందని.. ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పనిచేస్తానంటూ బొంతు రామ్మోహన్ తెలిపారు.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను గెలుచుకున్న ఆ పార్టీ.. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు.. అయితే సీఎం రేవంత్ నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలిసింది. -
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ కీలక నేత నవీన్ యాదవ్‌పై(Naveen Yadav) క్రిమినల్ కేసు నమోదైంది. నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేయడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ(Election Code) ఆయనపై కేసు నమోదు చేశారు.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికల షెడ్యూల్ సోమవారం విదులైన విషయం తెలిసిందే. కాగా, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న క్రమంలో నియోజకవర్గ పరిధిలో ఓటర్లకు నవీన్ యాదవ్ ఓటరు కార్డులను పంపిణీ చేశారు. దీంతో ఎన్నికల సంఘం నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై అధికారులు సీరియస్ అయ్యారు.అనంతరం, దీన్ని ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యగా భావిస్తూ.. జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి రజినీకాంత్ రెడ్డి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నవీన్ యాదవ్‌పై బీఎన్ఎస్ యాక్ట్‌లోని సెక్షన్ 170,171,174 ప్రజాప్రాతినిధ్య చట్టం కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. నవీన్ యాదవ్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్నారు. ఇక, తాజాగా ఆయనపై క్రిమినల్ కేసు నమోదు కావడంతో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. -
అనూహ్యం.. గెలుపే వ్యూహం
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా మాజీ క్రికెటర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌ను రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేయడంతో, పార్టీ పరంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనూహ్య మలుపు తీసుకుంది. ఈ ఎన్నికలో అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పేరు దాదాపు ఖరారైందనే వార్తల నేపథ్యంలో..అనూహ్యంగా ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ నిర్ణయం వెనుక ఢిల్లీ పెద్దల సిఫారసు ఉందని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఆలోచించి నియోజకవర్గంలో గెలుపే ధ్యేయంగా నిర్ణయం తీసుకుందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. అజారుద్దీన్ రేసు నుంచి వైదొలగడంతో ఆ స్థానంలో పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. సర్వేలతో పాటు సామాజిక సమీకరణలు, ఎన్నికల నాటికి స్థానిక పరిస్థితుల ఆధారంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరన్నది ఖరారు చేస్తారని సమాచారం. అన్ని అంశాలూ పరిగణనలోకి...!జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో జీహెచ్ఎంసీ మాజీ మేయర్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్, జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు వి.నవీన్యాదవ్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇద్దరూ బలమైన బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో పాటు ఇతర సమీకరణలను కూడా పరిగణనలోకి తీసుకుని ఆ ఇద్దరి పేర్లను పీసీసీ తీవ్రంగా పరిశీలిస్తోంది. రేసులో స్థానిక కార్పొరేటర్ సి.ఎన్.రెడ్డి కూడా ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం నుంచి టికెట్ ఇవ్వాలనుకుంటే పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.అయితే చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ పెద్దలు యోచించినా ఆయన పోటీకి విముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మున్నూరు కాపు, యాదవ (భార్య కులం) సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు హైదరాబాద్ మేయర్‌గా పనిచేసిన అనుభవం, సౌమ్యుడనే పేరు, బీజేపీ, బీఆర్ఎస్ నేతలతో కూడా గతంలో సంబంధాలు కలిగిన బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు స్థానికుడైన యాదవ సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ కూడా టికెట్ కోసం గట్టిగా పట్టు పడుతున్నట్లు సమాచారం. వీరే కాక చివరి నిమిషంలో అన్ని హంగులున్న మరో ప్రముఖ వ్యక్తి కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉందని, అయితే ఆ వ్యక్తి పేరును ఇప్పుడే బహిర్గతం చేయలేమని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. ఆయనకు మంత్రి.. ఈయనకు మంచి పదవిఎమ్మెల్సీగా నామినేట్ అయిన అజారుద్దీన్‌కు భవిష్యత్తులో కేబినెట్లో కూడా స్థానం లభించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ జిల్లాతో పాటు మైనార్టీ కోటాలో అజారుద్దీన్ మంత్రి అవుతారని, ఈయనకు హైకమాండ్ ఆశీస్సులు కూడా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్సీగా మొన్నటివరకు పనిచేసిన మరో మైనార్టీ నేత అమేర్ అలీఖాన్‌కు కూడా ప్రభుత్వ పదవి ఇస్తారని అంటున్నారు. ఆయనను కీలక కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ కన్ను
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తీవ్రంగా పరిగణిస్తోంది. నగరంలోని మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో దక్కించుకునేందుకు పకడ్బందీగా వ్యూహ రచన చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వాస్తవంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్‌లో గట్టెక్కడం క్లిష్టమైనా.. అధికార పక్షం కావడంతో ఉప ఎన్నికల కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోంది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న ధీమాతో జూబ్లీహిల్స్ సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నా.. అధిష్టానం సర్వే నిర్వహించి గెలుపు గుర్రాన్ని బరిలో దింపాలని యోచిస్తోంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హవా కొనసాగి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి.. రాజధాని నగరంలో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. తర్వాత ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం దక్కింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో మరో నియోజకవర్గం చేజిక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అయితే.. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గెలుపుపై మజ్లిస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వాస్తవంగా నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. మజ్లిస్ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈసారి కూడా బరిలో దిగితే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.జూబ్లీహిల్స్ సంపన్నులతో పాటు ముస్లింలు అత్యధికం ఉండే నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్ 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గిన మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మారి 2018, 2023 వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 2014, 2018 వరుస ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించి క్రికెటర్ అజహరుద్దీన్‌ను బరిలో దింపడంతో విష్ణువర్ధన్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు మాత్రం ఓటమి తప్పలేదు.టికెట్ రేసులో ముగ్గురు నేతలు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్ (Azharuddin) మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మైనారిటీ కోటా కింద మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లో పేరొందిన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఈసారి బరిలో దిగేందుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో నవీన్ యాదవ్ (Naveen Yadav) కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దింపక పోవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: జూలై రెండో వారంలో స్థానిక సంస్థల నగారా కార్మిక నేత దివంగత పీజేఆర్ (PJR) కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినా ఆమెకు విజయం దక్కలేదు. అక్కడి నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో భవిష్యత్తులో సైతం ఖైరతాబాద్‌పై ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. దీంతో తన తండ్రి చివరిసారిగా ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్‌పై విజయారెడ్డి దృష్టి సారించి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.పెరిగిన ఓటు బ్యాంక్‌పై ఆశలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఓటు బ్యాంక్ పెరగడంతో ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం అదే పునరావృత్తమైతే విజయం సునాయాసమేనని కాంగ్రెస్ భావిస్తోంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిన బీఆర్ఎస్కు 43.94 శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్ 35.03 శాతం ఓట్లతో రెండో స్థానానికి పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇక్కడ తన ఓటు శాతాన్ని 50.83కు పెంచుకోగలిగింది. ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు పునరావృత్తం కావచ్చని అంచనా వేస్తోంది. -
తారంగ హిట్టవ్వాలి – ఎంపీ దయాకర్
‘‘తారంగ’ ట్రైలర్ చూస్తుంటే బలమైన కథతో దర్శకుడు చక్కగా తీశాడనిపిస్తోంది. చిన్న సినిమాగా తెరకెక్కిన ‘సారంగ’ హిట్టయి, పెద్ద సినిమా అవ్వాలి’’ అన్నారు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్. కట్ల ఇమ్మోర్టల్, కట్ల డాండి, పూజ నాగేశ్వర్ కీలక పాత్రల్లో సంపత్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం ‘తారంగ’. శ్రీనివాస రెడ్డి కర్రి నిర్మించిన ఈ సినిమా టీజర్‌ను పసునూరి దయాకర్, గ్లింప్స్‌ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పొటీ చేసిన నవీన్ యాదవ్ విడుదల చేశారు. నిర్మాత టి. రామ సత్యనారాయణ, దర్శకుడు శివ నాగు, నైజాం డిస్ట్రిబ్యూటర్ రాజేంద్ర ప్రసాద్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ లవ్‌స్టోరీగా మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం సాగుతుంది’’ అన్నారు సంపత్ కుమార్, శ్రీనివాస రెడ్డి కర్రి. -
ఆ నలుగురు హడల్
సాక్షి,సిటీబ్యూరో: గత ఎన్నికల్లో వారు ఓటమి చెందినా వారివారి పార్టీలను వీడలేదు. ఈ నాలుగున్నరేళ్లు ప్రజల్లోనే మమేకమై ఉన్నారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అధిష్టానాలు తమకు తప్పకుండా టికెట్ ఇస్తాయని ఆశించారు. కానీ కారణాలు ఏమైనా అనుకున్నది జరగలేదు. టికెట్ల పంపకాల్లో వారిని పక్కన పెట్టారు. దీంతో కలత చెంది తిరుగుబావుటాలు ఎగరేసి నగరంలోని ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్నారు. తాము ఆశించిన పార్టీలు టికెట్ ఇవ్వకపోవడంతో బీఎస్పీ నుంచి కొందరు, స్వత్యంత్ర అభ్యర్థులుగా మరికొందరు బరిలోకి దిగారు. ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. తమ బలమైన ప్రాంతాలను ఎంపిక చేసుకుని బూత్ స్థాయిలో పనిచేస్తున్నారు. అయితే, ఈసారి అధికంగా టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల టికెట్ ఆశించి భంగపడ్డ వారే రెబల్స్‌గా పోటీలో ఉండడంతో తమ ఓటు బ్యాంక్‌కు ఏ రూపంలో గండి పడుతుందోనన్న భయం అధికార పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది. జూబ్లీహిల్స్‌లో నవీన్ స్వతంత్ర బావుటా గడిచిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీచేసిన నవీన్ యాదవ్ 41,656 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు. అయితే, ఈసారి ఆయనకు ఎంఐఎం టికెట్ నిరాకరించింది. స్థానికంగా బలమైన కేడర్ గల నవీన్ మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో బూత్ ల వారిగా ఇప్పటికే కమిటీలను నియమించుకుని పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతున్నారు. సహజంగా ఎంఐఎం–టీఆర్ఎస్ల మధ్య ఉన్న సఖ్యత నవీన్‌యాదవ్ పోటీతో చెడిపోయింది. దీంతో మైనారిటీ ఓట్లపై టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ పెట్టుకున్న ఆశలు నెరవేరే పరిస్థితి లేదు. ఖైరతాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జిగా పనిచేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి గత ఎన్నికల్లో పోటీ చేసి భారీగానే ఓట్లు సాధించారు. ఈసారి కూడా టికెట్ తనకే ఇస్తారని ఆశించినా నెరవేరలేదు. దీంతో ఆయన బీఎస్పీ అభ్యర్థిగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. గోవర్ధన్‌రెడ్డి భార్య కవిత వెంకటేశ్వరనగర్ కార్పొరేటర్‌గా కూడా పనిచేస్తుండడం, ఆయనపై సాను భూతి వ్యక్తం ఉండడంతో టీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్‌పై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. కూకట్‌పల్లిలో హరీష్‌రెడ్డి టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ పన్నాల హరీష్‌రెడ్డి కూకట్పల్లి నుంచి బీఎస్పీ అభ్యర్థిగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హరీష్ సతీమణి బాలాజీనగర్ కార్పొరేటర్ కావ్య సైతం విస్తృతంగానే ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటి దాకా హరీష్ నియోజకవర్గాన్ని రెండుసార్లు చుట్టి వచ్చారు. బూత్‌స్థాయిలో విస్తృతమైన అనుచరగణాన్ని తయారు చేసుకుని ముందుకు వెళుతున్నారు. హరీష్ టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ ఓట్లు సైతం భారీగా చీల్చే అవకాశం కనిపిస్తోంది. ఇక మేడ్చల్ నియోజకవర్గంలోనూ మాజీ టీఆర్ఎస్ నాయకుడు నక్కా ప్రభాకర్‌గౌడ్ ప్రధాన పార్టీలకు గట్టి సవాల్నే విసురుతున్నారు. ఆయనకు టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవంతో బీఎస్పీ అభ్యర్థిగా రంగంలోకి దిగి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ప్రధాన పార్టీలను మించి ర్యాలీలు నిర్వహిస్తుండడం విశేషం. -
దత్తాత్రేయ ఇల్లు ముట్టడి
‘తెలంగాణ జాగృతి’ విద్యార్థులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తల అరెస్టు హైదరాబాద్: కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని తెలంగాణ జాగృతి యువజన విభాగం కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. రోహిత్ ఆత్మహత్యకు బండారు దత్తాత్రేయ కారణమయ్యారని, ఆయన తక్షణం మంత్రిపదవికి రాజీనామా చేయాలని, దీనిపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాంనగర్‌లోని దత్తాత్రేయ నివాసాన్ని తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అహ్మద్, గ్రేటర్ అధ్యక్షుడు నవీన్ యాదవ్‌ల ఆధ్వర్యంలో 100 మందికిపైగా విద్యార్థులు ముట్టడించారు. ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తోసుకుని గేటు లోపలికి చొరబడి బైఠాయించారు. మంత్రికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆ సమయంలో మంత్రి తన నివాసంలో లేకపోవడంతో ఆయన వచ్చి క్షమాపణలు చెప్పే వరకు ఇక్కడి నుంచి కదలబోమన్నారు. ముషీరాబాద్ పోలీసులు వారిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్‌కు తరలించారు. ఎంఆర్పీఎస్ కార్యకర్తల ఆందోళన: కేంద్రమంత్రి దత్తాత్రేయ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ‘మాదిగ రాజ్యాధికార పోరాట సమితి’ కార్యకర్తలు మంగళవారం దత్తాత్రేయ నివాసం ముట్టడికి యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు 9 మందిని అరెస్ట్ చేసి గాంధీనగర్ పీఎస్‌కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో ‘మాదిగ రాజ్యాధికార పోరాట సమితి’ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు తిమ్మన నవీన్‌రాజు మాదిగ, ఈశ్వర్, వినోద్‌కుమార్ తదితరులు ఉన్నారు.


