
అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
సీనియర్లు పోటీపడినా యువనేత వైపు మొగ్గిన అధిష్టానం
కుల, యువ ఓట్లు దక్కించుకోవచ్చనే వ్యూహం
సాక్షి, న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ శాసనసభ నియో జకవర్గ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ తన అభ్య ర్థిగా నవీన్‌యాదవ్ పేరును ప్రకటించింది. కొద్దిరోజులుగా అనేక ఊహాగానాలు వినిపించినా చివరకు యువ నాయకుడు నవీన్ యాద వ్ వైపే అధిష్టానం మొగ్గు చూపింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఈ ఉప ఎన్నిక అభ్యర్థిపై గత కొద్ది రోజులుగా పార్టీలో తీవ్రస్థాయిలో మంతనాలు జరి గాయి.
పలువురు ఆశా వహులు ఢిల్లీ స్థాయిలో గట్టి లాబీయింగ్ నడిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం పలు సర్వేలు, స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. చివరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం ప్రకటన విడుదల చేశారు.
యువత, సామాజికవర్గం ఓట్లే లక్ష్యంగా..
నియోజకవర్గంలో యువ నాయకుడిగా, స్థాని కంగా మంచి పట్టున్న నేతగా నవీన్ యాదవ్‌కు పేరుంది. ఆయన తండ్రి బంజారాహిల్స్ కార్పొ రేటర్‌గా పనిచేయడం, నియోజకవర్గంలోని ఓటర్లతో తన కుటుంబానికి సత్సంబంధాలు ఉండటం ఆయనకు కలిసివచ్చే అంశాలుగా పార్టీ అధిష్టానం భావించింది.
యాదవ సామా జికవర్గానికి చెందిన వ్యక్తి కావడం, యువతలో మంచి ఆదరణ ఉండటంతో గెలుపు అవకాశా లు మెరుగ్గా ఉంటాయని హైకమాండ్ అంచనా వేసింది. ఈ సమీకరణాలన్నింటినీ బేరీజు వేసు కున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.