
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Telangana Election) ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య రాజకీయం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్‌ఎస్ సెంటిమెంట్‌తో రాజకీయం చేస్తోందని విమర్శించారు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. కాంగ్రెస్ బలమేంటో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చూపిస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్(Naveen Yadav) తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఎన్నికల్లో నన్ను ఎదుర్కోనే ధైర్యం లేక బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాపై తప్పుడు కేసులు పెడుతున్నాయి. ఓటర్ కార్డుల కేసులో నిర్ధోషిగా తేలుతాను. బీసీ బిడ్డను అయినా అందరివాడిని. టికెట్ కోసం ప్రయత్నించిన అందరిని కలుపుకుని పోతాను. రూ.180 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది.. ఇంకా చేస్తాం. బీఆర్‌ఎస్ సెంటిమెంట్ రాజకీయాలు ఇక్కపై చెల్లవు కాంగ్రెస్ బలమేంటో ఉప ఎన్నికల్లో తెలుస్తుంది. మా బలం చూపిస్తాం అని చెప్పుకొచ్చారు.