
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్(Jubilee Hills by-election) ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బీఆర్‌ఎస్(BRS Party) పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి(Vijaya Shanthi) ఆరోపించారు. ‘జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ పోటీ చేస్తున్న కారణంగా మిత్ర ధర్మం కోసం ఈ ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగుతున్నట్టు తెలుగుదేశం పార్టీ ప్రకటించింది.
బీజేపీ(BJP) డమ్మీ అభ్యర్థిని బరిలోకిదింపి తన రహస్య మిత్రపక్షమైన బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పైకి బీజేపీకి మద్దతిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినా, రహస్యంగా బీఆర్‌ఎస్ గెలుపు కోసం తెలుగుదేశం కార్యకర్తలు పనిచేయాలని సందేశం పంపినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీయాలనే కుట్రతో టీడీపీ మద్దతు బీఆర్‌ఎస్‌కు లభించే విధంగా బీజేపీ రహస్య అవగాహన కుదిర్చినట్టు సమాచారం. బీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీల అవకాశవాద రాజకీయాన్ని జూబ్లీహిల్స్ ఓటర్లకు వివరించే బాధ్యతను స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తీసుకోవాలని కోరుతున్నాను’అని సోమవారం విజయశాంతి ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని తేలడంతో బిఆర్ఎస్ పార్టీ అనైతిక అవగాహన కుదుర్చుకునేందుకు కుట్రలు చేస్తున్నట్లువార్తలు వస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బిజెపి పోటీ చేస్తున్న కారణంగా కమలం పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ మిత్ర ధర్మం కోసం ఈ… pic.twitter.com/lZmuxZIK7X
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 6, 2025