మళ్లీ రావడం ఎందుకు అని అనుకున్నాడో? లేక.. ఆటోలో తీసుకెళ్తే చార్జి అధికం అవుతుందనే తెలియదు కానీ.. ఓ వ్యక్తి టూవీలర్‌పై ఒకేసారి ఎనిమిది డ్రమ్ములు తీసుకెళ్తూ ఇలా కనిపించాడు. చూసేవారు ఖాళీ డ్రమ్ములే కదా? ఏం కాదులే అని చమత్కరిస్తుంటే.. మరికొందరు వచ్చిపోయే వారికి సైడ్‌కూడా ఇవ్వకుండా ఇంత ప్రమాదకరంగా ప్రయాణించడం అవసరమా? అని విమర్శలు గుప్పించారు. పెద్దపల్లి పట్టణంలోని చీకురాయి చౌరస్తా నుంచి వెళ్తూ డ్రమ్ముల టూవీలర్ సాక్షికి ఇలా కనిపించాడు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


