
ఎన్ని స్థానాల్లో అయినా నామినేషన్లు వేయొచ్చు
ఒక్క స్థానంలోనే పోటీ చేయాలి
సంబంధిత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి
సాక్షి, హైదరాబాద్: తొలిదశ స్థానిక ఎన్ని కలకు గురువారం నోటిఫికేషన్లు జారీ కానుండగా, వెనువెంటనే నామినేషన్లు స్వీకరించనున్నారు. అయితే నామినేషన్ల దాఖలు విషయంలో అభ్య ర్థులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
» ఫారం–4 (అనుబంధం–3)లో ఉన్న నమూనాలో నామినేషన్ పత్రం ఉండాలి
» ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసేవారు సంబంధిత ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదై ఉండాలి
» పోటీ చేసే అభ్యర్థి, ప్రతిపాదించే వ్యక్తి ఇద్దరి పేర్లు మండల, జిల్లా పరిషత్ ఓటర్ల జాబితాల్లో ఉండాలి
» ఒక స్థానానికి ఒక అభ్యర్థిని వివిధ వ్యక్తులు ప్రతిపాదించవచ్చు
» ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో ఒకటి కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్ వేయొచ్చు కాని ఒక దాంట్లోనే పోటీ చేయాలి.
» ఒక ఎంపీటీసీ, ఒక జెడ్పీటీసీ స్థానంలో పోటీ చేయొచ్చు
» రిటర్నింగ్ అధికారికి నిర్దేశిత ప్రదేశంలో నామినేషన్లు అందజేయాలి
» గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీ లేదా రిజర్వ్‌డ్ చిహ్నం కలిగి రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీ ద్వారా పోటీ చేస్తున్న అభ్యర్థి, నోటిఫికేషన్ ఫారమ్–2లో ఆ పార్టీ పేరు నమోదు చేయాలి. రాజకీయ పార్టీ నుంచి పొందిన అభ్యర్థిత్వ ధ్రువీకరణ ఫారమ్–బీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ సాయంత్రం 3 గంటల లోగా సంబంధిత రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి
» రిజర్వ్ గుర్తు లేని రిజస్టర్డ్ రాజకీయ పార్టీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎస్‌ఈసీ సూచించిన రిజర్వ్ కాని (ఫ్రీ) చిహ్నాల జాబితా నుంచి ప్రాధాన్యతా క్రమంలో మూడు చిహ్నాలను ఎంపిక చేసుకుని నామినేషన్ పత్రంలో సూచించాలి
నామినేషన్ ఫారానికి జత చేయాల్సిన డిక్లరేషన్లు
» ఎస్సీ, ఎస్టీ, బీసీ హోదాకు సంబంధించిన డిక్లరేషన్లు
» ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం రిజర్వ్ చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ ఫారం (అనుబంధం–3తో సంబంధిత కులం, తెగ, తరగతికి చెందినవారిగా ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
» ఎస్సీ, ఎస్టీ, బీసీఅభ్యర్థులు పోటీకి డిపాజిట్ చేసే మొత్తంలో రాయితీకి అర్హులు
» రిటర్నింగ్ అధికారి ప్రతిరోజు తాను స్వీకరించిన నామినేషన్ల వివరాలను ఫారమ్–5లో ప్రచురించాలి.