జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ | Naveen Yadav as Congress MLA candidate for Jubilee Hills | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్

Oct 8 2025 10:29 PM | Updated on Oct 8 2025 10:45 PM

Naveen Yadav as Congress MLA candidate for Jubilee Hills

ఢిల్లీ: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూబ్లీహిల్స్ తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యమైన నగర ప్రాంత నియోజకవర్గాలలో ఒకటి. నవీన్‌ వైపే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం.

అధికార కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్‌ ఉప ఎన్నికను కాంగ్రెస్‌ గెలుచుకుంది. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్‌ చైర్మన్లు, సీనియర్‌ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్‌ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు. అయితే సీఎం రేవంత్‌ మాత్రం నవీన్‌ వైపే ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement