breaking news
Jubilee Hills Assembly Constituency
-
‘జూబ్లీహిల్స్ బరిలో 58 మంది’
హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ లో మొత్తం ఓటర్ల సంఖ్య- 4,01,365 ఉండగా, పురుషులు- 2,08,561, మహిళలు 1,92,779 మంది ఉన్నారన్నారు. ఇతరులు 25 మంది మాత్రమే ఉన్నారన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వివరాలు వెల్లడించిన ఆర్వీ కర్ణన్.. ‘ ముగ్గురు అబ్జర్వర్స్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తూ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో ఉంటుంది. ఈసారి 4 బ్యాలెట్ యూనిట్లు, ఒక వీవీ ప్యాట్ ఉంటుంది. ప్రతీ పోలింగ్ స్టేషన్ వద్ద ఓటర్ అసిస్టెంట్ బూత్ ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్ వద్ద మొబైల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ మొబైల్ డిపాజిట్ చేసి పోలింగ్ స్టేషన్‌కి వెళ్లాలి. పోలింగ్ స్టేషన్ లోపలికి ఓటర్లకు, ఏజెంట్లకు మొబైల్ అనుమతి లేదు’ అని తెలిపారు.2 కోట్ల 83 లక్షల రూపాయల నగదు పట్టుకున్నాంఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల రూపాయల నగదు పట్టుకున్నామన్నారు పోలీస్ అడిషనల్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ స్పష్టం చేశారు. ‘ టీమ్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నాయి. ఇప్పటివరకు 2 కోట్ల 83 లక్షల నగదు పట్టుకున్నాం. 512 లీటర్ల మద్యం సీజ్ చేశాం. ఎలెక్షన్ కోడ్ ఉల్లంఘించిన వారిపై 11 కేసులు నమోదు చేశాం. సోషల్ మీడియా ప్రచారం పై నిఘా పెట్టాం. ఈవీఎంలు సరిపడా ఉన్నాయి. 20 శాతం ఈవీఎంల ఎక్స్ట్రా ఉన్నాయి. ఓటర్ స్లిప్పులు స్థానిక బూత్ లెవెల్ ఆఫీసర్లు ఓటర్లకు పంచుతారు. పొలిటికల్ పార్టీల వారు ఓటర్ స్లిప్పులు పంచితే కేసులు నమోదు చేస్తాం. ఈనెల 27న పారా మిలిటరీ బలగాలు వస్తున్నాయి. 8 కంపెనీల పారా మిలిటరీ బలగాలు నియోజకవర్గంలో పని చేస్తాయి. క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో పారా మిలిటరీ బలగాలు విధుల్లో ఉంటాయి. 65 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి’ అని తెలిపారు. -
గల్లా పట్టి నిలదీయండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఒక రౌడీషీటర్‌ను పోటీలో నిలబెట్టి ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టింది. కాంగ్రెస్ ప్రచారంలో రౌడీషీటర్లు పాల్గొంటూ కత్తులు, కటార్లతో ఇప్పుడే వీరంగం వేస్తున్నారు. రౌడీలను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇజ్జత్ (గౌరవం) ఉంటుందా? రౌడీషీటర్‌గా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి పొరపాటున గెలిస్తే నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంటుంది. రౌడీషీటర్ కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించి నియోజకవర్గ గౌరవంతోపాటు హైదరాబాద్‌లో శాంతిభద్రతలను ఓటర్లు కాపాడుకుంటారనే నమ్మకం ఉంది’అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలతో మమేకమై కాంగ్రెస్ దుష్ట పాలనపై అవగాహన కల్పించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి భారీ మెజారిటీ సాధించేలా కష్ట పడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఎర్రవల్లి నివాసంలో గురువారం కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం నిర్వహించారు. సుమారు మూడు గంటలపాటు సాగిన సుదీర్ఘ సమావేశంలో పార్టీ అభ్యర్థి గెలుపు, భారీ మెజారిటీ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహాలు, ఎత్తుగడలు, కార్యాచరణపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పెద్దలను గల్లా పట్టి నిలదీయాలి ఓట్ల కోసం వచ్చే ప్రభుత్వ పెద్దలను గల్లాపట్టి నిలదీయాలని ప్రజలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలో దిగజారిన ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి నిలిచిపోవడం గురించి ఇంటింటికీ తిరిగి వివరించండి. హైడ్రా పేరిట బుల్డోజర్లను పేదల గుడిసెల మీదికి పంపి నిలువ నీడ లేకుండా చేస్తున్న ప్రభుత్వ పెద్దలను ఓటు కోసం వస్తే గల్లా పట్టి నిలదీయాలి. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో మానవీయ కోణంలో అమలు చేసిన కేసీఆర్ కిట్ నుంచి కళ్యాణలక్ష్మి వరకు పథకాలు నిలిచిపోవడానికి కారకులైన కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలి. కరోనాతో పాటు పెద్దనోట్ల రద్దుతో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని కూడా తట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం, కానీ, రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిలో ఆర్థిక సంక్షోభంలోకి నెడుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసహ్యం, ఏహ్య భావం నిండివుంది. ప్రజల చేతిలో పైసలు ఆడక పరేషాన్లో ఉన్నారు. రెండేళ్లు కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఖతం చేసింది. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ పార్టీయే అని తెలంగాణ సమాజం స్పష్టతతో ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపును ప్రజలు ఎప్పుడో ఖాయం చేశారు. భారీ మెజారిటీ సాధించేలా ప్రజలతో కలిసి పనిచేయడం మీ బాధ్యత’అని పార్టీ నేతలకు కేసీఆర్ సూచించారు. రాష్ట్రానికైనా, కుటుంబానికైనా పతారా (పరపతి) ఉంటేనే అతార (డిమాండ్) పెరుగుతుందని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గురించి ప్రజలు ఆలోచించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఒక చార్టును తయారు చేసుకుని ప్రజల్లోకి వెళ్లి, తాము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వాలని ఆదేశించారు. ఎర్రవల్లి నివాసంలో నేతల సందడి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు ఉప ఎన్నిక కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జి జగదీశ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వీరితోపాటు ఉప ఎన్నికలో పార్టీ తరపున డివిజన్, క్లస్టర్ ఇన్చార్జిలుగా ప్రచారం చేస్తున్న పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ నేపథ్యంలో ఎర్రవల్లి నివాసం సందడిగా మారింది. సమావేశానికి వచ్చిన నేతలను కేసీఆర్ పేరు పేరునా పలకరించారు. పార్టీ అభ్యర్థి వెంట ప్రచారంలో ఉండాలని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. -
జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్లను తొలగించండి
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అడ్డదారుల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. నియోజకవర్గం పరిధిలోని 400 పోలింగ్ బూత్‌లలో 50 చొప్పున 20 వేల దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఆరోపించారు.జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’పై మాట్లాడుతుంటే జూబ్లీహిల్స్‌లో మాత్రం కాంగ్రెస్ దొంగ ఓట్లతో గెలిచేందుకు ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. డూప్లికేట్ ఓటర్ల నమోదు, ఇతర అవకతవకలపై సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో)కి పార్టీ నేతలతో కలిసి కేటీఆర్ వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటర్ లిస్టుపై సమగ్ర దర్యాప్తు చేయాలి ‘ఒక్కో వ్యక్తికి మూడు నాలుగు ఓటర్ గుర్తింపు కార్డులున్నాయి. వేర్వేరు అడ్రస్‌లపై ఒకే వ్యక్తి ఓటు నమోదు, కొద్దిపాటి మార్పులతో ఒకే వ్యక్తి పేరు పలు చోట్ల నమోదు వంటి అంశాలు మా దృష్టికి వచ్చాయి. ఒక్కో ఇంట్లో వందకు పైగా ఓట్లను నమోదు చేసినట్లుగా వందల ఉదంతాలు ఉన్నాయి. ఇంటి యజమానులకు కూడా తెలియకుండా వారి చిరునామాపై ఓట్లు నమోదు అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి అధికారులతో కుమ్మక్కై దొంగ ఓట్లు చేర్చినట్టు అనుమానంగా ఉంది. ఓటర్ జాబితా అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలి అని ఎన్నికల సంఘాన్ని కోరాం’అని కేటీఆర్ తెలిపారు. మొత్తం రాష్ట్ర మంత్రులంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేరి అధికార దురి్వనియోగానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఓటర్ జాబితా అక్రమాలపై నామినేషన్ల ప్రక్రియ ముగిసేలోగా చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. దొంగ ఓట్ల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీని ప్రజా క్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్‌రెడ్డి, సు«దీర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, క్రిశాంక్, వై.సతీష్ రెడ్డి, ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి, కిషోర్ తదితరులు ఉన్నారు. -
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్
ఢిల్లీ: జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఏఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేసింది. జూబ్లీహిల్స్ తెలంగాణలోని అత్యంత ప్రాముఖ్యమైన నగర ప్రాంత నియోజకవర్గాలలో ఒకటి. నవీన్ వైపే సీఎం రేవంత్‌రెడ్డి మొగ్గు చూపింనట్లు సమాచారం.అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. హైదరాబాద్‌లో పార్టీ బలహీనపడిందనే అంచనాల మధ్య అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికను కాంగ్రెస్ గెలుచుకుంది. జూబ్లీహిల్స్‌లోనూ గెలుపే మంత్రంగా ముందుకెళ్లనుంది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లు దీనిపై ఇప్పటికే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.మంత్రులు గడ్డం వివేక్, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్లతో పాటు పెద్ద సంఖ్యలో కార్పొరేషన్ చైర్మన్లు, సీనియర్ నేతలు రంగంలోకి దిగి పని మొదలు పెట్టారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టాలనే ఆలోచనతో పార్టీ నేతలు నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, పేర్లను పరిశీలించారు. అయితే సీఎం రేవంత్ మాత్రం నవీన్ వైపే ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్?
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సహా సునీత పాల్గొన్నారు.తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి.. మాగంటి సునీత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ ఇంచార్జ్‌లను నియమించింది. కార్యకర్తలకు కేటీఆర్.. దిశానిర్దేశం చేస్తున్నారు. -
ఉప ఎన్నికపై దృష్టి పెట్టండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నాయకులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడానికి అనుసరించాల్సిన కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు. ఎర్రవల్లి నివాసంలో బుధవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీ సంతోష్ భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ తరహా ఎజెండాతో ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపై కేసీఆర్ పలు సూచనలు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న అభిప్రాయం, దానిని పార్టీకి అనువుగా మలుచుకోవాల్సిన తీరు.. తదితరాలపై దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరేందుకు వచ్చిన మణుగూరు ప్రాంత నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌ను కలిశారు. కాగా కవిత రాజీనామా, ప్రెస్‌మీట్‌కు సంబంధించి అంశాలపై కేసీఆర్ ఎలాంటి ప్రస్తావన చేయలేదని సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతల భేటీ.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, ఎల్.రమణ, మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్టీ నేతలు ముఠా జైసింహ, ఆజం ఆలీలు ఈ భేటీలో పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గంలోని డివిజన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. నియోజకవర్గం పరిధిలోని ఓటరు జాబితాను డివిజన్లు, బూత్‌ల వారీగా లోతుగా పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాగా, డివిజన్లు, బూత్‌ల వారీగా మైనారిటీ విభాగం కమిటీలు ఏర్పాటు చేయాలని పార్టీ నేతలు కోరారు. త్వరలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మరోమారు సమావేశం జరుగుతుందని ముఖ్యనేతలు వెల్లడించారు. -
జూబ్లీహిల్స్ ఓటర్లు ఎంత మందో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: భారత ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్ విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 30 వరకు ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందన్నారు. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేశాయి. కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ దీమాగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు. -
రాహుల్, ప్రియాంక వయనాడ్‌లో పుట్టి పెరిగారా?
కాంగ్రెస్ పార్టీలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రగడ మొదలైంది. అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఫోకస్ పెంచడం.. స్థానికుడికే టికెట్ కేటాయించాలని నిర్ణయించడం.. గతంలో పోటీ చేసి ఓడిన అజారుద్దీన్‌కే టికెట్ దాదాపు ఖాయమనే సంకేతాలు అందిస్తోంది. ఈ తరుణంలో మరో మైనారిటీ నేత ఫిరోజ్ ఖాన్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ వైపు అధిస్థానం మొగ్గు చూపుతున్న వేళ.. ఆ టికెట్ ఆశావహుడు ఫిరోజ్ ఖాన్ మీడియా ముందుకు వచ్చారు. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో పుట్టి పెరిగారా? వాళ్లెందుకు వయనాడ్‌లో పోటీ చేస్తున్నారు? అని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ అనేది అభ్యర్థి సత్తా, ప్రచారం జరిగే తీరుపై ఆధారపడి ఉంటాయని అంటున్నారాయన. ‘‘సీఎం ఉండే నియోజకవర్గం ఇది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్‌లో ఇల్లు ఉంటేనే సీటు ఇస్తారా?. వయనాడ్‌లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్థానికులా?. స్థానికులకే ఇస్తామనడం సరికాదు’’... అని ఫిరోజ్ ఖాన్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తొలి నుంచి అజారుద్దీన్‌తో పాటు రోహిన్ రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఫిరోజ్ ఖాన్ ఇప్పటిదాకా నాలుగుసార్లు నాంపల్లి(హైదరాబాద్) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడారు. మజ్లిస్ అభ్యర్థి మాజిద్ హుస్సేన్‌కు 39,360 ఓట్లు రాగా, ఫిరోజ్‌కు 36,363 ఓట్లు పోలయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఫిరోజ్ ఖాన్ స్పీచ్‌లకు, డైలాగులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి కన్ఫర్మ్!
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎవరికి వారే అభ్యర్థినంటూ ప్రకటించుకోవద్దంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి సున్నితంగా మందలించిన సంగతి తెలిసిందే. మరోవైపు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ కూడా టికెట్‌ను పార్టీ లోకల్ వ్యక్తికే ఇస్తుందని అన్నారు. ఈ తరుణంలో.. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన మహ్మద్ అజహారుద్దీన్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, రేవంత్‌కు సన్నిహితుడైన రోహిన్‌రెడ్డిలతో పాటు నాంపల్లిలో పోటీ చేసి ఓడిన ఫిరోజ్ ఖాన్, బండి రమేష్, నవీన్ యాదవ్‌ల పేర్లు కాంగ్రెస్ నుంచి చర్చల్లోకి వచ్చాయి. అయితే.. తాజాగా కాంగ్రెస్ మైనారిటీ ప్రతినిధులు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌ను కలిశారు. కేబినెట్లో మైనారిటీలకు ఎలాగూ ప్రాతినిధ్యం లేదని.. కనీసం ఈ ఉప ఎన్నిక టికెట్‌ని అయినా తమ వర్గానికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో అజారుద్దీన్ పేరును వాళ్లు బలపరిచినట్లు తెలుస్తోంది. ఈ విజ్ఞప్తిని పీసీసీ చీఫ్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా.. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ వైపే అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లు సీఎం రేవంత్‌తో చర్చిస్తున్నారు.బీఆర్ఎస్ తరఫున నెగ్గిన మాగంటి గోపినాథ్ మృతితో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. డిసెంబర్‌లోపు ఎన్నికల సంఘం ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ బలాన్ని చూపించేందుకు ఇది ఓ అవకాశంగా భావిస్తున్నారాయన.ఇదీ చదవండి: హెచ్‌సీఏ కంటే జూబ్లీహిల్స్ బైఎలక్షనే నాకు ముఖ్యం -
జూబ్లీహిల్స్ టికెట్.. బయటివాళ్లకు ఇవ్వబోం
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక అభ్యర్థులు ఎవరనేదానిపై రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సీనియర్ నేత, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాన్ లోకల్‌కు టికెట్ ఇచ్చేది లేదని, స్థానికులకే టికెట్ అని మంగళవారం అన్నారు. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంది. పలువురు నేతలు జూబ్లీహిల్స్ నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. కానీ, జూబ్లీహిల్స్ టికెట్ స్థానికంగా పని చేసిన వాళ్లకే ఉంటుంది. అందరి అభిప్రాయాలను తీసుకుని పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుంది. అంతేకాని బయటి నుంచి వచ్చిన వాళ్లకు టికెట్ ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో అది జరగబోదు అని అన్నారాయన. జూన్ 8న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల నిబంధనల ప్రకారం, ఆరు నెలల లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. అందువల్ల, 2025 డిసెంబర్‌లోపు ఈ ఉప ఎన్నిక జరగనుంది.సెప్టెంబర్‌లో విడుదలై.. అక్టోబర్ నెలాఖరులో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఇంతదాకా అభ్యర్థులను ఏ పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. బీఆర్ఎస్ తరఫున మాగంటి సతీమణి సునీత పేరు గతకొంతకాలంగా ప్రచారంలో వినిపిస్తోంది. సానుభూతి ఓట్లను దృష్టిలో ఉంచుకుని టికెట్ ఇవ్వవచ్చని ఊహాగానాలు వెలువడుతున్నాయి. అలాగే.. పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి పేర్లు తెర మీదకు వచ్చాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున అజహారుద్దీన్ పోటీ చేసి ఓడారు. అయితే ఈసారి తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ ప్రకటనలు చేస్తున్నారాయన. హస్తం పార్టీ నుంచి ఫిరోజ్ ఖాన్, రోహిన్ రెడ్డి, విజయా రెడ్డి పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. బీజేపీ నుంచి గతంలో పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డితో పాటు కీర్తి రెడ్డి, డాక్టర్ పద్మ వీరపనేని, బండారు విజయలక్ష్మి పేర్లు వినిపిస్తున్నాయి. ఇక.. మైనారిటీ ఓటర్ల ప్రభావం ఉన్నందున స్వతంత్రంగా పోటీ చేయడమా? లేదంటే ఏ పార్టీతోనైనా పొత్తు ఉంటుందా? అనే దానిపై ఎంఐఎం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. -
జూబ్లీహిల్స్‌పై కమలదళం గురి..
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరంలో బీజేపీ దూకుడు పెంచుతోంది. సమీప భవిష్యత్తులో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఉండగా, ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయి. ఈ రెండింటిలో వచ్చే ఫలితాలు వచ్చే శాసనసభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయనే అంచనాతో ఆ పార్టీ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఉపఎన్నికలో గెలవడంతోపాటు జీహెచ్ఎంసీ (GHMC) పీఠం దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పనిచేస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడానికి మార్గం సుగుమం అవుతుందని గుర్తించిన పార్టీ పెద్దలు స్థానిక నేతలకు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు ద్విముఖ వ్యూహం పాటిస్తోందని నేతలు పేర్కొంటున్నారు.పార్టీలో కొంతమంది నాయకులు అధికార కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరికొంత మంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇదిగో ఆధారాలంటూ సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత గత 11 ఏళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు గల్లీగల్లీలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్, జాతీయ రహదారులు, డిజిటల్ చెల్లింపులు తదితర అంశాలను వివరిస్తున్నారు. సమీప భవిష్యత్తులో గ్రేటర్లో వార్డులవారీగా ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు.దూకుడు పెంచిన నేతలు.. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ నగరంలో కలియదిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు తీరు నుంచి హైడ్రా (HYDRAA) కూల్చివేతల వరకు సమయం చిక్కినప్పుడల్లా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మురికివాడల్లో తన బలగాన్ని వేసుకుని పర్యటిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ నేతలపై పెద్దగా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాత్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పాలనలో జరిగిన లోపాలను లక్ష్యంగా చేసుకున్నారు.ఇన్నాళ్లు పార్టీకి కంటిలో నలుసుగా కనిపించిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) సైతం పార్టీ లైన్లోకి వచ్చినట్లేనని కార్యకర్తలు, నేతలు భావిస్తున్నారు. గతంలో రాజాసింగ్‌ను బండి సంజయ్ కలిసి సర్దిచెప్పారు. ఇటీవల సంజయ్ వ్యాఖ్యలను రాజాసింగ్ బలపరుస్తున్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్భానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా పార్టీలో కీలక నేతల మధ్య అంతర్గత విభేదాలు ఆ పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.జూబ్లీహిల్స్‌పై గురి.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతి చెందడంలో ఆ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండేలా ఎన్నికల వ్యూహాన్ని మార్చుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని అప్రమత్తం చేశారు. దీంతో బీజేపీ సైతం ఎన్నికలకు సమాయత్తమవుతోంది.చదవండి: జూబ్లీహిల్స్‌లో గెలిచే నాయకుడి కోసం హస్తం పార్టీ సర్వే -
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిపై పీసీసీ చీఫ్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనే విషయంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టత ఇచ్చారు. అలాగే తెరపైకి వస్తున్న పేర్ల వ్యవహారంపైనా ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అభ్యర్థి పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని వైఎస్సార్ కొనసాగించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారు. కాబట్టి జూబ్లీహిల్స్ లో కచ్చితంగా అభ్యర్దిని నిలబెడతాం అని అన్నారాయన. మరోవైపు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ సీటు తనదేనంటూ మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ ప్రకటించుకోవడంపైనా మహేష్‌గౌడ్ స్పందించారు. జూబ్లీహిల్స్ సీటు అభ్యర్థి గా ఎవరు ప్రకటించుకున్నా అది వారి వ్యక్తిగతమని, పద్ధతి ప్రకారం దరఖాస్తుల స్వీకరణ తర్వాతే అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టత ఇచ్చారు.మరోవైపు.. వరంగల్ కాంగ్రెస్‌లో నెలకొన్న ముసలం గురించీ ఆయనకు సాక్షి నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి మహేష్ గౌడ్ స్పందిస్తూ.. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు వచ్చింది. ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. డీసీసీ నివేదిక తర్వాత క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. మంత్రులు తమ శాఖకు పరిమితమైతే మంచిదన్న ఆయన.. ఇష్టారితిన మాట్లాడితే నష్టం పార్టీకేనని గుర్తించాలని నేతలకు హితవు పలికారు. -
మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంపై కాంగ్రెస్ కన్ను
సాక్షి, హైదరాబాద్: అధికార కాంగ్రెస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తీవ్రంగా పరిగణిస్తోంది. నగరంలోని మరో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో దక్కించుకునేందుకు పకడ్బందీగా వ్యూహ రచన చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. వాస్తవంగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన జూబ్లీహిల్స్‌లో గట్టెక్కడం క్లిష్టమైనా.. అధికార పక్షం కావడంతో ఉప ఎన్నికల కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని అంచనా వేస్తోంది. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న ధీమాతో జూబ్లీహిల్స్ సీటును కూడా కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి పలువురు టికెట్ ఆశిస్తున్నా.. అధిష్టానం సర్వే నిర్వహించి గెలుపు గుర్రాన్ని బరిలో దింపాలని యోచిస్తోంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా హస్తం హవా కొనసాగి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికి.. రాజధాని నగరంలో ఆ పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. తర్వాత ఉప ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానం దక్కింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉండటంతో మరో నియోజకవర్గం చేజిక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. అయితే.. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గెలుపుపై మజ్లిస్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. వాస్తవంగా నియోజకవర్గంలో మూడోవంతు ముస్లిం ఓటర్లు ఉన్నారు. మజ్లిస్ పార్టీ గత మూడు పర్యాయాలుగా జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈసారి కూడా బరిలో దిగితే కాంగ్రెస్ గట్టెక్కడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.జూబ్లీహిల్స్ సంపన్నులతో పాటు ముస్లింలు అత్యధికం ఉండే నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనతో ఖైరతాబాద్ నుంచి వేరుపడి ఏర్పడ్డ కొత్త నియోజకవర్గం జూబ్లీహిల్స్ 2009 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకుడు పి.జనార్దన్ రెడ్డి ఆకస్మిక మరణంతో జరిగిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. 2014 సాధారణ ఎన్నికల్లో బీజేపీతో పొత్తులో తెలుగుదేశం పార్టీ తరపున నెగ్గిన మాగంటి గోపీనాథ్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి మారి 2018, 2023 వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తూ వచ్చారు. 2009 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన విష్ణువర్ధన్ రెడ్డి 2014, 2018 వరుస ఎన్నికల్లో ఓడిపోయారు. 2023లో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ నిరాకరించి క్రికెటర్ అజహరుద్దీన్‌ను బరిలో దింపడంతో విష్ణువర్ధన్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌కు మాత్రం ఓటమి తప్పలేదు.టికెట్ రేసులో ముగ్గురు నేతలు.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల టికెట్ కోసం తీవ్ర పోటీ నెలకొన్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ముగ్గురు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలైన అజహరుద్దీన్ (Azharuddin) మళ్లీ టికెట్ ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మైనారిటీ కోటా కింద మంత్రి పదవి ఖాయమని ఆయన భావిస్తున్నారు. దీంతో జాతీయ స్థాయిలో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు జూబ్లీహిల్స్‌లో పేరొందిన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఈసారి బరిలో దిగేందుకు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు జూబ్లీహిల్స్ అసెంబ్లీ లేదా సికింద్రాబాద్ ఎంపీ సీటు హామీతో నవీన్ యాదవ్ (Naveen Yadav) కాంగ్రెస్‌లో చేరారు. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ మజ్లిస్ పార్టీ నుంచి పోటీ చేసి 41వేల 656 ఓట్లు సాధించారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో మజ్లిస్ బరిలో దింపక పోవడంతో పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు 18వేల 817 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరినా.. పార్టీ టికెట్ దక్కలేదు. ఈసారి టికెట్ తనకే దక్కుతుందని ఆయన భావిస్తున్నారు.చదవండి: జూలై రెండో వారంలో స్థానిక సంస్థల నగారా కార్మిక నేత దివంగత పీజేఆర్ (PJR) కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి పోటీ చేసినా ఆమెకు విజయం దక్కలేదు. అక్కడి నుంచి గెలిచిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరడంతో భవిష్యత్తులో సైతం ఖైరతాబాద్‌పై ఆశలు వదులుకునే పరిస్థితి నెలకొంది. దీంతో తన తండ్రి చివరిసారిగా ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్‌పై విజయారెడ్డి దృష్టి సారించి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా అధికార కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి.పెరిగిన ఓటు బ్యాంక్‌పై ఆశలు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో ఓటు బ్యాంక్ పెరగడంతో ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సైతం అదే పునరావృత్తమైతే విజయం సునాయాసమేనని కాంగ్రెస్ భావిస్తోంది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కిన బీఆర్ఎస్కు 43.94 శాతం ఓట్లు లభిస్తే కాంగ్రెస్ 35.03 శాతం ఓట్లతో రెండో స్థానానికి పడిపోయింది. లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇక్కడ తన ఓటు శాతాన్ని 50.83కు పెంచుకోగలిగింది. ఉప ఎన్నికల్లో ఓటు బ్యాంకు పునరావృత్తం కావచ్చని అంచనా వేస్తోంది. -
అజారుద్దీన్‌కు భారీ ఊరట.. ముందస్తు బెయిల్ మంజారు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహ్మద్ అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. అజారుద్దీన్‌కు మల్కాజిగిరి కోర్టు ముందస్తు బెయిల్ మంజారు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యుక్షనిగా ఉన్నప్పుడు భారీ అవినీతికు పాల్పడడారని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం విధితమే. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు నియమించిన లావ్ నాగేశ్వర్రావు కమిటీ ఫిర్యాదు మేరకు ఆయనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నాలుగు కేసులు నమోదయ్యాయి. దీంతో అజారుద్దీన్ ముందస్తు బెయిల్ కోసం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఫిటిషన్ను సోమవారం విచారించిన న్యాయస్ధానం అజారుద్దీన్ కు ముందస్తు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా పోలీసుల విచారణకు సహకరించాలని అజారుద్దీన్ ను కోర్టు ఆదేశించింది. కాగా అజారుద్దీన్ జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. చదవండి: WC 2023: బంగ్లాదేశ్ అప్పీలు.. మాథ్యూస్ అవుట్! అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి! -
పొలిటికల్ ట్విస్ట్‌లు.. బీఆర్ఎస్లోకి పీజేఆర్ తనయుడు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నుంచి జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి.. రాకపోవడంతో మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరేందుకు రెడీ అయ్యారు. అలాగే, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, దరువు ఎల్లన్న సైతం బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాగా, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి అధికార బీఆర్ఎస్లో చేరుతున్నారు. కాసేపట్లో మంత్రి హరీష్‌రావు.. దోమలగూడలోని విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్లోకి విష్ణువర్ధన్ రెడ్డిని ఆహ్వానించనున్నారు. మరోవైపు.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో విష్ణువర్ధన్‌రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. బీఆర్ఎస్లో చేరికపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. దీంతో, ఆయన బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో విష్ణువర్ధన్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ టికెట్ ఆశించిన ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించలేదు. అజారుద్దీన్‌కు టికెట్ ఖాయం చేసింది. దీంతో విష్ణువర్ధన్‌రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు వెలువడ్డాయి. తన అనుచరులతో సమావేశమైన విష్ణువర్ధన్ రెడ్డి.. వారి సూచనల మేరకు బీఆర్ఎస్లోకి చేరుతున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి: పక్క పార్టీ నేతల కోసం తెలంగాణ బీజేపీ ఎదురుచూపులు -
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఈసారి ఈ అభ్యర్థి గెలిస్తే హ్యాట్రిక్ ఖాయం...
జూబ్లిహిల్స్ నియోజకవర్గం జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాద్ ఈసారి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాదించారు. 2014లో ఆయన టిడిపి పక్షాన పోటీచేసి గెలుపొందారు. కాని తరుపరి పరిణామాలలో ఆయన టిఆర్ఎస్లో చేరి పోయారు. 2018లో టిఆర్ఎస్ పార్టీ టిక్కెట్‌పై పోటీచేసి తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్ రెడ్డిపై 8385 ఓట్ల మెజార్టీతో గెలిచారు. గోపీనాద్కు 42430 ఓట్లు రాగా, విష్ణువర్దన్ రెడ్డికి 34045 ఓట్లు వచ్చాయి. కాగా ఇక్కడ పోటీచేసిన స్వతంత్ర అబ్యర్ది నవీన్ యాదవ్ సుమారు 17 వేల ఓట్లు తెచ్చుకుని మూడో స్థానంలో ఉన్నారు. జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో 2014లో మాగంటి గోపినాధ్ తన సమీప ప్రత్యర్ధి, ఎమ్.ఐ.ఎమ్. నేత నవీన్ యాదవ్‌పై 9242 ఓట్ల ఆధిక్యతతో విజయం సాదించారు. అంతకుముందు 2009లో గెలిచిన విష్ణువర్ధనరెడ్డి 2014లో 33642 ఓట్లు తెచ్చుకున మూడో స్థానానికి పరిమితం అయ్యారు. విష్ణు దివంగత నేత, మాజీ మంత్రి పి.జనార్ధనరెడ్డి కుమారుడు. 2004లో ఖైరతాబాద్‌లో గెలుపొందిన జనార్ధనరెడ్డి ఆకస్మికంగా గుండెపోటుతో మరణించగా, 2008లో జరిగిన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విష్ణు విజయం సాధించారు. 2009లో ఏర్పడిన జూబ్లిహిల్స్ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచి 2014లో ఓటమి చెందారు. జూబ్లిహిల్స్‌లో ఒకసారి రెడ్డి, రెండుసార్లు కమ్మ నేత గెలుపొందారు జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే...


