
సాక్షి, హైదరాబాద్: భారత ఎన్నికల కమిషన్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం స్పెషల్ సమ్మరీ రివిజన్‌కు షెడ్యూల్ విడుదల చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ వెల్లడించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జులై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. సెప్టెంబర్ 30 వరకు ఓటరు జాబితా ఫైనల్ పబ్లికేషన్ చేయడం జరుగుతుందన్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతితో నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయింది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటికే ప్రచారాన్ని షురూ చేశాయి. కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని ఆ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు మహమ్మద్ అజారుద్దీన్ దీమాగా ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు.
