
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ తరఫున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా దివంగత మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజాగా బీఆర్‌ఎస్ కార్యకర్త సమావేశంలో కేటీఆర్ సహా సునీత పాల్గొన్నారు.
తెలంగాణ భవన్‌లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాగంటి గోపీనాథ్ సతీమణి.. మాగంటి సునీత పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా ఆమె పేరును ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక, ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్‌ఎస్ ఇంచార్జ్‌లను నియమించింది. కార్యకర్తలకు కేటీఆర్.. దిశానిర్దేశం చేస్తున్నారు.