జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అభ్యర్థిపై పీసీసీ చీఫ్‌ క్లారిటీ | Jubilee Hills bypoll: TPCC Chief Clarity On Candidate And Warangal Clashes | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక అభ్యర్థిపై పీసీసీ చీఫ్‌ క్లారిటీ

Jun 20 2025 1:23 PM | Updated on Jun 20 2025 3:59 PM

Jubilee Hills bypoll: TPCC Chief Clarity On Candidate And Warangal Clashes

సాక్షి, హైదరాబాద్‌: మాగంటి గోపీనాథ్‌ మృతితో జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే అక్కడ కాంగ్రెస్‌ తన అభ్యర్థిని నిలబెడుతుందా? లేదా? అనే విషయంపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ స్పష్టత ఇచ్చారు. అలాగే తెరపైకి వస్తున్న పేర్ల వ్యవహారంపైనా ఆయన స్పందించారు.  

శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే అభ్యర్థి పెట్టకుండా ఉండే సంప్రదాయాన్ని వైఎస్సార్‌ కొనసాగించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ దాన్ని బ్రేక్ చేశారు. కాబట్టి జూబ్లీహిల్స్ లో కచ్చితంగా అభ్యర్దిని నిలబెడతాం అని అన్నారాయన. 

మరోవైపు జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్‌ సీటు తనదేనంటూ మాజీ క్రికెటర్‌, మాజీ ఎంపీ అజారుద్దీన్‌ ప్రకటించుకోవడంపైనా మహేష్‌గౌడ్‌ స్పందించారు. జూబ్లీహిల్స్ సీటు అభ్యర్థి గా ఎవరు ప్రకటించుకున్నా  అది వారి వ్యక్తిగతమని, పద్ధతి ప్రకారం దరఖాస్తుల స్వీకరణ తర్వాతే అభ్యర్థి ఎంపిక ఉంటుందని స్పష్టత ఇచ్చారు.

మరోవైపు.. వరంగల్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న ముసలం గురించీ ఆయనకు సాక్షి నుంచి ప్రశ్న ఎదురైంది. దానికి మహేష్‌ గౌడ్‌ స్పందిస్తూ.. వరంగల్ కాంగ్రెస్ పంచాయతీ గాంధీ భవన్ కు వచ్చింది. ఇరు వర్గాలు ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. డీసీసీ నివేదిక తర్వాత క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది అని తెలిపారు. మంత్రులు తమ శాఖకు పరిమితమైతే మంచిదన్న ఆయన.. ఇష్టారితిన మాట్లాడితే నష్టం పార్టీకేనని గుర్తించాలని నేతలకు హితవు పలికారు. 

వరంగల్ కాంగ్రెస్ పంచాయితీ గాంధీ భవన్ కు వచ్చింది: TPCC చీఫ్

Advertisement
 
Advertisement
Advertisement