
సాక్షి, ఢిల్లీ: కేసీఆర్ కుటుంబంలో ముసలం పుట్టిందని.. నలుగురు కలిసి మహిళను అణిచివేస్తున్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ జరిపారు. కేసీఆర్ కుటుంబంలో అధికారం, ఆస్తి పంచాయతీ నడుస్తుంది.. కవితను బయటకు వెళ్లగొట్టింది కేసీఆర్, కేటీఆర్ హరీష్ రావు, సంతోషే.. వారి కుటుంబ పంచాయితీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కవిత కాంగ్రెస్‌లో చేరుతానంటే వ్యతిరేకిస్తానన్న రేవంత్.. కేసీఆర్ కుటుంబాన్ని ప్రజలు సామాజికంగా బహిష్కరించారన్నారు.
‘‘ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో ఉంది. లేకుంటే ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా సీబీఐకి ఇచ్చేవాళ్లం. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తును కిషన్‌రెడ్డి ఆపుతున్నారు. కేటీఆర్ చెప్పినట్టే కిషన్‌రెడ్డి చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓట్లు వేయకపోవడమే నిదర్శనం. కిషన్‌రెడ్డికి సొంత ఆలోచనలు ఉండవు. కేటీఆర్ నుంచే కిషన్‌రెడ్డి సలహాలు తీసుకుంటారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తే అన్ని వివరాలు ఇస్తాం. కమిషన్ నివేదిక సీబీఐకి ఒక పునాదిలా ఉపయోగపడుతుంది’’ అని రేవంత్ చెప్పుకొచ్చారు.