ఆ నిర్ణయంతో బాధపడ్డాను
‘‘నేను హీరోయిన్గా నటించిన ‘డ్రీమ్ గర్ల్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘డ్రీమ్ గర్ల్ 2’ రూపొందింది. సీక్వెల్లోనూ నన్నే కథానాయికగా తీసుకుంటారని ఎంతో నమ్మకం పెట్టుకున్నాను. అయితే, నన్ను కాదని అనన్యా పాండేను హీరోయిన్గా తీసుకున్నారు. వారి నిర్ణయంతో బాధపడ్డాను’’ అని బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ బరుచా తెలిపారు. ఆయుష్మాన్ ఖురానా, నుష్రత్ బరుచా జోడీగా రాజ్ శాండిల్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘డ్రీమ్ గర్ల్’. 2019 సెప్టెంబరు 13న విడుదలైన ఈ మూవీ బాలీవుడ్లో హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డ్రీమ్ గర్ల్ 2’ రూపొందింది.సీక్వెల్లోనూ ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిగా రాజ్ శాండిల్యనే దర్శకత్వం వహించారు. అయితే హీరోయిన్గా అనన్యా పాండేను తీసుకున్నారు. 2023 ఆగస్టు 24న విడుదలైన ఈ చిత్రం కూడా మంచి విజయం అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నుష్రత్ బరుచా మాట్లాడుతూ– ‘‘డ్రీమ్ గర్ల్’లోని నటీనటులందరూ ‘డ్రీమ్ గర్ల్ 2’లోనూ నటించారు. అయితే హీరోయిన్ పాత్రలో నాకు బదులు అనన్యా పాండేని తీసుకున్నారు.యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయాను. కానీ ఈ విషయంపై నేను యూనిట్‌లోని వారితో మాట్లాడలేదు. ఎందుకంటే అవతలి వారి నిర్ణయాలను మనం కంట్రోల్ చేయలేం కదా? తమ సినిమాలో ఎవర్ని తీసుకోవాలి? అనేది మేకర్స్‌పై ఆధారపడి ఉంటుంది. వాళ్ల ఇష్టాన్ని మనం ప్రశ్నించడానికి లేదు. అందుకే బాధపడటం తప్ప ఏమీ చేయలేకపోయాను’’ అని పేర్కొన్నారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్లో వైరల్‌గా మారాయి.