షూ విప్పడం కూడా రాదా? ఇంకేం యోగా చేస్తావ్‌? | Nushrratt Bharuccha Gets Trolled For Making Volunteers Take Off Her Shoes At Yoga Day Event, Video Went Viral | Sakshi
Sakshi News home page

నీ షూలు వేరేవారితో విప్పిస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్‌

Jun 22 2025 4:14 PM | Updated on Jun 22 2025 5:18 PM

Nushrratt Bharuccha gets Trolled for making Volunteers Take Off Her Shoes at Yoga Day Event

బాలీవుడ్‌ హీరోయిన్‌ నుష్రత్‌ బరుచ (Nushrratt Bharuccha) విమర్శలపాలైంది. యోగా ఈవెంట్‌కు వెళ్లి ఆమె చేసిన పనికి అందరూ ఆమెను తిట్టిపోస్తున్నారు. అసలేం జరిగిందంటే.. శనివారం నాడు ముంబైలో జరిగిన యోగా ఉత్సవాల్లో నుష్రత్‌ పాల్గొంది. తెలుపు దుస్తుల్లో అక్కడికి హాజరైన ఆమెకు సొంతంగా షూలు విడిచేందుకు కూడా కష్టమైంది. అక్కడున్న మహిళా వాలంటీర్ల సాయం తీసుకుంది. అమ్మాయి కింద కూర్చుని హీరోయిన్‌ కాలు పట్టుకుని ఆమె షూ లేస్‌ తీసింది.. ఇంతలో నుష్రత్‌.. మరో కాలి షూ కూడా తీసేయమని వేలు పెట్టి చూపించింది. దీంతో ఆమె మరో కాలి షూ కూడా తీసేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అది కూడా చేత​కాదా?
'నీ చేతులతో నువ్వు షూ లేస్‌ తీసేసి పక్కన విడిచిపెట్టలేవా?', 'నీ కాలికున్న షూలు తీసుకోలేవు కానీ యోగా చేస్తున్నావా?', 'నువ్వింకా చిన్న పిల్ల అనుకుంటున్నావా? డబ్బు, పాపులారిటీ చూశాక గర్వం తలకెక్కినట్లుంది' అని నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. నుష్రత్‌.. చివరగా చోరీ 2 సినిమాలో కనిపించింది. విశాల్‌ ఫ్యురియా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్‌ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈమె తెలుగులో శివాజీ తాజ్‌మహల్‌ (2010) మూవీలో హీరోయిన్‌గా నటించింది.

 

 

చదవండి: న్యూజిలాండ్‌లో 7000 ఎకరాలు కొన్నాం: మోహన్‌బాబు

Advertisement
 
Advertisement
Advertisement