breaking news
Anil Menon
-
స్పేస్ వాక్... లోపాల యాంటెన్నా తొలగింపు!
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి సమాచారం పంపించేందుకు అవసరమైన యాంటెన్నాను మార్చే పని వాయిదా పడింది. తాజా స్పేస్ వాక్ ద్వారా వ్యోమగాములు అనిల్మీనన్, సోఫీ అడెనాట్లు ఈ యాంటెన్నాను మార్చాల్సి ఉన్నప్పటికీ తగినంత సమయం లేకపోవడంతో వాయిదా వేయాల్సి వచి్చంది. బుధవారం సుమారు ఆరుగంటల 23 నిమిషాల సమయం వీరిద్దరూ స్పేస్‌వాక్‌లో భాగంగా లోపాలతో కూడిన యాంటెన్నాను తొలగించడంలో విజయం సాధించారు కానీ మార్చడం మాత్రం కుదరలేదు. భారతీయ సంతతికి చెందిన అనిల్ మీనన్‌కు ఇది రెండో స్పేస్ వాక్ కాగా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన సోఫీకి మొదటిది. అయితే స్పేస్ వాక్ చేపట్టిన తొలి ఫ్రాన్స్ వ్యోమగామిగా సోఫీ రికార్డు సృష్టించింది. సక్రమంగా పనిచేయని యాంటెన్నాను తొలగించడం, కొత్తదాన్ని బిగించడం అన్న రెండు లక్ష్యాలతో ఇద్దరు వ్యోమగాములు తమ స్పేస్‌వాక్‌ను ప్రారంభించారు. అయితే విద్యుత్తు, డేటా కనెక్టర్లు బిగుసుకుపోయి ఉండటంతో తొలగింపు ఆలస్యమైంది. అంతేకాకుండా.. యాంటెన్నాలోని గింబల్ అసెంబ్లీలో లాకింగ్ పిన్స్ బిగించడం, యాంటెన్నాను బిగించిన బోల్టులను తొలగించడంలోనూ జాప్యం జరగడంతో కొత్త యంటెన్నా ఏర్పాటుకు సమయం దొరకలేదు. రాచెట్ సాయంతో యాంటెన్నాను తొలగించేందుకు వారు చాలా శ్రమించడాన్ని కూడా నాసా స్క్రీన్లపై కనిపించింది. ఈ నేపథ్యంలో పాడైన యాంటెన్నాను సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు, కొత్త యాంటెన్నాను తీసుకుని బిగించేందుకు తగినంత సమయం లేదని మిషన్ కంట్రోల్ నిర్ణయించింది. కొత్త యాంటెన్నా బిగింపు భవిష్యత్తులో చేపడతామని నాసా ప్రకటించింది. హ్యూస్టన్‌లోని మిషన్ కంట్రోల్ నుంచి డేటా ప్రసారానికి ఈ యాంటెన్నా చాలా కీలకం. అయితే స్పేస్ టు గ్రౌండ్ యాంటెన్నా సాయంతో ఐఎస్ఎస్ పూర్తిస్థాయిలో పనిచేస్తుందని నాసా తెలిపింది. ఐఎస్ఎస్ నిర్మాణం, నిర్వహణల్లో తాజా స్పేస్ వాక్ 282వది కావడం విశేషం. -
అనిల్ మీనన్ స్పేస్‌వాక్
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) విద్యుత్ వ్యవస్థలో మార్పుల కోసం భారతీయ సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ తన మొదటి స్పేస్‌వాక్‌ను శుక్రవారం విజయవంతంగా పూర్తి చేశారు. భవిష్యత్తులో మరిన్ని సౌర ఫలకాలను అమర్చేందుకు అవసరమైన కిట్ ఒకదాన్ని మరో వ్యోమగామి జెస్సికా మీర్ కలిసి బిగించారు. ఐఎస్ఎస్ కార్యక్రమాల్లో ఇది 281వ స్పేస్‌వాక్ కాగా...జెస్సికా మీర్‌కు ఆరోది. ఈ స్పేస్‌వాక్ గురువారం భారతీయ కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6.03 గంటలకు మొదలై శుక్రవారం అర్ధరాత్రి 12.30 గంటలకు పూర్తయ్యింది. ఇద్దరు వ్యోమగాములు క్వెస్ట్ ఎయిర్‌లాక్ నుంచి బయటకు వచ్చి ఆర్బిటల్ లా»ొరేటరీకి సంబంధించిన పనులు చేపట్టారు. ఐఎస్ఎస్ ట్రస్ విభాగంలోని స్టార్‌బోర్డ్ – 6పై ఉన్న స్టేషన్ 3బీ పవర్ ఛానల్‌పై పరికరాలను బిగించడం ఈ స్పేస్‌వాక్ ప్రధాన ఉద్దేశం. దీనివల్ల భవిష్యత్తులో ఐరోసా అని పిలిచే సరికొత్త సౌరఫలకాల అమరిక సులువు అవుతుంది. మడత పెట్టగల ఈ సౌర ఫలకాల వల్ల ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ఆర్బిటల్ లాబొరేటరీకి, అందులోని కీలక వ్యవస్థలకు చాలా అవసరం. అంతేకాకుండా స్పేస్ స్టేషన్ మొత్తాన్ని సురక్షితంగా కక్ష్యలోంచి కిందకు దించేందుకూ సాయపడుతుంది. ఐరోసా సౌరఫలకాలను 2021 నుంచి దశలవారీగా అమరుస్తూ వస్తున్నారు. వ్యోమగాములు గతంలో స్పేస్‌వాక్‌లు నిర్వమించి ఆరు ఐరోసా సౌర ఫలకాలను అమర్చారు. ఏడాది చివరలో మరో రెండు యూనిట్లు ఐఎస్ఎస్కు చేరనున్నాయి. మీనన్, మిర్‌లు ఐరోసా నుంచి 3బీ పవర్ ఛానల్‌కు కేబుళ్లను అమర్చారు. స్ట్రట్లపై ఇన్సులేషన్ పొరలు కప్పారు. మొత్తం ఆరుగంటల 27 నిమిషాలపాటు సాగిన ఈ స్పేస్‌వాక్‌లో మీర్ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఈ సందర్భంగా... ఆమె అనిల్‌తో మాట్లాడుతూ ‘‘అనిల్, నీకు చంద్రుడు కనిపిస్తున్నాడా? నువ్వు ఏ వైపు చూస్తున్నావో నాకు తెలియడం లేదు,’’అని అడగ్గా... మీనన్.. ‘‘నా కుడివైపు. అవును, కనిపిస్తోంది. ముందుగా చెప్పినందుకు ధన్యవాదాలు. అక్కడ భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే స్థావరాన్ని ఊహించగలను’’అని సమాధానమిచ్చారు. మీనన్, మిర్‌లు ఈ నెలలో చేపట్టనున్న స్పేస్‌వాక్‌లలో ఇది మొదటిది. ఆగస్టు 13న జరిగే రెండో స్పేస్‌వాక్‌లో వీరిద్దరూ ఆర్బిటల్ కాంప్లెక్స్‌లోని స్పేస్–టు–గ్రౌండ యాంటెన్నాను మార్చేయనున్నారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో ఉన్న కంట్రోల్ స్టేషన్‌కు, ఐఎస్ఎస్కు మధ్య డేటా ప్రసారానికి, కమ్యూనికేషన్స్‌కు ఈ యాంటెన్నా అత్యవసరం. మూడో స్పేస్‌వాక్‌లో భాగంగా ఆగస్టు 25న ఐఎస్ఎస్ సిబ్బంది వపర్ ఛానెల్ కేబుళ్లను, డేటా రిలే వ్యవస్థలను కలుపుతారు. ఇదంతా ఐఎస్ఎస్ మెయింటెన్స్‌లో భాగం. అలాగే 2030 నాటికి ఐఎస్ఎస్ను సురక్షితంగా సముద్రంలోకి కూల్చేయాలన్న నాసా ప్లాన్‌లో భాగం కూడా. -
ఐఎస్ఎస్కు భారతీయ సంతతి వ్యోమగామి.. ఎవరీ అనిల్ మీనన్?
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ సోయుజ్ఎంఎస్–29 అంతరిక్ష నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు పయనమయ్యారు. అనిల్, రష్యా వ్యోమగాములు ప్యోత్స్ డుబ్రోవ్, అన్నా కికినాలతో రాస్‌కాస్మోస్ అంతరిక్ష నౌక కజఖ్‌స్తాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి మంగళవారం రాత్రి 8.17 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. సోయుజ్ఎంఎస్–29 అర్ధరాత్రి 11.56 గంటలకు ఐఎస్ఎస్తో అనుసంధానమవుతుంది. అనిల్ మీనన్‌కు ఇది మొట్టమొదటి అంతరిక్ష యాత్రకాగా, రష్యా వ్యోమగాములకిది రెండో పర్యటన అని నాసా తెలిపింది. వీరికి బైకనూర్‌లో అనిల్ భార్య అన్నా విల్హెల్మ్ ఇతర కుటుంబసభ్యులు, నాసా ఉన్నతాధికారి జేర్డ్ ఇసాక్‌మన్ వీడ్కోలు పలికారు.మీనన్, డుబ్రోవ్, కికినాలు 8 నెలలపాటు ఐఎస్ఎస్లో గడిపి వస్తారు. ఈ సమయంలో మీనన్ అంతరిక్ష అన్వేషణ, మానవ జీవితానికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై శాస్త్రీయ పరిశోధనలు జరుపుతారని నాసా తెలిపింది.ఎవరీ అనిల్ మీనన్?కేరళలోని పాలక్కడ్‌కు చెందిన శంకరన్ మీనన్ అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన లిసా సామోయిలింకోను ఆయన వివాహం చేసుకున్నారు. వీరిద్దరి సంతానమైన అనిల్ మిన్నియాపోలిస్‌లో జన్మించాడు. అనిల్ మీనన్.. న్యూరోబయాలజీ, మెకానికల్ ఇంజనీరింగ్, వైద్య రంగాలలో డిగ్రీలు పూర్తి చేశారు. ఆయన హెల్త్‌కేర్, అంతరిక్ష పరిశోధన రంగాలను అనుసంధానిస్తూ తన కెరీర్‌ను అద్భుతంగా మలచుకున్నాడు. అనిల్ మీనన్ ప్రస్తుతం యూఎస్ స్పేస్ ఫోర్స్‌లో ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజీషియన్, కల్నల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అంతకుముందు యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారు. ఆ సమయంలో అఫ్గనిస్తాన్‌లో అమెరికా చేపట్టిన ఆపరేషన్ ఎండ్యూరింగ్ ఫ్రీడమ్‌లో ఫ్రంట్‌లైన్ సేవలందించారు. సరిహద్దుల్లోనే కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహకుల ప్రాణాలు కాపాడేందుకు 'హిమాలయన్ రెస్క్యూ అసోసియేషన్' తరపున కూడా అనిల్ పనిచేశారు. అదేవిధంగా రోటరీ అంబాసిడరియల్ స్కాలర్‌గా ఆయన భారత్‌లో ఏడాది పాటు గడిపారు.నాసా టూ స్పేస్ఎక్స్అనిల్ అంతరిక్ష ప్రయాణం 2014లో నాసాతో ప్రారంభమైంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో ఉండే వ్యోమగాముల ఆరోగ్య బాగోగులు చూసుకునే 'ఫ్లైట్ సర్జన్'గా నాసాలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో ఎలోన్ మాస్క్‌కు చెందిన అంతరిక్ష సంస్థ 'స్పేస్ఎక్స్' (SpaceX) లో అనిల్ చేరారు. చంద్రుడు, అంగారకుడి పైకి ప్రయోగించబోయే 'స్టార్‌షిప్' అభివృద్ధిలో అనిల్ మీనన్ కీలకంగా వ్యవహరించారు. అయితే డిసెంబర్ 2021లో నాసా అనిల్‌ను అధికారికంగా వ్యోమగామిగా ఎంపిక చేసింది. ఆ తర్వాత రెండేళ్ల పాటు శిక్షణ పొందాడు. కాగా ఆయన భార్య అన్నా విల్హెల్మ్ కూడా ఒక వ్యోమగామి కావడం గమనార్హం. 2024లో స్పేస్ఎక్స్ నిర్వహించిన ఒక ప్రైవేట్ స్పేస్‌ఫ్లైట్ ద్వారా ఆమె దాదాపు ఐదు రోజుల పాటు అంతరిక్షంలోకి ప్రయాణించారు. -
ఐఎస్ఎస్కు భారతీయ సంతతి వ్యోమగామి మీనన్
వాషింగ్టన్: భారతీయ సంతతికి చెందిన నాసా వ్యోమగామి అనిల్ మీనన్ (49) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) పయనం కానున్నాడు. ఈ నెల 14న కజకిస్తాన్‌లోని బైకనూర్ కోస్మోడ్రోమ్ నుంచి రోస్కోస్మోస్ సోయుజ్ ఎంఎస్29 వ్యోమనౌకలో రష్యన్ కొస్మోనాట్లు ప్యోటర్ డుబ్రోవ్, అన్నా కికినాతో కలిసి ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. అక్కడ ఎనిమిది నెలలపాటు గడపనున్నాడు. దీర్ఘకాలంపాటు అంతరిక్ష ప్రయాణం చేస్తే శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసుకునేందుకు మీనన్ ఐఎస్ఎస్లో ప్రయోగాలు నిర్వహించనున్నారు. అతితక్కువ గురుత్వాకర్షణ శక్తి పరిస్థితుల్లో శరీరంలో రక్త ప్రసరణతోపాటు సిరల నిర్మాణం, రక్తసాంద్రతల్లో వచ్చే మార్పులను పరిశీలిస్తారు. అంతరిక్ష కేంద్రంలోని తాగునీటి వ్యవస్థతో ఐవీఫ్లూయిడ్స్ను తయారు చేసేందుకు సిద్ధం చేసిన టెక్నాలజీలను పరీక్షిస్తారు. ఇలాంటి మిషన్లలో భూమి నుంచి ఎలాంటి వైద్యసాయం అవసరం లేకుండానే ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఐలతో పనిచేయగల టెక్నాలజీలను పరీక్షిస్తారు. కంప్యూటర్లు, ఏఐ, వైద్య పరికరాలకు అవసరమైన సెమీకండక్టర్ స్ఫటికాల తయారీ పద్ధతులను సమీక్షిస్తారు. కేరళ నుంచి అమెరికా వలస వెళ్లిన శంకరన్, ఉక్రెయిన్ నుంచి వలస వచ్చిన లిసా సామోయిలింకోల సంతానమైన అనిల్ మినియాపోలిస్‌లో జని్మంచారు. -
భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్ మీనన్ మరో ఘనత
భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి అనిల్ మీనన్ (Anil Menon) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి తన మొదటి మిషన్‌ను ప్రారంభించబోతున్నారు. ఫ్లైట్ ఇంజనీర్‌గా, ఎక్స్‌పెడిషన్ 75వ సభ్యుడిగా2026 జూన్‌లో జరిగే చారిత్రాత్మకమైన రోస్కోస్మోస్ సోయుజ్ MS-29 అంతరిక్ష యాత్రలో భాగం కానున్నారు. భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో పనిచుస్తున్న కారణంగా నాసా 2026లో అంతరిక్ష యాత్రకు వ్యోమగామి అనిల్ మీనన్‌ను ఎంపిక చేసింది. సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తదుపరి భారతీయ-అమెరికన్ అనిల్ మీనన్ కావడం విశేషం. అనిల్‌తోపాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్ ,అన్నా కికినా (Pyotr Dubrov and Anna Kikina)కూడా ఈ ప్రయాణంలో పాలు పంచుకుంటారు. ఈ ముగ్గురూ కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి బయలుదేరి, కక్ష్యలో తిరిగే ప్రయోగశాలలో దాదాపు ఎనిమిది నెలలు గడుపుతారు. జూన్ 2026 లో ప్రయోగించనున్న తన ఎక్స్‌పెడిషన్ 75 అంతరిక్ష మిషన్‌లో మీనన్ పాల్గొంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రకటనలో తెలిపింది.చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్ తప్పవు మరి!నాసాలో ఫ్లైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మీనన్ ఉక్రెయిన్-భారత సంతతికి చెందిన దంపతులకు జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియా పొలిస్ (మిన్నెసోటా)లో. 1999లో హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీని, పట్టా పుచ్చుకున్నారు. 2021లో అంతరిక్ష సంస్థ వ్యోమగామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 3 సంవత్సరాల కఠినమైన శిక్షణ తర్వాత, 23 వ వ్యోమగామి పట్టభద్రుడయ్యాడు. నాసా ఫ్లయిట్ సర్జన్‌గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు .ISSలో సోయుజ్ మిషన్లు సోయుజ్ 39 - సోయుజ్ 43 లకు డిప్యూటీ క్రూ సర్జన్‌గా, సోయుజ్ 52 కోసం ప్రైమ్ క్రూ సర్జన్‌గా పనిచేశారు. ఈ యాత్రలో, అనిల్ మీనన్ "భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు మానవులను సిద్ధం చేసేలా, మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా శాస్త్రీయ పరిశోధనలు, టెక్నాలజీ ఆవిష్కరణను నిర్వహిస్తారని నాసా వివరించింది.ఇదీ చదవండి: ఎంత కష్టపడినా వెయిట్ తగ్గడం లేదా? ఇవిగో టాప్ సీక్రెట్స్! -
NASA: నాసా కొత్త టీంలో అనిల్ మీనన్
నాసా.. అమెరికా స్పేస్ ఏజెన్సీ. కానీ, ప్రపంచం దృష్టిలో అత్యున్నతమైన అంతరిక్ష ప్రయోగాలకు ఇది నెలవనే అభిప్రాయం ఉంది. అందుకే నాసాలో పని చేయడానికి దేశాలకతీతకంగా సైంటిస్టులు, రీసెర్చర్లు ఉవ్విళ్లూరుతుంటారు. అదే టైంలో టాలెంట్ ఎక్కడున్నా వెతికి పట్టుకోవడంలో నాసా ఎప్పుడూ ముందుంటుంది. ఇదిలా ఉంటే తాజాగా తన కొత్త ఆస్ట్రోనాట్ టీంను ప్రకటించింది. సోమవారం కొత్తగా పది మందితో కూడిన ఆస్ట్రోనాట్ బృందాన్ని ప్రకటించింది నాసా. మొత్తం 12,000 అప్లికేషన్లు రాగా, అందులోంచి ఈ పది మందిని మాత్రమే ఎంపిక చేశారు. వీళ్లంతా నాసా భవిష్యత్తులో చేపట్టబోయే మిషన్లలో పాల్గొననున్నారు. ఇక ఈ టీంలో భారత మూలాలున్న అనిల్ మీనన్ ఇందులో ఒకరు. We're honored to announce the 2021 class of NASA Astronaut Candidates! Get to know them: https://t.co/NbU6BlaTQK. All 10 of these individuals are taking YOUR #askNASA questions, right here on this thread. What do you want to ask them about becoming a NASA Astronaut? pic.twitter.com/byeGl8yphh — NASA Astronauts (@NASA_Astronauts) December 6, 2021 ►45 ఏళ్ల అనిల్ మీనన్.. నాసా ఫ్లయిట్ సర్జన్‌గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు. ►ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో డిప్యూటీ క్రూ సర్జన్‌గా వ్యవహరించారు కూడా. ►డాక్టర్ అనిల్ మీనన్ భారత మూలాలున్న వ్యక్తే. ►నాసాలోని బయోడేటా ప్రకారం.. అనిల్ మీనన్.. ఉక్రెయిన్-భారత సంతతికి చెందిన పేరెంట్స్‌కి జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియాపొలిస్(మిన్నెసోటా)లో. ►1999లో హార్వార్డ్ యూనివర్సిటీ నుంచి న్యూరోబయాలజీలో డిగ్రీ అందిపుచ్చుకున్నారు. ►2004లో స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. ►2009 స్టాన్‌ఫర్డ్ మెడికల్ స్కూల్ నుంచి మెడిసిన్‌లో డాక్టరేట్ పూర్తి చేశారాయన ►యూఎస్ ఎయిర్‌ఫోర్స్‌లో కొంతకాలం విధులు నిర్వహించారు ►2018లో స్పేస్ఎక్స్లో చేరిన అనిల్.. కంపెనీ ఫస్ట్ హ్యూమన్ ఫ్లైట్ ప్రిపరేషన్లో పాలుపంచుకున్నాడు. ►స్పేస్ఎక్స్ ఐదు లాంఛ్లకు సంబంధించి.. ఫ్లైట్ సర్జన్‌గా విధులు నిర్వహించారు. ►కాలిఫోర్నియా ఎయిర్ నేషనల్ గార్డ్‌లో చేరిన మీనన్, అడవుల్లో సంచరించేవాళ్లు హఠాత్తుగా గాయపడ్డ వాళ్లకు చికిత్స అందించడంలో నేర్పరి కూడా. ►ఎమర్జెన్సీ మెడిసిన్, స్పేస్ మెడిసిన్ మీద ఎన్నో సైంటిఫిక్ పేపర్స్ ప్రచురించారాయన. ►ప్రస్తుతం ఆయన ఫ్లయిట్ సర్జన్‌గా నాసాలో పని చేస్తూ.. హోస్టన్‌లో ఉంటున్నారు. భార్య అన్నా మీనన్‌తో అనిల్ ►నాసా ప్రొఫైల్ ప్రకారం.. అనిల్ మీనన్ 2010 హైతీ భూకంప సమయంలో, 2015 నేపాల్ భూకంప సమయంలో, 2011 రెనో ఎయిర్‌షో ప్రమాద సమయంలో ముందుగా స్పందించారు. ►భార్య అన్నా మీనన్‌తో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ►నాసా అడ్మినిస్ట్రేటర్ బిల నెల్సన్.. ఆస్ట్రోనాట్ బృందాన్ని స్వయంగా ప్రకటించారు. వీళ్లను ఐదు కేటగిరీల శిక్షణ ఇప్పిస్తారు. అందులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సంక్లిష్ట సమస్యల పరిష్కారం, స్పేస్‌వాక్ శిక్షణ, సంక్షిష్టమైన రొబోటిక్ స్కిల్స్‌ను డెవలప్ చేసుకోవడం, టీ-38 ట్రైనింగ్ జెట్‌ను సురక్షితంగా ఆపరేట్ చేయడం, చివరగా.. రష్యన్ లాంగ్వేజ్ స్కిల్స్ శిక్షణ. ► 2022 జనవరిలో అనిల్ మీనన్ నాసా ఆస్ట్రోనాట్ టీంలో చేరి.. శిక్షణ తీసుకోవడం ప్రారంభిస్తారు. చదవండి: ఐఎంఎఫ్‌లో నెంబర్ 2 మన ఆడపడుచు -
వలసలతో నెలకో లండన్‌ను నిర్మించొచ్చు
సిస్కో గ్లోబలైజేషన్ సంస్థ అధిపతి అనిల్ మీనన్ హైదరాబాద్: శరవేగంగా జరుగుతున్న పట్టణీకరణ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి గంటకు 1,000 మంది పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్నారని, ఈ జనాభాను ఒకదగ్గరికి చేర్చితే నెలరోజులకో లండన్ స్థాయి నగరాన్ని నిర్మించవచ్చని సిస్కో గ్లోబలైజేషన్ సంస్థ అధిపతి డాక్టర్ అనిల్ మీనన్ అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల నగరాల్లో జననాల రేటు తక్కువగా, ఉన్నత జీవన ప్రమాణాల ఆశలు అధికం గా ఉంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యువ జనాభావృద్ధి రేటు ఎక్కువ ఉందని అన్నారు. దీంతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అతి పెద్ద సవాలుగా మారనుందని అభిప్రాయపడ్డారు. ఇక్కడి హెచ్ఐసీసీలో జరుగుతున్న మెట్రో పొలిస్ సదస్సులో ‘‘భారత దేశం-100 స్మార్టు నగరాలు’’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన చర్చాగోష్టిలో అనిల్ మీనన్ మాట్లాడుతూ.. పౌరుల ప్రేరణ శక్తి, బలమైన రాజకీయ సంకల్పమే స్మార్టు నగరాల విజయానికి కీలకమని అన్నారు. నగర ప్రాంతాల్లో సుందర ఉద్యాన వనాలు, ఖాళీ స్థలాలకు ఏ లోటు ఉండకూడదని స్పెయిన్‌లోని బార్సిలోనా నగర ఉప మేయర్ ఆంటోని వైవ్స్ పేర్కొన్నారు. బార్సిలోనాలో ప్రధాన ట్రాఫిక్ కూడళ్ల ఆకృతి మార్చి భారీ పరిమాణం గల ఉద్యానవనాలుగా తీర్చిదిద్దామని ఆయన వెల్లడించారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో అనుసంధానమై ఇరుగుపొరుగువారు పరస్పర సహాయ సహకారాలను అందించుకునే విధంగా బార్సిలోనాలో ఓ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి టోనీ న్యూవ్లింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు.


