భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్‌ మీనన్‌ మరో ఘనత | The Indian-Origin NASA Astronaut Anil Menon Set to embark on his 1st mission to ISS in 2026 | Sakshi
Sakshi News home page

భారత సంతతి నాసా వ్యోమగామి అనిల్‌ మీనన్‌ మరో ఘనత

Jul 2 2025 2:58 PM | Updated on Jul 3 2025 9:25 AM

The Indian-Origin NASA Astronaut Anil Menon Set to embark on his 1st mission to ISS in 2026

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి అనిల్ మీనన్ (Anil Menon) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కి తన మొదటి మిషన్‌ను ప్రారంభించబోతున్నారు. ఫ్లైట్ ఇంజనీర్‌గా, ఎక్స్‌పెడిషన్ 75వ సభ్యుడిగా2026 జూన్‌లో జరిగే  చారిత్రాత్మకమైన రోస్కోస్మోస్ సోయుజ్ MS-29 అంతరిక్ష యాత్రలో భాగం కానున్నారు. భారతీయ వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ  ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలో  పనిచుస్తున్న  కారణంగా నాసా 2026లో అంతరిక్ష యాత్రకు వ్యోమగామి అనిల్ మీనన్‌ను ఎంపిక చేసింది. సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న తదుపరి భారతీయ-అమెరికన్ అనిల్ మీనన్ కావడం విశేషం. 

అనిల్‌తోపాటు రోస్కోస్మోస్ వ్యోమగాములు ప్యోటర్ డుబ్రోవ్ ,అన్నా కికినా (Pyotr Dubrov and Anna Kikina)కూడా ఈ ప్రయాణంలో పాలు పంచుకుంటారు. ఈ ముగ్గురూ కజకిస్తాన్‌లోని బైకోనూర్ కాస్మోడ్రోమ్ నుండి బయలుదేరి, కక్ష్యలో తిరిగే ప్రయోగశాలలో దాదాపు ఎనిమిది నెలలు గడుపుతారు. జూన్ 2026 లో ప్రయోగించనున్న తన ఎక్స్‌పెడిషన్ 75 అంతరిక్ష మిషన్‌లో మీనన్ పాల్గొంటారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఒక ప్రకటనలో తెలిపింది.

చదవండి: Today tip : ఒళ్లంత తుళ్లింత.. ఈ టిప్స్‌ తప్పవు మరి!

నాసాలో ఫ్లైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మీనన్ ఉక్రెయిన్‌-భారత సంతతికి చెందిన దంపతులకు జన్మించారు. ఆయన పుట్టి పెరిగింది మిన్నియా పొలిస్‌ (మిన్నెసోటా)లో. 1999లో హార్వార్డ్‌ యూనివర్సిటీ నుంచి  న్యూరోబయాలజీలో డిగ్రీని,  పట్టా పుచ్చుకున్నారు.  2021లో అంతరిక్ష సంస్థ వ్యోమగామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 3 సంవత్సరాల కఠినమైన శిక్షణ తర్వాత, 23 వ వ్యోమగామి పట్టభద్రుడయ్యాడు. నాసా ఫ్లయిట్‌ సర్జన్‌గా 2014 నుంచి సేవలు అందిస్తున్నారు .ISSలో సోయుజ్ మిషన్లు సోయుజ్ 39 - సోయుజ్ 43 లకు డిప్యూటీ క్రూ సర్జన్‌గా, సోయుజ్ 52 కోసం ప్రైమ్ క్రూ సర్జన్‌గా పనిచేశారు. ఈ యాత్రలో, అనిల్ మీనన్ "భవిష్యత్ అంతరిక్ష కార్యకలాపాలకు మానవులను సిద్ధం చేసేలా,  మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా శాస్త్రీయ పరిశోధనలు, టెక్నాలజీ ఆవిష్కరణను నిర్వహిస్తారని నాసా వివరించింది.

ఇదీ చదవండి: ఎంత కష్టపడినా వెయిట్‌ తగ్గడం లేదా? ఇవిగో టాప్‌ సీక్రెట్స్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement