- రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు
- కమిటీ ఛైర్మన్‌గా జి.చిన్నారెడ్డి నియామకం
- కమిటీ కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ డైరెక్టర్
- ఎల్‌నినో ప్రభావంపై అంచనా వేయనున్న కమిటీ
హైదరాబాద్: ఎల్‌నినోపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా జి.చిన్నారెడ్డిని నియమించింది. కమిటీ కన్వీనర్‌గా వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఉంటారు. ఎల్‌నినో ప్రభావంపై కమిటీ అంచనా వేయనుంది. కరవు నివారణ చర్యలపై కమిటీ సిఫార్సులు చేయనుంది.
మరోవైపు, శనివారం విద్యుత్ శాఖపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించిన వేళ ఎల్‌నినో సవాళ్లపై ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాభావంతో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు సిద్ధంగా ఉండాలని చెప్పారు. నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు. తాగునీరు, సాగు నీటికి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ పంపిణీలో ఏఐ వినియోగాన్ని విస్తరించాలని ఆదేశించారు. డీటీఆర్ మ్యాపింగ్‌ను గడువులోగా పూర్తి చేయాలని చెప్పారు.


