చెన్నూర్‌లో ఉద్రిక్తత.. అధికారులపై పెట్రోల్‌, కారంతో దాడి | Attack on Endowments Department officials in Chennur | Sakshi
Sakshi News home page

చెన్నూర్‌లో ఉద్రిక్తత.. అధికారులపై పెట్రోల్‌, కారంతో దాడి

Jul 18 2026 2:47 PM | Updated on Jul 18 2026 3:10 PM

Attack on Endowments Department officials in Chennur

సాక్షి, మంచిర్యాల: చెన్నూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దేవాదాయ శాఖ అధికారులకు, భూకబ్జాదారులకు మధ్య ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. జాతీయ రహదారి సమీపంలోని భూములను కబ్జాదారులు అక్రమంగా ఆధీనంలోకి తీసుకన్నారు. దీంతో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి అధికారుల జేసీబీలతో ఆ ప్రాంతంలోకి వెళ్లారు. దీంతో అక్రమదారులు ఒక్కసారిగా దాడులకు తెగబడ్డారు. 

దేవాదాయ శాఖ అధికారులపై పెట్రోల్‌ పోసి కారంపోడి జల్లి మరణాయుధాలతో వెంటాడారు. దీంతో తీవ్ర భయందోళనలకు గురైన అధికారులు వెంటనే అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement