మూడు తరాల తర్వాత పుట్టిన మహాలక్ష్మి..! | Baby Girl Born Affter Three Generations | Sakshi
Sakshi News home page

మూడు తరాల తర్వాత పుట్టిన మహాలక్ష్మి..!

Jul 18 2026 12:09 PM | Updated on Jul 18 2026 1:58 PM

Baby Girl Born Affter Three Generations

పెద్దపల్లి: ఆడపిల్ల భారమని భావించే ఈ రోజుల్లో మూడు తరాల తర్వాత ఆ కుటుంబంలో ఆడపిల్ల జన్మించడంతో ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. మా ఇంటి మహాలక్ష్మి అంటూ చిన్నారి రాకకు ఘనస్వాగతం పలికారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఇల్లుటం మొండయ్య– వెంకటమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. వీరిలో పెద్ద కొడుకు రంజిత్‌కు జ్ఞానప్రసన్నతో వివాహం జరిగింది. 

వీరికి మొదటి సంతానంగా మగబిడ్డ జన్మించాడు. రంజిత్‌ తండ్రి, తాత, ముత్తాత వరకు కుటుంబంలో అందరూ మగ పిల్లలే జన్మించారు. ఇరువై రోజుల క్రితం రంజిత్‌కు కూతురు జన్మించింది. మూడు తరాల తర్వాత తమ కుటుంబంలో మహాలక్ష్మి వచ్చిందని సంబరాలు చేసుకున్నారు. శుక్రవారం పుట్టింటి నుంచి అత్తింటికి ఆడబిడ్డతో వచ్చిన జ్ఞానప్రసన్నకు అత్తింటివారు ఘన స్వాగతం పలికారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement