క్లాస్‌రూంలో ధైర్యం మేరీ క్యూరీ! | Marie Curie: Courage in the Classroom | Sakshi
Sakshi News home page

క్లాస్‌రూంలో ధైర్యం మేరీ క్యూరీ!

Aug 1 2026 1:30 AM | Updated on Aug 1 2026 1:30 AM

Marie Curie: Courage in the Classroom

మహనీయుల బాల్యం

అది పోలాండ్‌ దేశంలోని వార్సా నగరం. అప్పట్లో అక్కడ రష్యా ఆధిపత్యం నడుస్తోంది. పోలిష్‌ భాష మాట్లాడటం, అక్కడి సంస్కృతిని నేర్చుకోవడంపై రష్యా ప్రభుత్వం కఠినమైన ఆంక్షలు విధించింది. ఆ కాలంలో ‘మరియా సలోమియా’ (మేరీ క్యూరీ చిన్నప్పటి పేరు) అనే పదేళ్ల చిన్నారి ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది. మరియా క్లాసులో అందరికంటే చాలా తెలివైంది, చురుకైనది. రష్యన్‌ అధికారులు ఎప్పుడు స్కూల్‌ను తనిఖీ చేయడానికి వచ్చినా క్లాస్‌ టీచర్‌ భయపడుతూ మరియానే పిలిచి ప్రశ్నలకు సమాధానాలు చెప్పమనేవారు. 

ఎందుకంటే మరియా రష్యన్‌ అధికారుల కళ్లల్లోకి కళ్లు పెట్టి, వాళ్ల భాషలోనే తప్పుల్లేకుండా పక్కాగా జవాబులు చెప్పేది. అధికారులు వెళ్ళిపోయాక తన దేశ సంస్కృతిని దూరం చేస్తున్నందుకు క్లాస్‌ రూమ్‌లోనే వెక్కి వెక్కి ఏడ్చేది. ఆ కన్నీళ్లు మరియాను బలహీనపరచలేదు, మరింత మొండి పట్టుదలను పెంచాయి. ఆ రోజుల్లో పోలాండ్‌లో మహిళలకు యూనివర్సిటీలో ప్రవేశం లేకపోవడంతో రహస్యంగా నడిచే ‘ఫ్లయింగ్‌ యూనివర్సిటీ’(రాత్రి వేళల్లో వేర్వేరు ఇళ్లల్లో దొంగతనంగా నడిచే క్లాసులు)లో చేరి మరియా  ప్రాణాలకు తెగించి చదువుకుంది. ట్యూషన్లు చెప్పుకుంటూ డబ్బు దాచుకుని పారిస్‌ వెళ్లి ఫిజిక్స్, మ్యాథ్స్‌ చదివింది. ఆ పట్టుదలే ఆమెను ప్రపంచం గర్వించే ‘మేరీ క్యూరీ’గా మార్చింది! 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement