రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ దాడులు  | Ukrainian strikes hit of Russia biggest oil refineries | Sakshi
Sakshi News home page

రష్యా రిఫైనరీలపై ఉక్రెయిన్‌ దాడులు 

Jul 30 2026 5:49 AM | Updated on Jul 30 2026 5:49 AM

Ukrainian strikes hit of Russia biggest oil refineries

కీవ్‌: రష్యాపై ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి క్షిపణుల దాడిని కొనసాగిస్తోంది. అమెరికా సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అమెరికా వచ్చిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మంగళవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయిన కొన్నిగంటలకే రష్యాపై ఉక్రెయిన్‌ దాడులను ఉధృతంచేయడం గమనార్హం. రష్యాలోని పెర్మ్‌ రీజియన్‌లోని లూక్‌ఆయిల్‌ రిఫైనరీ, రియాజన్‌లోని మరో చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్‌ దాడులు చేసింది. 

ఈ రెండు రిఫైనరీల ఉమ్మడి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం ఏకంగా 3 కోట్ల టన్నులుకావడం గమనార్హం. ఇంతటి భారీ రిఫైనరీలపై దాడి చేసి ఇన్నాళ్లూ యుద్ధంలో రష్యా సాయుధరంగ ఇంధన అవసరాలు, దేశ ఖజానాకు నష్టం చేకూర్చామని ఉక్రెయిన్‌ సెక్యూరిటీ సర్వీసెస్, జనరల్‌ స్టాఫ్‌ విభాగం ప్రకటించింది. అయితే తమ రిఫైనరీలకు ఎలాంటి నష్టం జరగలేదని, పారిశ్రామిక వాడల్లో డ్రోన్ల దాడుల్లో గాయపడిన ఆరుగురికి ఆస్పత్రుల్లో చేరి్పంచామని రష్యాలోని రియాజన్‌ గవర్నర్‌ పావెల్‌ మాల్కోవ్‌ తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement