టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా? | Taylor Swifts Rs 9 Lakh Ruby-Diamond Ring At Songwriters Hall Of Fame | Sakshi
Sakshi News home page

సాంగ్‌ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా?

Jun 14 2026 3:18 PM | Updated on Jun 14 2026 4:00 PM

Taylor Swifts Rs 9 Lakh Ruby-Diamond Ring At Songwriters Hall Of Fame

ఈ ఏడాది సాంగ్‌రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్ వేడుకలో పాప్‌ గాయని, గేయ రచయిత్రి టేలర్ స్విఫ్ట్ ప్రదాన ఆకర్షణగా నిలిచింది. ఆమె ధరించిన డ్రెస పరంగానే కాకుండా చేతికి ధరించి ఉంగరం అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అంతేగాదు ఈ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ కార్యక్రమానికి విచ్చేసిన అత్యంత పిన్నవయస్కురాలిగా కూడా చరిత్ర సృష్టించిందామె. 

ఈ ప్రత్యేక వేడుక కోసం పాప్‌ ఐకాన్‌ టేలర్‌ స్విఫ్ట్‌ హుందాగా బ్లాక్‌ కలర్‌ పూల గివెన్చీ గౌనులో రెడ్‌కార్పెట్‌పైకి అడుగుపెట్టింది. దూరం నుంచి చూస్తే ఆ గౌను చాలా సింపుల్‌గా క్లాసిక్‌గా ఉన్నా..దగ్గరకు వస్తే..ఆ డ్రెస్‌పైనే కనిపిస్తున్న ఎండ్రాయిడరీ పూల లుక్‌ హైలెట్‌గా నిలవడం విశేషం. 

ఈ డిజైనర్‌వేర్‌కి అనుగుణంగా చేతిక ధరించి ఆభరణంతో..భారతీయతను జోడించింది. టేలర్‌ స్విఫ్ట్‌ చేతికి భారతీయ లగ్జరీ ఆభరణాల సంస్థ అమ్రపాలి జ్యువెల్స్‌ రూబీ డైమండ్‌ ఉంగరం ధరించింది. రాజస్థాన్‌ 18 క్యారెట్‌ డైమండ్‌ అండ్‌ రూబీ రింగ్‌గా పిలిచే ఆభరణం ప్రత్యేకంగా నిలవడమే గాక, అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. ఈ ఉంగరం 18-క్యారెట్ బంగారంలో పొదిగిన 2.41-క్యారెట్ల అండాకారపు రూబీ రత్నం. దాని చుట్టూ పూల వలయం ఆకారంలో మెరిసే రోజ్-కట్ వజ్రాలు అమర్చబడి ఉన్నాయి. 

ముదురు గులాబీ-ఎరుపు రంగు రూబీ ఈ ఆభరణానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా, వజ్రాలు పాతకాలపు శోభను, పురాతన హస్తకళా నైపుణ్యాన్ని హైలెట్‌ చేశాయి. దీన ధర వచ్చేసి భారత కరెన్సీ ప్రకారం అక్షరాల రూ. 9.4 లక్షలట. ఈ మేరకు అమ్రపాలి జ్యువెల్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో ఇది భారతీయ రాజరిక హస్తకళకు నిజమైన నివాళిగా పేర్కొనడం గమనార్హం. అలాగే మరో చేతి వజ్రాల బ్రాసెలెట్‌, సున్నితమైన సిట్రిన్‌ డ్రాప్‌చెవిపోగులను జతచేస్తూ..చాలా సింపుల్‌గా లగ్జరీయస్‌గా సందడి చేసింది టేలర్‌ స్విఫ్ట్‌. 

(చదవండి: పుట్టుకతో ముంజేయి లేని ఐఐటీ గ్రాడ్యుయేట్‌ సివిల్స్‌ విజయగాథ..! తొలి ప్రయత్నంలోనే సఫలం కానీ..)
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement