ఘనంగా టేలర్‌ స్విఫ్ట్, కెల్సే వివాహం | Taylor Swift and Travis Kelce grand wedding | Sakshi
Sakshi News home page

ఘనంగా టేలర్‌ స్విఫ్ట్, కెల్సే వివాహం

Jul 5 2026 5:05 AM | Updated on Jul 5 2026 5:05 AM

Taylor Swift and Travis Kelce grand wedding

మాడిసన్‌ స్క్వైర్‌ గార్డెన్‌ వేదికగా పెళ్లి 

భారీగా హాజరైన సెలబ్రిటీలు, నటులు, అథ్లెట్లు 

అభిమానులకు దక్కని దర్శనం

న్యూయార్క్‌: అమెరికన్‌ పాప్‌ సింగర్, గేయ రచయిత టేలర్‌ స్విఫ్ట్‌ వివాహం ఫుట్‌బాల్‌ ఆటగాడు ట్రావిస్‌ కెల్సేతో న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వైర్‌ గార్డెన్‌లో శనివారం వైభవంగా జరిగింది. హాలీవుడ్‌ నటుడు, కమిడియన్‌ ఆడమ్‌ శాండ్లర్‌ పెళ్లి పెద్దగా వ్యవహరించారు. సింగర్‌ కామిలా కాబెల్లో, నటులు హ్యూగ్‌ గ్రాంట్, ఈథన్‌ హాక్, జేసన్‌ సుడైకిస్, మోడల్‌ కార్లీ క్లాస్‌ వంటి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

ట్రావిస్‌ కెల్సే టీమ్‌ మేట్‌ కరీమ్‌ హంట్, రన్నింగ్‌ బ్యాక్‌లు, సియాటెల్‌ సీహాక్స్‌ ఆటగాడు, తాజా సూపర్‌ బౌల్‌ ఛాంపియన్‌ కూపర్‌ కుప్, న్యూయార్క్‌ జెయింట్స్‌ ఆటగాడు జుజు స్మిత్‌ షూస్టర్, ఎన్‌ఎఫ్‌ఎల్‌ అనౌన్సర్‌ జో బక్, ‘ద సమ్మర్‌ ఐ టర్న్‌డ్‌ ప్రెట్టీ’ పుస్తక రచయిత జెన్నీ హ్యాన్‌ తదితరులూ వివాహానికి హాజరైన వారిలో ఉన్నారు. మాన్‌హటన్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక భారీ టెంట్‌లో వివాహమైన తరువాత ‘జస్ట్‌ అండ్‌ టీ మ్యారీడ్‌’ అన్న బోర్డు ప్రత్యక్షమైంది. తోడు పెళ్లి కూతురు, తోడి పెళ్లి కొడుకు లాంటి (బ్రైడ్స్‌మెయిడ్, గ్రూమ్స్‌మెన్‌ అంటారు) వారు ఎవరూ లేకుండా వివాహం జరగడం గమనార్హం.

క్రిస్టియన్‌ డియోర్‌ హాటే కౌచర్‌కు చెందిన జోనథన్‌ ఆండెర్సన్‌ డిజైన్‌ చేసిన దుస్తుల్లో వధూవరులిద్దరూ ధగధగ మెరిసిపోయారు. ఇద్దరి కాలిజోళ్లను క్రిస్టియన్‌ లౌబౌటిన్‌ ప్రత్యేకంగా తయారు చేశారు. టేలర్‌ స్విఫ్ట్‌ కార్టీయర్‌ బ్రాండ్‌ నగలతో అందరి దృష్టిని ఆకర్శించింది. ఒక పక్క ఎండలు మండిపోతున్నా స్విఫ్ట్‌, ట్రావిస్‌ అభిమానులు చాలామంది మాడిసన్‌ స్కై్వర్‌ గార్డెన్‌ బయట భారీ ఎత్తున గుమికూడారు. అయితే వివాహం తాలూకూ దృశ్యాలు కొంచెం కూడా కనిపించకపోవడం వారిని నిరాశ పరిచిందని చెప్పాలి. వివాహం మొత్తాన్ని రహస్యంగానే నిర్వహించాలని అనుకున్నా ఈ వారం ‘ద అసోసియేటెడ్‌ ప్రెస్‌’ తీసుకున్న ఒక పరి్మషన్‌ ఈ హై ప్రొఫెల్‌ వివాహం గురించి అందరికీ తెలిసేలా చేసింది. స్విఫ్ట్, ట్రావిస్‌ల పెళ్లి గురించి చాలాకాలంగా ఊహాగానాలు వచ్చాయి. ఈ వార్తలు అమెరికాలోనే అత్యంత పాపులర్‌ ఎన్‌బీఏ గేమ్స్‌ కంటే ప్రాచుర్యం పొందడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement