
అనుష్క శెట్టి, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ఘాటీ.. భారీ అంచనాలతో సెప్టెంబర్ 5న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో అనుష్క నెవర్ బిఫోర్ అనేలా దుమ్మురేపింది అంటూ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి వయొలెన్స్ చిత్రంగా క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మించాయి.

ఘాటీ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డ్ జారీ చేసింది. ఈ మూవీ 2గంటల 37నిమిషాల నిడివి ఉన్నట్లు పేర్కొంది. అయితే, ఏడుకు పైగా భారీ యాక్షన్ సీన్స్ ఈ చిత్రంలో ఉన్నాయని సమాచారం. అందులో అనుష్క ఇరగదీసిందని చెప్పుకొస్తున్నారు. ఈ సినిమాకు ఇవే ప్రధాన బలం అంటూ సమాచారం. వాటిని థియేటర్స్‌లో చూసిన వారు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని టాక్ వస్తుంది. గంజాయి సరఫరా చేసే పాత్రలో అనుష్క రస్టిక్ పర్ఫార్మెన్స్‌తో ఇరగదీసిందని చెప్పవచ్చు. ట్రైలర్‌లో వినిపించిన ఒక డైలాగ్ 'సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటాదో చూద్దూగానీ' సోషల్‌మీడియాలో భారీగా వైరల్ అయింది. సినిమా కూడా అంతే పవర్‌ఫుల్‌గా ఉండనుందని టాక్ వినిపిస్తోంది.