
అనుష్క (Anushka Shetty) నటించిన ఘాటీ సినిమా కోసం ప్రభాస్ ఎంట్రీ ఇచ్చారు. అనుష్క యాక్షన్ సీన్స్‌కు సంబంధించిన గ్లింప్స్ను ఆయన విడుదల చేశారు. స్వీటీ సినిమా ప్రమోషన్ కోసం బాహుబలి ఎంట్రీ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. దర్శకుడు క్రిష్ (Krish Jagarlamudi) తెరకెక్కించిన ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యు.వి.క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి.
కొన్ని కారణాలవల్ల ఘాటీ సినిమా ప్రమోషన్స్కు అనుష్క దూరంగా ఉన్నారు. అయితే, ఫోన్ ద్వారా ఆమె ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు. తాజాగా ఘాటీ కోసం సడెన్గా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో మరింత బజ్ క్రియేట్ కానుంది.