
‘‘ఘాటి’ చిత్రంలో నాపాత్ర రెగ్యులర్ విలన్‌లా ఉండదు. ‘ఈ సినిమాలో నీపాత్రను నేను విలన్‌లా చూడట్లేదు. ఒక మెయిన్‌పాత్రగానే చూస్తున్నాను’ అని క్రిష్‌గారు చెప్పారు. ఈ మూవీలో నాపాత్ర కీలకంగా ఉంటుంది. నా కెరీర్‌లో ఇదొక ఐకానిక్ క్యారెక్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చైతన్యా రావు చెప్పారు. అనుష్క, విక్రమ్ ప్రభు ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మించారు.
ఈ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కీలకపాత్ర చేసిన చైతన్యా రావు విలేకరులతో మాట్లాడుతూ– ‘‘నిర్మాత రాజీవ్‌గారు క్రిష్‌గారిని కలవమన్నారు. ఆయన ‘ఘాటీ’ కథ, నాపాత్ర గురించి చెప్పారు. ఆపాత్రలో నన్ను ఎలా ఊహించుకున్నారో అర్థం కాలేదు. సీరియస్ అండ్ వైలెంట్ రోల్ నాది. అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా కోసం ఒక జలపాతం వద్ద సీన్ తీయాలి.
అది ప్రమాదకరమైనా అనుష్కగారు చేశారు. ఈ సీన్ చూసినప్పుడు ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. నేను అనుష్కగారికి చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో నటించడం మరచిపోలేను. యూవీ క్రియేషన్స్‌లో పని చేయడం గొప్ప అనుభూతి. సత్యదేవ్, ఫాహద్ ఫాజిల్‌లా నేను కూడా అన్ని రకాలపాత్రలు చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం క్రాంతి మాధవ్‌గారితో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.