
కన్నడ హీరో యష్ మాతృమూర్తి 'పుష్ప' నిర్మాతగా కొద్దిరోజుల క్రితమే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. అయితే, ఆమె ఇప్పుడు పాన్ ఇండియా సినిమాను కన్నడలో విడుదల చేసేందుకు ఆ చిత్ర హక్కులను పొందారు. పుష్ప తన భర్త అరుణ్ కుమార్‌తో కలిసి PA (Pushpa Arun Kumar) ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించారు. రీసెంట్‌గా కొత్తలవాడి అనే కన్నడ చిత్రాన్ని నిర్మించి విడుదల చేశారు. ఇప్పుడు అనుష్క నటించిన ఘాటీ చిత్రం కర్ణాటక హక్కులను ఆమె పొందారు.

అనుష్క ప్రధానపాత్రలో నటించిన ఘాటీ చిత్రం సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వం వహించారు. విక్రమ్ ప్రభు, జగపతిబాబు, చైతన్యరావు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఘాటీ చిత్రాన్ని కర్ణాటకలో యష్ అమ్మగారు పుష్ప విడుదల చేయనున్నారు. దీంతో కన్నడలో మంచి ఓపెనింగ్స్ ఉండనున్నాయి.