రక్షణ రంగంలోకి సింహ 4x4 | Kalyani and Paramount unveil Simha 4x4 light armoured vehicle for military use | Sakshi
Sakshi News home page

రక్షణ రంగంలోకి సింహ 4x4

Jun 21 2026 6:38 PM | Updated on Jun 21 2026 6:38 PM

Kalyani and Paramount unveil Simha 4x4 light armoured vehicle for military use

భారత్‌ ఫోర్జ్‌ లిమిటెడ్‌కు చెందిన రక్షణ రంగ అనుబంధ సంస్థ ‘కల్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌’ (కేఎస్‌ఎస్‌ఎల్‌), అంతర్జాతీయ రక్షణ సంస్థ ‘పారామౌంట్‌’తో కలిసి సరికొత్త నెక్ట్స్‌ – జనరేషన్‌ లైట్‌ ఆర్మర్డ్‌ మల్టీ–పర్పస్‌ వాహనం ‘సింహ 4x4’ ను మార్కెట్లోకి తెచ్చాయి.

నాటో ప్రమాణాలకు అనుగుణంగా సాయుధ దళాల ఆధునిక అవసరాలతో పాటు, అంతర్జాతీయ రక్షణ డిమాండ్లను తీర్చేలా ఈ వాహనాన్ని సరికొత్త డిజైన్‌తో రూపొందించారు. పట్టణ ప్రాంతాల్లో రక్షణ ఆపరేషన్లు, రోడ్లపై, కఠిన భూభాగాల్లో నిఘా పెట్టడానికి ఈ ‘సింహ 4x4’ అనుకూలంగా ఉంటుంది. దీనిలోని మోడ్యులర్‌ ఆర్కిటెక్చర్‌ కారణంగా అవసరానికి తగ్గట్టుగా మార్పులు, చేర్పులు (అప్‌గ్రేడ్లు) చేసుకోవడం సులువవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement