అప్పట్లో ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనపడింది: రేవంత్‌ రెడ్డి | BRS Government Neglected Public Schools Claims CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

అప్పట్లో ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనపడింది: రేవంత్‌ రెడ్డి

Jul 15 2026 6:06 PM | Updated on Jul 15 2026 6:21 PM

BRS Government Neglected Public Schools Claims CM Revanth Reddy

కొత్తకోట: బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రభుత్వ స్కూళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. చదువే జీవితాల్లో మార్పులు తీసుకొస్తుందని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో సర్కారీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గితే, తమ పాలనలో స్టూడెంట్స్‌ సంఖ్య పెరిగిందని చెప్పారు. చదువే మన ఆత్మ గౌరవవాన్ని నిలబెట్టుతోందని అన్నారు.

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీల నుంచి యూనివర్సిటీల వరకు ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే కనపడిందని రేవంత్‌ రెడ్డి చెప్పారు. బీఆర్‌ఎస్‌ పాలనలో నిర్లక్ష్యం కారణంగా విద్యాలయాల్లో సదుపాయాలు లేవని అన్నారు. విద్యార్థుల త్యాగాలతో వచ్చిన తెలంగాణలో విద్యాలయాలు, విద్య పటిష్ఠంగా ఉండాలని చెప్పారు. విద్యార్థులకు టెక‍్నికల్‌ నాలెడ్జ్‌ అవసరమని అభిప్రాయడ‍్డారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement