సాక్షి, హైదరాబాద్: శిఖాగోయల్, సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర లాంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ కేడర్‌లోకి తీసుకోవడంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిలకు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణ డిసెంబర్ 10కి వాయిదా వేసింది.
కొందరు ఐపీఎస్ అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ సెప్టెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ 1342ను సవాల్ చేస్తూ సికింద్రాబాద్ తార్నాకకు చెందిన వడ్ల శ్రీకాంత్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సూరేపల్లి నందా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పౌర సరఫరాల కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్‌గా శిఖాగోయల్, హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం నియమించడం చట్టవిరుద్ధమన్నారు.
చట్టాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచి్చన జీఓ చెల్లదని చెప్పారు. రాష్ట్రంలో కీలకమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులే దర్యాప్తు చేస్తున్నారని, ఆ నివేదిక కూడా హోంశాఖ ముఖ్య కార్యదర్శి (ప్రస్తుతం ఐపీఎస్ అధికారి)కే పంపడం సరికాదన్నారు. ఇండియన్ అడ్మిని్రస్టేటివ్ సరీ్వస్ (కేడర్) రూల్స్, 1954ను ఉల్లంఘస్తూ ఏకపక్షంగా ఇచి్చన జీఓను కొట్టివేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ రాహుల్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి సమయం కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు.


