కాళేశ్వరంపై తీర్పు.. హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు | BRS Harish Rao Key Comments On High Court Judgement | Sakshi
Sakshi News home page

కాళేశ్వరంపై తీర్పు.. హరీష్‌ రావు కీలక వ్యాఖ్యలు

Apr 22 2026 12:04 PM | Updated on Apr 22 2026 12:16 PM

BRS Harish Rao Key Comments On High Court Judgement

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం కేసులో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. కాళేశ్వరం విషయంలో జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ రిపోర్టును హైకోర్టు నిలిపివేసింది. రిపోర్టు ఆధారంగా చర్చలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్‌ రావు స్పందించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ కక్ష సాధింపులు ఆపాలి అంటూ మండిపడ్డారు. సత్యమేవ జయతే అంటూ ట్వీట్‌ చేశారు.

మాజీ మంత్రి హరీష్‌ రావు ట్విట్టర్‌ వేదికగా..‘ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ధర్మం జయించింది. కాంగ్రెస్‌ కుట్రలు బయటపడ్డాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలాడారు. హైకోర్టు తీర్పుతో రేవంత్‌ నిజ స్వరూపం బయటపడింది. ఇప్పటికైనా కాంగ్రెస్‌ కక్ష సాధింపులు ఆపాలి. పిల్లర్ల మరమ్మత్తులు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ముమ్మాటికీ కాళేశ్వరం.. తెలంగాణకు ప్రాణేశ్వరమే’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement