ఇమ్మిగ్రేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు మార్గదర్శకాలను యాంత్రికంగా అమలు చేయకుండా.. కొంత మానవత్వం అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. మన దేశానికి చెందిన వ్యక్తిని వివాహమాడి భర్త మరణంతో తీవ్ర బాధలో ఉన్న రష్యన్ మహిళ వీసా పొడిగింపునకు ఇమ్మిగ్రేషన్ అధికారులు అభ్యంతరం తెలుపడాన్ని తప్పుబట్టింది. సంతానంలేని వితంతువుకు వీసా పొడిగింపు ను నిరాకరించడం ఆలోచనారహిత మని వ్యాఖ్యానించింది. బాధిత మహిళకు ఎలాంటి జరిమానా విధించకుండా వీసా పొడిగించాలని అధికారులను ఆదేశించింది.
రష్యన్ మహిళ అలెనా ఎవ్జెనియెవ్నా పావ్లోవా.. గత 8 ఏళ్లు గా భారత్, రష్యా తిరుగుతూ సత్యసాయి సంస్థలో సేవ చేస్తున్నారు. భగవద్గీతను రష్యన్ భాషలోకి అనువదిస్తున్నా రు. 2024లో భారతీయుడిని వివాహం చేసుకోగా.. ఏడా ది తర్వాత అతను అనారోగ్యంతో మరణించారు. ఈ నేప థ్యంలో కార్యక్రమాలు పూర్తి చేయడానికి, అత్తకు తోడు ఉండటానికి వీలుగా వీసా గడువు పొడిగించాలని ఆమె కోరారు. వీసా పొడిగింపునకు చేసుకున్న దరఖాస్తును అధి కారులు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అలెనా హైకోర్టు ను ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. భర్త మరణంతో వితంతువుగా మారిన విదేశీ వని త వీసా పొడిగింపునకు నిబంధనల పేర బాధపెట్టడం సరికాదన్నారు. అధికారులు చెబుతున్న మార్గదర్శకాలు సరైనవే అయినా.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో విచక్షణ వినియోగించాలని అభిప్రాయపడ్డారు. మానవత్వంతో ఆమె దరఖాస్తు పరిగణనలోకి తీసుకుని వీసా గడువును పొడి గించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలు దేశాల మధ్య బంధాలను బలోపేతం చేస్తాయని వ్యాఖ్యానించారు.


