హెచ్‌సీఏ అధ్యక్షుడికి భారీ షాక్‌ | Hcas presidents election invalid telangana high courts sensational verdict | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏ అధ్యక్షుడికి భారీ షాక్‌

Jun 8 2026 1:07 PM | Updated on Jun 9 2026 11:20 AM

Hcas presidents election invalid telangana high courts sensational verdict

హైద‌రాబాద్ క్రికెట్ అసోయేషిన్ అధ్యుక్షుడిగా అమర్‌నాథ్ నియ‌మాకంపై తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. అత‌ని నియ‌మాకం చెల్ల‌ద‌ని, ప్రెసిడెంట్ ప‌ద‌వి నుంచి తొలిగించాల‌ని హెచ్‌సీఏ కార్య‌ద‌ర్శి జీవ‌న్ రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది. స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని వెంటనే ఎన్నికోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సూచించింది. 

కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌సీఎ నూతన అధ్యుక్షుడిగా అమర్నాథ్ పేరును  రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్‌మన్ సురేష్ కుమార్ కైత్ ప్రకటించారు. 2023లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో జగన్ మోహన్ రావ్ చేతిలో అమ‌ర్నాథ్ కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడు. 

అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రావ్  అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ కావడంతో ప్రెసిడెంట్ పదవి నుంచి అతడిని తప్పించారు. ఆ స్ధానంలో రన్నరప్‌గా నిలిచిన అమర్నాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు అతడి ఎంపిక కూడా చెల్లదని కోర్ట్‌ తీర్పునివ్వడంతో మరోసారి హెచ్‌సీఎ ప్రెసెడింట్‌ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement