మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మాజీ మంత్రులు కేటీ రామారావు, హరీశ్‌రావులపై 2011లో మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులను హైకోర్టు కొట్టివేసింది. శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేపట్టిన ఉద్యమంలో భాగంగా 2011, మార్చి 10న ట్యాంక్ బండ్ వద్ద మిలియన్ మార్చ్ జరిగింది.
కాగా, కేసీఆర్, కేటీఆర్, హరీశ్ సహా సుమారు 50 మంది తమను అసభ్య పదజాలంతో దూషించారని, తమ వద్ద కెమెరా, మైకులు లాక్కుని దాడి చేశారని, వీడియో కెమెరాను ట్యాంక్ బండ్‌లోకి విసిరేశారని జర్నలిస్టులు రాజు, ప్రసాద్, సూర్యప్రకాశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు హైదరాబాద్‌లోని సీసీఎస్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. ట్రయల్‌కోర్టు వీరిపై విచారణ చేపట్టి.. ఇతర నిందితులంతా నిర్దోషులని 2013లో తీర్పునిచి్చంది. అయితే, కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను మాత్రం ’పరారీలో ఉన్న నిందితులుగా’ పేర్కొంది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్, కేటీఆర్, హరీశ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌లపై జస్టిస్ సుజన కళాసికం ధర్మాసనం విచారణ చేపట్టి.. కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.


